E-Paper
Advertisement

విమాన ప్రయాణికులకు షాక్.. 60% ఉచిత సీట్ల రూల్ కు బ్రేక్!

విమాన ప్రయాణికులకు షాక్.. 60% ఉచిత సీట్ల రూల్ కు బ్రేక్!
Advertisement

Air Travel Update: విమాన ఇంధన ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. విమానాల్లో కనీసం 60 శాతం సీట్లను ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా కేటాయించాలన్న నిర్ణయం విషయంలో వెనక్కి తగ్గింది. ఈ నిబంధనను ప్రస్తుతం తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. మరోసారి సమీక్షించిన తర్వాత అమలు చేయాలనే నిర్ణయానికి వచ్చింది.

ఏప్రిల్ 20న అమల్లోకి రావాల్సి ఉండగా..

ప్రయాణికులకు సమాన అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, మార్చి 18న డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కు ఈ ఆదేశాలను ఇచ్చింది. ఈ నిబంధన ఏప్రిల్ 20 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. ఈ రూల్ ప్రకారం ప్రకారం, విమానయాన సంస్థలు కనీసం 60 శాతం సీట్లను ఉచితంగా ఎంపిక చేసుకునే అవకాశం ఇవ్వాలి. ఈ నిర్ణయం కారణంగా ప్రయాణికులకు ఊరట లభించనుంది.

ఫ్యూయెల్ ధరలు పెరగడంతో..

Advertisement

కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో పరిస్థితులు మారాయి. ముఖ్యంగా, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధరలు గణనీయంగా పెరగడం, విమానయాన సంస్థలపై భారీ ఆర్థిక భారం మోపింది. దీనికి తోడు, మెయింటెనెన్స్ ఖర్చులు కూడా పెరిగాయి. ఈ నేపథ్యంలో, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్‌లైన్స్ (FIA), అకాసా ఎయిర్ లాంటి సంస్థలు ఈ నిబంధన అమలు చేయడం కష్టమని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చాయి. 60 శాతం సీట్లను ఉచితంగా ఇవ్వాల్సి వస్తే, వారి ఆదాయంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం, ఈ నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేయడం మంచిదని భావించింది.

20 శాతం సీట్లు మాత్రమే ఉచితం..

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో, విమానయాన సంస్థలు సుమారు 20 శాతం సీట్లను మాత్రమే ఉచితంగా ఎంపిక చేసుకునే అవకాశం ఇస్తున్నాయి. మిగిలిన సీట్ల కోసం ప్రయాణికులు అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఛార్జీలు సాధారణంగా రూ. 200 నుంచిరూ. 2,100 వరకు ఉంటాయి. సీటు స్థానం, ముందు వరుసలో ఉండడం, అదనపు లెగ్‌ రూమ్ వంటి అంశాల ఆధారంగా ఈ ధరలు మారుతూ ఉంటాయి.

సీట్ సెలెక్షన్ ఛార్జీలపై కంప్లైంట్స్..

Advertisement

ఇప్పటికే సీటు ఎంపిక ఛార్జీలపై ప్రయాణికుల నుంచి బోలెడు ఫిర్యాదులు వచ్చాయి. ఈ సమస్యను తగ్గించేందుకు గతంలో ప్రభుత్వం 60 శాతం సీట్లను ఉచితంగా కేటాయించే ఆలోచన తీసుకొచ్చింది. కానీ, ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, ముఖ్యంగా ఇంధన ధరల పెరుగుదల, ఈ నిర్ణయాన్ని అమలు చేయడంలో ఆటంకంగా మారాయి.  ప్రభుత్వం ఇంకా ఈ విషయాన్ని సమగ్రంగా పరిశీలిస్తోంది. పరిస్థితులు అనుకూలంగా మారితే, భవిష్యత్తులో మళ్లీ ఈ నిబంధన అమలులోకి వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు, ప్రయాణికులు ప్రస్తుతం ఉన్న విధానాల ప్రకారమే సీట్ల ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.

Read Also: సౌత్ కొరియా స్ప్రింగ్ ట్రావెల్ స్పెషల్.. ఫ్లైట్స్, హోటల్స్ పై ఆఫర్లే ఆఫర్లు!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×