E-Paper
Advertisement

Best Road Trips: రోడ్ ట్రిప్‌కు వెళ్తున్నారా? అయితే వీటిని పక్కా చూడాల్సిందే..!

Best Road Trips: రోడ్ ట్రిప్‌కు వెళ్తున్నారా? అయితే వీటిని పక్కా చూడాల్సిందే..!
Advertisement

Best Road Trips: గమ్యం కంటే ప్రయాణం చాలా అందమైనది అని అంటారు చాలా మంది. మీర రోడ్ ట్రిప్ చేయాలనుకుంటే మీ ప్రయాణాన్ని మరింత అందంగా మార్చే సుందరమైన ప్రదేశాలు చూడండి. ఉత్తేజకరమైన రోడ్ ట్రిప్ కోసం ఎదురు చూస్తున్నారా? మీ విహార యాత్ర కోసం అద్భుతమైన పర్వత వీక్షణాలు మొదలుకొని, నిర్మలమైన తీరప్రాంతాల వరకు, ఈ రోడ్ ట్రిప్ గమ్యస్థానాలు తెలుసుకోండి.

లడఖ్:
లడఖ్ భారతదేశంలోని అత్యంత అద్భుతమైన ప్రయాణాలలో ఒకటి. జీవితంలో ఒక్కసారి అయిన అక్కడికి వెళ్లాలనుకునేవారు లక్షల మంది ఉంటారు. హిమాలయ పర్వతాల అందాలు, చూడముచ్చటగా ఉండే లోయలు, మంచు కరిగి ప్రవహించే హిమనీ నదులు, అందమైన సరస్సులు ఈ ప్రదేశాన్ని భూమ్మీదే అత్యంత అందమైనదిగా మార్చేశాయి. దీంతో అక్కడ విహరిస్తే మరో ప్రపంచంలో ఉన్నామా అనే అనుభూతిని కలిగిస్తుంది. ఇలాంటి అద్భుతమైన పర్యాటక ప్రదేశాన్ని ప్రతి సంవత్సరం లక్షల మంది పర్యాటకులు సందర్శిస్తుంటారు.

Advertisement

అహ్మదాబాద్ to కచ్:
అహ్మాదాబాద్ నుండి కచ్‌కు రోడ్డు యాత్ర ఒక అద్బుతమైన అనుభవం. ఈ ప్రయాణం గుజరాత్‌లోని విభిన్న సంస్కృతులు, ప్రకృతి దృశ్యాలు, చారిత్రక ప్రదేశాలకు మంచి ప్రయాణం. ఈ ప్రయాణం 400 కిలో మీటర్లకు పైగా ఉంటుంది. ఈ ప్రయాణం అరేబియా సముద్రం ఒడ్డున ఉన్న కచ్ యొక్క మైదానాలకు చేరుస్తుంది.

పాండిచ్చేరి to ధనుష్కోటి:
పాండిచ్చేరి నుంచి ధనుష్కోటి అందమైన తీరప్రాంత రహదారి వెంట ప్రయాణిస్తూ, మధ్యలో అనేక ఆసక్తికరమైప ప్రదేశాలను సందర్శించవచ్చు. ధనుష్కోటి చేరుకున్న తర్వాత అక్కడ మీరు ఒక వింతైన మరియు అందమైన వాతావరణాన్ని అనుభవించవచ్చు. ఎందుకంటే ఇది 1964 తుఫానులో ధ్వంసమైన ఒక పట్టణం. దీనిని ‘ది ఘోస్ట్ టౌన్’ అని కూడా పిలుస్తారు. ఇక్కడికి వెళ్లే సమయంలో మీరు సముద్రం మధ్యలో రోడ్డు పై ప్రయాణించవచ్చు.

Advertisement

సిమ్లా to కాజా:
సిమ్లా నుంచి కాజాకు రోడ్డు మార్గం ద్వారా ప్రయాణం ఒక సాహసోపేతమైన అనుభవం. ఈ ప్రయాణం సుమారు 450 కిలోమీటర్లు ఉంటుంది. అలాగే రెండు రోజుల సమయం పడుతుంది. మార్గ మధ్యలో ఎత్తైన కొండలు, లోతైన లోయలు, మలుపులు తిరిగే రోడ్లు ఉంటాయి.

బెంగళూరు to మున్నార్:
బెంగళూరు నుంచి మున్నార్‌కి సుమారు 512 కిలోమీటర్లు దూరం మరిము 9 నుంచి 10 గంటల ప్రయాణం ఉంటుంది. ఈ ప్రయాణం ప్రకృతి ప్రేమికులకు, సాహసికులకు ఒక గొప్ప అవకాశం. మున్నార్‌‌లో టీ తోటలు చాలా ప్రసిద్ధి చెందినవి. మీరు వాటిలో నడవడం, టీ తయారు చేసే ప్రక్రియను చూడటం, టీ రుచి చూడటం వంటివి చేయవచ్చు. దీంతో మీకు మంచి అనుభూతిని కలిగిస్తుంది.

Also Read: ఊపిరి పీల్చలేకపోతున్నారా? బొద్దింకలే కారణం కావచ్చు!

మాంగళూరు to గోవా:
రోడ్డు మార్గం ద్వారా ప్రయాణం ఒక ఆహ్లాదకరమైన అనుభవం. ఈ ప్రయాణంలో మీరు అందమైన ప్రదేశాలను, అలాగే ప్రకృతి అందాలను సందర్శించవచ్చు. ఈ రెండింటి మార్గ మధ్యమంలో గోకర్ణ అనే పురాతన తీర్థయాత్ర, బీచ్‌లతో కూడిన ప్రదేశం ఉంటుంది. ఇక్కడ మీరు ఓం బీచ్, క్లుడే బీచ్ వంటి ప్రదేశాలను కూడా చూడవచ్చు.

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×