E-Paper
Advertisement

Futuristic Trains: ప్రపంచంలోనే అద్భుతమైన రైళ్లు, పట్టాలెక్కాయంటే రైల్వే రూపురేఖలు మారాల్సిందే!

Futuristic Trains: ప్రపంచంలోనే అద్భుతమైన రైళ్లు, పట్టాలెక్కాయంటే రైల్వే రూపురేఖలు మారాల్సిందే!
Advertisement

టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ.. ప్రపంచ రైల్వే వ్యవస్థ మరింత అత్యాధునికంగా రెడీ అవుతోంది. ఇప్పటికే పలు దేశాల్లో బుల్లెట్ రైళ్లు అందుబాటులో ఉండగా, ఊహించని వేగంతో ప్రయాణించే రైళ్లు రెడీ అవుతున్నాయి. జపాన్ SCMaglev, హైపర్‌ లూప్   కాన్సెప్ట్, భారత్ కు చెందిన వందే భారత్ 4.0 లాంటి భవిష్యత్ రైళ్లు అత్యంత వేగం, పర్యావరణ అనుకూల ప్రయాణాన్ని అందించబోతున్నాయి.

 ప్రపంచ వ్యాప్తంగా రెడీ అవుతున్న ఫాస్టెస్ట్ రైళ్లు

⦿ SCMaglev, జపాన్

జపాన్ SCMaglev రైలు మాగ్నటిక్ లెవిటేషన్ తో ప్రయాణించేలా రూపొందిస్తున్నారు. ఇవి సూపర్ కండక్టింగ్ మాగ్నటిక్స్ ఉపయోగించి ప్రయాణించబోతున్నాయి. టెస్టింగ్ సమయంలో ఈ రైలు 600 km/h కంటే ఎక్కువ వేగాన్ని అందుకున్నాయి. ఈ రైలు టోక్యో- నగోయా మధ్య ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించనుంది. 2030 నాటికి ఈ రైలు అందుబాటులోకి రానుంది.

⦿ హైపర్‌ లూప్,  జపాన్

Advertisement

జపాన్ హైపర్‌ లూప్ టెక్నాలజీతో రూపొందిస్తున్న రైలు 1,000 km/h కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించబోతోంది. లో ప్రెషర్ ట్యూబ్స్ లోపల పాడ్ ల ద్వారా ఈ ప్రయాణం కొనసాగనుంది. ఇప్పటికీ ప్రోటో టైప్ దశ ప్రయోగాలను జరుపుకుంటుంది. వర్జిన్ హైపర్‌ లూప్ లాంటి కంపెనీలు ఈ అధునాతన వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నాయి.

⦿ వందే భారత్ 4.0, భారత్

భారత్ లో వందే భారత్ 4.0 త్వరలో అందుబాటులోకి రాబోతోంది.  దీని వేగం గంటకు 200 కి.మీ. వరకు ఉంటుంది. ఇందులో ఎర్గోనామిక్ సీట్లు, అప్‌గ్రేడ్ చేసిన సౌకర్యాలు, సురక్షితమైన హై స్పీడ్ ప్రయాణం కోసం స్వదేశీ కవచ్  రక్షణ వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయి.

⦿ చైనా ఫక్సింగ్ హావో

Advertisement

చైనా ఫక్సింగ్ హావో రైళ్లు గంటకు 350 కి.మీ. వేగంతో నడుస్తాయి. కొత్త వెర్షన్ రైళ్లు బీజింగ్-షాంఘై మార్గాల్లో అందుబాటులోకి రానున్నాయి,

⦿ CRC మాగ్లెవ్, చైనా

చైనా 400 కి.మీ./గం. కంటే ఎక్కువ వేగంతో CRC మాగ్లెవ్ రైలును అభివృద్ధి చేస్తోంది. ఈ రైళ్లు వేగవంతమైన ప్రయాణం కోసం  మాగ్నటిక్ లెవిటేషన్‌ టెక్నాలజీని ఉపయోగిస్తుంది.

⦿ L0 సిరీస్ మాగ్లెవ్, జపాన్  

స్పీడ్ టెస్ట్ లో L0 సిరీస్ 602 కి.మీ./గంకి చేరుకుంది. భవిష్యత్ కమర్షియల్ ఆపరేషన్స్ కోసం ఈ రైలును వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని జపాన్ ప్రయత్నిస్తోంది.

⦿ NEVOMO పాసివ్ మాగ్లెవ్, పోలాండ్  

పోలాండ్  NEVOMO ప్రస్తుత రైలు ట్రాక్‌ల కోసం పాసివ్ మాగ్లెవ్ టెక్నాలజీని అభివృద్ధి చేస్తోంది. మాగ్లెవ్ మౌలిక సదుపాయాలకు డబ్బు ఖర్చు చేయకుండానే 550 కి.మీ/గం వేగంతో ప్రయాణించేలా వీటిని రూపొందిస్తోంది.

⦿ అమ్ట్రాక్ నెక్స్ట్-జెన్ రైళ్లు, USA

అమ్ట్రాక్ రైళ్ల తయారీలో అమెరికా పెట్టుబడి పెడుతోంది. తక్కువ ఇంధనంతో అత్యధిక వేగంగా ప్రయాణించేలా రూపొందిస్తుంది.

⦿  బ్రైట్‌లైన్ 2, USA  

బ్రైట్‌ లైన్ 2 అమెరికాలోని ప్రధాన నగరాల మధ్య ప్రయాణ వేగాన్ని గంటకు 240 కి.మీ వేగంతో అందుకునేలా రూపొందిస్తోంది.

⦿ ఆల్టో మెట్రో, యూరప్  

యూరప్ ఆల్టో మెట్రో, రియల్ టైమ్ నిర్వహణ, ప్రయాణీకుల సౌలభ్యం కోసం AI, IoTని ఉపయోగిస్తుంది. డ్రైవర్‌ లెస్ టెక్నాలజీతో పట్టణ ప్రజా రవాణాను మెరుగుపరచడానికి ఇది కృషి  చేయనుంది.

Read Also: దేశంలోనే తొలి ప్రైవేట్ రైల్వే స్టేషన్.. దీని ముందు ఎయిర్ పోర్ట్ దిగదుడుపే!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×