E-Paper
Advertisement

ఓన్లీ అండర్ వేర్, నో ప్యాంట్.. ఇదేం దిక్కుమాలిన డే రా అయ్యా!

ఓన్లీ అండర్ వేర్, నో ప్యాంట్.. ఇదేం దిక్కుమాలిన డే రా అయ్యా!
Advertisement

No Pants Ride Goes Viral: ‘నో ట్రౌజర్స్ ట్యూబ్ రైడ్’.. ప్యాంట్లు లేని ప్రయాణం. ప్యాంట్లు లేకుండా ప్రయాణం ఏంటని  ఆశ్చర్యపోకండి. నిజంగా నిజం. అమెరికా, లండన్ లోని ప్రజలకు ఈ వింత అనుభవం గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు.  ప్రస్తుతం ఈ ఈవెంట్ ప్రతి ఏటా జనవరిలో లండన్ లో జరుగుతుంది. ఈ ఈవెంట్‌ లో పాల్గొనే వారు సాధారణంగా చలికాలానికి తగ్గట్టు జాకెట్లు, స్వెటర్లు లాంటి పై దుస్తులు వేసుకుంటారు. కానీ, కింద భాగంలో ప్యాంట్లు లేకుండా కేవలం లో దుస్తులతోనే అండర్‌ గ్రౌండ్ రైళ్లలో ప్రయాణిస్తారు. ఇది చూసే వారికి ఆశ్చర్యంగా, కొంచెం ఫన్ గా అనిపిస్తుంది.

2002లో న్యూయార్క్ లో ప్రారంభం

ఈ కార్యక్రమం  2002లో తొలుత న్యూయార్క్ సిటీలో ప్రారంభం అయ్యింది. అప్పట్లో కొద్దిమంది స్నేహితులు సరదాగా చేసిన ఈ ప్రయత్నం, ఆ తర్వాత పెద్ద ఈవెంట్‌గా మారింది. ప్రస్తుతం ప్రపంచంలోని అనేక నగరాల్లో కూడా ఇదే తరహా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే, లండన్‌ లో జరిగే ఈవెంట్ ఎక్కువ మంది దృష్టిని ఆకర్షిస్తుంది.

ఈ కార్యక్రమం వెనుక ఉద్దేశం ఏంటంటే?

Advertisement

ఈ కార్యక్రమం వెనుక ఉన్న ఉద్దేశ్యం కేవలం వినోదమే. రోజూ ఒకేలా సాగుతున్న జీవితంలో కొంత ఫన్ కోరుకునేందుకు,  ప్రజలకు నవ్వులను పంచడం దీని లక్ష్యం. పాల్గొనే వారు సాధారణ ప్రయాణికుల్లానే ప్రవర్తిస్తారు. వారు ఎవరినీ అసౌకర్యానికి గురి చేయకుండా, ఎలాంటి అల్లరి లేకుండా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తారు. బయటకు చూస్తే ఇది విచిత్రంగా అనిపించినా, ఇందులో పాల్గొనేవారికి ఒక సరదా ఎక్స్ పీరియెన్స్ గా ఉంటుంది.

ఎక్కువగా యువతే!

ఈ ఈవెంట్‌లో పాల్గొనేవారు ఎక్కువగా యువతే ఉంటారు. కొందరు స్నేహితులతో కలిసి గ్రూప్‌ గా వస్తారు. కొందరు కొత్తగా పరిచయాలు చేసుకోవడానికి కూడా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకుంటారు. సోషల్ మీడియాలో ఈ ఈవెంట్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. చాలామంది దీనిని చూసి ఆశ్చర్యపోతే, మరికొందరు దీనిని ఫన్ యాక్టివిటీగా భావిస్తారు.

పూర్తి స్వచ్ఛందంగా..

Advertisement

ఈ కార్యక్రమం పూర్తిగా స్వచ్ఛందంగా జరుగుతుంది. ఎవరి బలవంతం ఉండదు. పాల్గొనేవారు ముందుగానే కొన్ని నియమాలను పాటించాలి. ముఖ్యంగా ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఉండటం, పబ్లిక్ డెకోరమ్‌ ను కాపాడటం వంటి విషయాలను గమనించుకోవాల్సి ఉంటుంది. ‘నో ట్రౌజర్స్ ట్యూబ్ రైడ్’ విచిత్రంగా కనిపించే, సరదాగా కార్యక్రమం. ఇది సాధారణ ప్రజా రవాణాలో కొత్త అనుభూతిని కలిగిస్తుంది. రోజువారీ ఒత్తిడిలో కొంత నవ్వు, వినోదం కలిపే ప్రయత్నంగా దీనిని చూడవచ్చు. అందుకే ప్రతి సంవత్సరం ఈ ఈవెంట్ మరింత పాపులర్ అవుతుంది.

Read Also: రోడ్ సైడ్ ఉండే యెల్లో స్టడ్స్‌.. పవర్ లేకుండా ఎలా మెరుస్తాయి బ్రో?

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×