E-Paper
Advertisement

Trains Cancelled: కమ్మేస్తున్న పొగమంచు, 16 రైళ్లు 3 నెలల పాటు రద్దు!

Trains  Cancelled: కమ్మేస్తున్న పొగమంచు, 16 రైళ్లు 3 నెలల పాటు రద్దు!
Advertisement

Foggy Season Alert:

దట్టమైన పొగమంచు కమ్ముకుంటున్న నేపథ్యంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. సుదూర ప్రాంతాలకు వెళ్లే పలు ఎక్స్ ప్రెస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. సుమారు 3 నెలల పాటు ఈ రైళ్ల సేవలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. సజావుగా కార్యకలాపాలు కొనసాగించేందుకు రైల్వే పలు ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ, పొగమంచు సంబంధిత జాప్యాలు, రద్దులు ప్రతి సంవత్సరం ప్రయాణీకులను ఇబ్బంది కలిగిస్తూనే ఉన్నాయి.

డిసెంబర్ 1 నుంచి ఫిబ్రవరి 28 వరకు పలు రైళ్లు రద్దు

రైల్వే ట్రాక్స్ సరిగా కనిపించని నేపథ్యంలో డిసెంబర్ 1, 2025 నుంచి ఫిబ్రవరి 28, 2026 వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. వాటిలో సహారన్‌ పూర్-ఢిల్లీ మార్గంలో నడిచే కీలకమైన జలంధర్-ఢిల్లీ సూపర్‌ ఫాస్ట్ ఎక్స్‌ ప్రెస్ కూడా ఉంది. ఈ రైలు రాకపోకలను మార్చి 1, 2026 వరకు క్యాన్సిల్ చేస్తున్నట్లు తెలిపింది. సేఫ్టీ గైడ్ లైన్స్ ప్రకారం పలు రైళ్లను రద్దుచేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. పొగమంచు కారణంగా అనేక రైళ్లను రద్దు చేయాలనే ఉన్నతాధికారుల సూచనల ప్రకారం ఈ రైళ్లను క్యాన్సిల్ చేస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికులు అసౌకర్యానికి గురికాకుండా చూసుకోవడానికి రైల్వే  ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

పొగమంచు కారణంగా రద్దు అయిన రైళ్లు ఇవే!

Advertisement

పొగమంచు కారణంగా రద్దు చేసిన రైళ్ల వివరాలను భారతీయ రైల్వే అధికారికంగా ప్రకటించింది. ఈ 16 రైళ్లు 3 నెలల పాటు అందుబాటులో ఉండవని తెలిపింది.  ఇంతకీ ఆ రైళ్లు ఏవో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

⦿ 12207 కత్గోడం–జమ్మూ ఎక్స్‌ ప్రెస్

Advertisement

⦿ 12208 జమ్మూ–కత్గోడం ఎక్స్‌ ప్రెస్

⦿ 14681 ఢిల్లీ–జలంధర్ సిటీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్

⦿14682 జలంధర్–ఢిల్లీ సూపర్‌ ఫాస్ట్ ఎక్స్‌ ప్రెస్

⦿ 12317 అమృత్‌ సర్–కోల్‌ కతా అకల్ తఖ్త్ ఎక్స్‌ ప్రెస్

⦿12318 కోల్‌కతా–అమృత్‌ సర్ అకల్ తఖ్త్ ఎక్స్‌ ప్రెస్

⦿ 12357 అమృత్‌ సర్–కోల్‌ కతా దుర్గియానా ఎక్స్‌ ప్రెస్

⦿ 12358 కోల్‌ కతా–అమృత్‌ సర్ దుర్గియానా ఎక్స్‌ ప్రెస్

⦿ 14523 అంబాలా–బరౌని ఎక్స్‌ ప్రెస్

⦿ 14524 బరౌని–అంబాల ఎక్స్‌ ప్రెస్

Read Also:  సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం, ఇక ఆ నగరాలకు ఈజీగా వెళ్లొచ్చు!

⦿ 14605 జమ్మూ–యోగ నగరి రిషికేశ్ ఎక్స్‌ ప్రెస్

⦿ 14606 యోగా నగరి రిషికేశ్–జమ్మూ ఎక్స్‌ ప్రెస్

⦿ 14615 అమృత్‌ సర్–లాల్ కువాన్ ఎక్స్‌ ప్రెస్

⦿ 14616 లాల్ కువాన్–అమృత్సర్ ఎక్స్‌ ప్రెస్

⦿14617 అమృత్‌ సర్ –పూర్నియా జనసేవా ఎక్స్‌ ప్రెస్

⦿14618 పూర్నియా– అమృత్‌ సర్ జనసేవా ఎక్స్‌ ప్రెస్

చలికాలంలో ఉత్తర భారతదేశం అంతటా పొగమంచు అంతరాయాలు ఎదురవుతాయి. ఈ నేపథ్యంలోనే ముందస్తు జాగ్రత్తగా ఈ రైళ్లను రద్దు చేస్తూ భారతీయ రైల్వే నిర్ణయం తీసుకుంది.

Read Also:  మొంథా ఎఫెక్ట్.. 150కి పైగా రైళ్లు రద్దు, పలు విమాన సర్వీసులు క్యాన్సిల్!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×