E-Paper
Advertisement

ప్రయాణికుడికి ఇచ్చిన బిర్యానీలో ఈగ.. రైల్వే క్యాటరింగ్ సంస్థకు షాక్!

ప్రయాణికుడికి ఇచ్చిన బిర్యానీలో ఈగ.. రైల్వే క్యాటరింగ్ సంస్థకు షాక్!
Advertisement

Rajdhani Express Food Row: రైల్లో ప్రయాణికులకు నాసిరకం భోజనం అందించడంపై ఐఆర్‌సీటీసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రీసెంట్ గా రాజధాని ఎక్స్‌ ప్రెస్‌ లో ఓ ప్రయాణికుడికి అందించిన వెజ్ బిర్యానీలో ఈగ కనిపించడంతో తీవ్ర కలకలం రేగింది. ఈ ఘటనపై స్పందించిన ఐఆర్‌సీటీసీ సంబంధిత క్యాటరింగ్ సంస్థపై కఠిన చర్యలు తీసుకుంది. భారీగా జరిమానా విధించింది.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

అహ్మదాబాద్‌-ముంబై తేజస్ రాజధాని ఎక్స్‌ ప్రెస్‌ లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి మధ్యాహ్న భోజనం కోసం వెజ్ బిర్యానీని ఆర్డర్ చేశారు. భోజనం చేస్తుండగా ఆయనకు బిర్యానీలో ఈగ కనిపించింది. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ప్రయాణికుడు వెంటనే ఈ విషయాన్ని ఐఆర్‌సీటీసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఫిర్యాదు అందుకున్న వెంటనే రైలు కెప్టెన్, క్యాటరింగ్ మేనేజర్ ప్రయాణికుడి దగ్గరికి చేరుకుని జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేశారు. సంబంధిత సిబ్బంది ప్రయాణికుడికి క్షమాపణలు చెబుతూ, మరో భోజనం అందిస్తామని సూచించారు. అయితే, ఆ ప్రయాణికుడు వారి ప్రతిపాదనను తిరస్కరించారు. ఇలాంటి నిర్లక్ష్యం కారణంగా ప్రయాణికుల ఆరోగ్యానికి ప్రమాదకరమని మండిపడ్డారు.

క్యాటరింగ్ సంస్థకు రూ. 1 లక్ష జరిమానా

Advertisement

ఈ ఘటనను ఐఆర్‌సీటీసీ చాలా సీరియస్‌ గా తీసుకుంది. ప్రయాణికులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందించాల్సిన బాధ్యత క్యాటరింగ్ సంస్థలపై ఉందని తేల్చి చెప్పింది. ఆ బాధ్యతను సరిగా నిర్వర్తించడంలో ఫెయిల్ అయిన సంబంధిత క్యాటరింగ్ సంస్థ అర్హా హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్‌ కు రూ.1 లక్ష జరిమానా విధించింది. అంతేకాకుండా, సంస్థ నిర్వహిస్తున్న మెస్ లైసెన్స్‌ ను ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసు జారీ చేసింది. సూరత్‌ లోని మెయిన్ కిచెన్ నుంచి ఈ సంస్థ రాజధాని ఎక్స్‌ ప్రెస్ ప్రయాణికులకు భోజనాలను సరఫరా చేస్తోంది. అయితే, ఈ ఘటనతో ఆ సంస్థ ఆహార నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

రైల్వే అధికారులు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రయాణికుల ఆరోగ్యం, భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని, క్వాలిటీ లేని ఆహారం అందించే సంస్థల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని తేల్చి చెప్పారు. ఇటీవల రైళ్లలో అందించే భోజన నాణ్యతపై పలు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈ ఘటన సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ప్రయాణికులు కూడా భోజనం సరిగా లేకపోతే వెంటనే ఐఆర్‌సీటీసీ హెల్ప్‌ లైన్ ద్వారా ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ ఘటనతో రైల్వే క్యాటరింగ్ సేవల్లో మరింత కట్టుదిట్టమైన తనిఖీలు అవసరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Advertisement

Read Also: IRCTC సీఎండీ సంజయ్ కుమార్ జైన్ రాజీనామా.. రైల్వే శాఖ ఆమోదం!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×