E-Paper
Advertisement

Flight Services Resume: ప్రయాణీకులకు కాస్త రిలీఫ్, దుబాయ్ నుంచి ఇండియాకు విమాన సర్వీసులు ప్రారంభం!

Flight Services Resume: ప్రయాణీకులకు కాస్త రిలీఫ్, దుబాయ్ నుంచి ఇండియాకు విమాన సర్వీసులు ప్రారంభం!
Advertisement

మిడిల్ ఈస్ట్ లో యుద్ధ వాతావరణం కారణంగా క్యాన్సిల్ అయిన విమాన సర్వీసులు.. ఇప్పుడిప్పుడే ప్రారంభం అవుతున్నాయి. దుబాయ్ నుంచి వచ్చిన ఎమిరేట్స్ విమానం ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. విమానాశ్రయ అధికారులు, విమానయాన అధికారుల సమన్వయం మధ్య ఎమిరేట్స్ విమానం EK 500 ముంబైకి చేరుకుంది. గత కొన్ని రోజులుగా విమానాల రద్దు, జాప్యాల కారణంగా దుబాయ్ లో చిక్కుకుపోయిన ప్రయాణీకులను ఈ విమానం ద్వారా తీసుకొచ్చారు.

దుబాయ్ పరిస్థితులను విరించిన ప్రయాణీకులు

దుబాయ్ నుంచి ముంబైకి వచ్చిన అజయ్ అనే ప్రయాణీకుడు దుబాయ్‌లోని ఉద్రిక్త పరిస్థితిని వివరించాడు.  “మేము దుబాయ్ నుంచి USAకి వెళ్లాలనుకున్నాం. అది బయలుదేరనప్పుడు, విమాన ప్రయాణంలో కొన్ని సమస్యలు ఉండవచ్చని  భావించాము. 7-8 గంటల తర్వాత, యుద్ధం ప్రారంభమైందని మాకు చెప్పారు. చిక్కుకుపోయిన ప్రయాణికులకు ఎయిర్‌ లైన్ వసతి ఏర్పాటు చేసింది. ఎమిరేట్స్ బస్సులు ప్రయాణీకులందరినీ హోటళ్లకు తీసుకెళ్లాయి. ముంబైకి విమానం బయలుదేరుతుందని తెలిసిన వెంటనే, మేము వారిని సంప్రదించి ఇక్కడికి వచ్చాము. నెమ్మదిగా, అక్కడ పరిస్థితి అదుపులోకి వస్తుంది” అని అజయ్ వివరించారు.

అబుదబి నుంచి బెంగళూరుకు వచ్చిన విమానం

Advertisement

అటు అబుదాబి నుండి వచ్చిన మొదటి విమానం  బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది.  విమాన ప్రయాణ సేవలలో అంతరాయం కారణంగా అక్కడి చిక్కుకుపోయిన ప్రయాణీకులను ఈ విమానంలో తీసుకొచ్చారు. అబుదాబిలో చిక్కుకున్న ఒక ప్రయాణికుడు ఎతిహాద్ ఎయిర్‌ వేస్ తమకోసం చేసిన ఏర్పాట్లను అభినందించాడు. “మేము అబుదాబి విమానాశ్రయంలో చిక్కుకున్న తర్వాత, ఎతిహాద్ ఎయిర్‌వేస్ మమ్మల్ని బాగా చూసుకుంది. విమానాలు రద్దు చేయబడిన ప్రయాణీకులందరికీ హోటళ్లకు తీసుకెళ్లింది. దుబాయ్ విమానాశ్రయాలలో విమానాలు పాక్షికంగా తిరిగి ప్రారంభమవడంతో, దుబాయ్ నుంచి బెంగళూరుకు మరో ఎమిరేట్స్ విమానం బయల్దేరింది.

సోమవారం రాత్రి నుంచి విమాన సర్వీసులు ప్రారంభం

సోమవారం సాయంత్రం నుంచి పరిమితంగా ప్రారంభం అయ్యాయి. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం (DXB), అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయం (DWC) నుంచి విమాన సర్వీసులు ప్రారంభం అయ్యాయి. విమాన సర్వీసులు  మళ్ళీ పెరగడంతో, యుఎఇలో నెమ్మదిగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. గల్ఫ్ కంట్రీస్ లో చిక్కుకుపోయిన ప్రయాణీకులు ఇప్పుడిప్పుడే ఇండియాకు చేరుకుంటున్నారు.

Advertisement

Read Also: మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తలు, విమాన సంస్థల కీలక నిర్ణయం!

ఇరాన్ పై దాడుల నేపథ్యంలో..

ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల తర్వాత, ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. అరబ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు, క్షిపణులను ఉపయోగించి ప్రతీకార దాడులను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో గల్ఫ్ కంట్రీస్ కు పూర్తిగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. మళ్లీ ఇప్పుడు ప్రారంభం అవుతున్నాయి.

Read Also: పైలట్లు రొయ్యలు, పీతలు ఎందుకు తినరు? వారి క్యాప్‌ లో ఫొటోలు ఎందుకు పెట్టుకుంటారు?

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×