E-Paper
Advertisement

తగలబడుతున్న రైళ్లు.. నిన్న మధ్యప్రదేశ్, నేడు బీహార్, లోపం ఎక్కడ?

తగలబడుతున్న రైళ్లు.. నిన్న మధ్యప్రదేశ్, నేడు బీహార్, లోపం ఎక్కడ?
Advertisement

Bihar: దేశంలో రైళ్లు ఎందుకు తగలబడుతున్నాయి? అధికారుల పర్యవేక్షణ లోపమా? రోజుకు ఎక్కడో దగ్గర ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయా? షార్ట్ సర్క్యూట్ కారణమని చెప్పి అధికారులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారా? అసలు ఏం జరుగుతోంది.

బీహార్‌లోని  ఓ రైలులో అగ్నిప్రమాదం

Advertisement

బీహార్‌లోని ససారం రైల్వే‌స్టేషన్‌లో పాట్నా వెళ్తున్న ప్యాసింజర్ రైలు బోగీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రైలు బయలు దేరడానికి కొద్దిసేపటి ముందు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే వారిని ఆ బోగీల నుంచి కిందకు దించేవారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు అధికారులు.

ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే రైల్వే పోలీసులు, ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగారు. మంటలను అదుపులోని తీసుకొచ్చారు. అధికారుల ప్రాథమిక విచారణ మేరకు షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు.

Advertisement

ప్రయాణికులు సేఫ్.. ప్రమాదాలపై ప్రయాణికులు బెంబేలు

ససారం నుంచి పాట్నాకు కాసేపట్లో ఫాస్ట్ ప్యాసింజర్ రైలు బయలు దేరనుంది.  స్టేషన్‌లోని ఆరో నెంబర్ ప్లాట్‌ఫాం వద్ద ఉండగా కోచ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు అధికారులు.

ఆదివారం మధ్యప్రదేశ్‌లోని రత్లాంలో కేరళ నుంచి ఢిల్లీకి వెళ్లే రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటన జరిగి కొద్ది గంటల వ్యవధిలో మరొక ఘటన జరిగింది. ఇలా వరుసగా రైళ్లులో అగ్నిప్రమాదాలు జరుగుతుండడంతో ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు. ఎండాకాలంలో ఏసీ బస్సుల్లో ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకున్న ఘటనలు ఉండేవి. ఇప్పుడు రైళ్లు వంతైంది.

ALSO READ: ఏంట్రా బాబూ ఈ వింత? చెట్లకు వేలాడే బొమ్మల వెనుక ఇంత పెద్ద కథ ఉందా?

 

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×