E-Paper
Advertisement

Valentine’s Day Ban: మీకు తెలుసా? ఈ దేశాల్లో ‘వాలంటైన్స్ డే’ నేరం.. ఎందుకంటే?

Valentine’s Day Ban: మీకు తెలుసా? ఈ దేశాల్లో ‘వాలంటైన్స్ డే’ నేరం.. ఎందుకంటే?
Advertisement

Valentine’s Day Ban: ఫిబ్రవరి 14.. ప్రేమికులకు పండగ రోజు. ఈ డే అంతా తమకిష్టమైన వాళ్లతో గడపాలని, లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే గిఫ్ట్స్ ఇచ్చుకోవాలని ప్లాన్ చేసుకుంటారు. ఫిబ్రవరి 7న రోజ్ డేతో మొదలయ్యే ఈ సందడి వాలెంటైన్స్ డే వరకు నాన్ స్టాప్‌గా సాగుతుంది. అయితే, మనం ఇక్కడ ఇంత స్వేచ్ఛగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం కానీ.. ప్రపంచంలో కొన్ని దేశాల్లో మాత్రం ఈ రోజున బయట కనిపిస్తే దండిస్తారు. అవును మీరు విన్నది నిజమే.. ఇది పాశ్చాత్య సంస్కృతి అని, మన పద్ధతులకు విరుద్ధమని అక్కడ బ్యాన్ చేసేశారు. ఒకవేళ రూల్స్ బ్రేక్ చేస్తే కఠినమైన శిక్షలు కూడా ఉంటాయి. మరి ఆ దేశాలేంటో ఒకసారి చూద్దామా..

ఇరాన్‌లో ఎర్ర గులాబీలపై నిషేధం..

వాలెంటైన్స్ డే అంటే ఇరాన్ ప్రభుత్వానికి అస్సలు పడదు. 2011 నుంచే అక్కడ ఈ వేడుకలపై ఉక్కుపాదం మోపారు. వాలెంటైన్స్ గిఫ్ట్స్ తయారు చేయడం, అమ్మడం, ఆఖరికి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం కూడా నేరమే. దీన్ని వెస్ట్రన్ కల్చర్ అని పిలిచే అక్కడి అధికారులు.. ఫిబ్రవరి 14 వచ్చిందంటే చాలు షాపుల మీద దాడులు చేసి వస్తువులన్నీ సీజ్ చేస్తారు. మాట వినకుండా వేడుకలు చేసుకుంటే ఫైన్లు కట్టడమే కాదు, జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది.

పాకిస్థాన్ కోర్టు ఇచ్చిన తీర్పు..

Advertisement

మన పొరుగు దేశమైన పాకిస్థాన్‌లో కూడా ఇదే పరిస్థితి. 2017 – 18 ప్రాంతంలో ఇస్లామాబాద్ హైకోర్టు ఓ సంచలన తీర్పు ఇచ్చింది. వాలెంటైన్స్ డే వేడుకలు బహిరంగంగా జరుపుకోకూడదని, టీవీల్లో గానీ సోషల్ మీడియాలో గానీ దీని గురించి ప్రచారం చేయకూడదని స్ట్రిక్ట్ ఆర్డర్స్ వేసింది. ఇది తమ ఇస్లామిక్ సాంప్రదాయాలకు విరుద్ధమని అక్కడి ప్రభుత్వం నమ్ముతుంది. అందుకే ఎవరైనా పబ్లిక్‌గా వేడుకలు జరుపుకుంటే పోలీసులు వెంటనే రంగంలోకి దిగుతారు.

Also Read: గంటకు 115 కి.మీ వేగంతో దూసుకొచ్చిన వరద.. మధ్యధరా సముద్రాన్ని పుట్టించిన భయంకర ప్రళయం ఇదే!

సౌదీలో మొదలైన మార్పు..

Advertisement

ఒకప్పుడు సౌదీ అరేబియాలో వాలెంటైన్స్ డే అంటే ఒక భయం ఉండేది. ఆ రోజు ఎక్కడైనా రెడ్ కలర్ వస్తువు కనిపిస్తే చాలు.. పోలీసులు దాడులు చేసేవారు. కానీ, 2018 – 19 నుండి అక్కడ పరిస్థితులు కొంచెం మారుతున్నాయి. సామాజిక సంస్కరణల వల్ల పాత రోజులతో పోలిస్తే ఇప్పుడు ఆంక్షలు తగ్గాయి. అయితే, ఇప్పటికీ బహిరంగంగా వేడుకలు జరుపుకోవడాన్ని అక్కడి ప్రభుత్వం పెద్దగా ఎంకరేజ్ చేయదు. లోలోపల ఏదో జరుగుతున్నా, పాతకాలం నాటి మనుషుల నుంచి వ్యతిరేకత మాత్రం ఉంటూనే ఉంది.

ఉజ్బెకిస్తాన్, మలేషియా ఆంక్షలు..

ఉజ్బెకిస్తాన్ ప్రభుత్వం దాదాపు పదేళ్ల క్రితమే వాలెంటైన్స్ డేని ‘పరాయి సంస్కృతి’ అని ముద్ర వేసి బ్యాన్ చేసేసింది. ఇక మలేషియాలో అయితే 2005లోనే ముస్లింల కోసం ఒక ఫత్వా జారీ చేశారు. అక్కడ చట్టపరంగా పూర్తి నిషేధం లేకపోయినా, సమాజం నుంచి మాత్రం తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఎవరైనా బహిరంగంగా కనిపిస్తే ఇబ్బందులు తప్పవు.

ఇండోనేషియాలో ప్రాంతీయ నిబంధనలు..

ఇండోనేషియా దేశమంతటా నిషేధం లేదు కానీ, కొన్ని నగరాల్లో మాత్రం రూల్స్ చాలా కఠినంగా ఉంటాయి. సురబాయ, బండా ఆకెహ్ వంటి ప్రాంతాల్లో వాలెంటైన్స్ డే వేడుకల మీద హెచ్చరికలు జారీ చేస్తారు. అక్కడి కన్జర్వేటివ్ పద్ధతుల వల్ల పోలీసులు గిఫ్ట్ షాపుల్లో తనిఖీలు చేయడం, జంటల మీద నిఘా పెట్టడం లాంటివి చేస్తూ ఉంటారు.

Also Read: సముద్ర గర్భంలో సంగీత కచేరీ.. పులిలా గర్జించే, డ్రమ్స్ వాయించే వింత చేపల గురించి మీకు తెలుసా?

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×