E-Paper
Advertisement

IRCTC Nepal Tour Packages 2026: నేపాల్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, IRCTC టూర్ ప్యాకేజీలు ట్రై చేయండి!

IRCTC Nepal Tour Packages 2026: నేపాల్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, IRCTC టూర్ ప్యాకేజీలు ట్రై చేయండి!
Advertisement

IRCTC Nepal Packages 2026: సమ్మర్ హాలీడేస్ లో ఎక్కువ మంది టూర్ కు వెళ్తుంటారు. ఎక్కువ డబ్బులు ఉన్నవారు ఫారిన్ ట్రిప్స్ కు వెళ్తే, మధ్య తరగతి కుటుంబాలు భారత్ తో పాటు పరిసర దేశాల్లో పర్యటించేందుకు మొగ్గు చూపుతున్నాయి. ముఖ్యంగా మన పొరుగు దేశం నేపాల్ కు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తారు. ఒకవేళ మీరు కూడా తక్కువ బడ్జెట్ లో నేపాల్ కు వెళ్లాలనుకుంటే, IRCTC నేపాల్  స్పెషల్ టూర్ ప్యాకేజీలను తీసుకొచ్చింది. ఎంచక్కా వెళ్లి ఎంజాయ్ చేసి రావచ్చు. తక్కువ ఖర్చుతో నేపాల్‌ లోని అందమైన నగరాలను చూసి రావచ్చు. నేపాల్ సహజ సౌందర్యం, ఎత్తైన పర్వతాలు, మతపరమైన ప్రదేశాలకు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ పర్వతం, బుద్ధుడి జన్మస్థలం లుంబిని కూడా నేపాల్‌ లో ఉంది. ఇది ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యాటకులు నేపాల్ కు వెళ్తుంటారు.

⦿  చెన్నై నుంచి క్లాసిక్ నేపాల్ టూర్

IRCTC క్లాసిక్ నేపాల్  ప్యాకేజీ చెన్నై నుంచి మొదలవుతుంది. ఇది 5 రాత్రులు, 6 రోజుల పాటు కొనసాగుతుంది. పర్యాటకులను ఖాట్మండు, పోఖారా లాంటి ప్రధాన నగరాలకు తీసుకెళ్తారు. ప్యాకేజీ ఛార్జీ ఒక్కొక్కరికి సుమారు రూ. 42,400 నుంచి ప్రారంభమవుతుంది.

⦿ హైదరాబాద్ నుంచి రాయల్ నేపాల్ ప్యాకేజీ

Advertisement

హైదరాబాద్ నుంచి ప్రారంభమయ్యే రాయల్ నేపాల్  టూర్ ప్యాకేజీ 6 రాత్రులు, 7 పగళ్ల పాటు కొనసాగనుంది. ఇందులో ఖాట్మండు, పోఖారాతో పాటు జనక్‌ పూర్, లుంబినీ లాంటి ఆధ్యాత్మిక ప్రదేశాలు ఉన్నాయి. హోటల్ రూమ్ షేరింగ్ ను బట్టి  ప్యాకేజీ ధర రూ.48,000 నుంచి రూ. 66,000 వరకు ఉంటుంది.

⦿ చండీగఢ్ నుంచి ఎయిర్ ట్రావెల్   

IRCTC చండీగఢ్ నుంచి నేపాల్‌ కు విమాన ప్యాకేజీని కూడా అందిస్తోంది. ఇది 6 రోజుల పర్యటన. ప్రధానంగా ఖాట్మండు చుట్టూ ఈ పర్యటన కొనసాగుతుంది. ఇందులో విమానాలు, హోటళ్ళు, సందర్శనా స్థలాలు ఉంటాయి.

ప్యాకేజీలో ఏ సౌకర్యాలు కల్పిస్తారంటే?  

Advertisement

నేపాల్ టూర్ ప్యాకేజీ ప్రయాణికులకు పలు రకాల సౌకర్యాలను కల్పిస్తారు.  రౌండ్ ట్రిన్ విమాన టిక్కెట్లు, హోటల్ వసతి, బ్రేక్ ఫాస్ట్, డిన్నర్, ప్రధాన ప్రదేశాలను సందర్శించడానికి అయ్యే ఖర్చును IRCTC పెట్టుకుంటుంది.

నేపాల్ ప్రయాణం కోసం అవసరమైన డాక్యుమెంట్స్  

నేపాల్‌కు ప్రయాణించడానికి తప్పనిసరిగా పాస్‌ పోర్ట్ లేదంటే ఓటరు ID కార్డును తీసుకెళ్లాలి. పాస్‌ పోర్ట్‌ తో ప్రయాణిస్తుంటే, అది కనీసం 6 నెలల వరకు చెల్లుబాటులో ఉండాలి.

ప్యాకేజీ టిక్కెట్లు ఎలా బుక్ చేసుకోవాలి?

మీరు ఈ టూర్ ప్యాకేజీని టిక్కెట్లు బుక్ చేసుకోవాలంటే అధికారిక IRCTC టూరిజం వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవచ్చు. ప్యాకేజీ ధరలు, తేదీలు మారే అవకాశం ఉంటుంది. బుకింగ్ చేసే ముందు దయచేసి అన్ని వివరాలను చూసి బుక్ చేసుకోవడం మంచిది. సమ్మర్ లో నేపాల్ వెళ్లాలనుకునే వారికి ఈ టూర్ ప్యాకేజీలు ఎంతో అనుకూలంగా ఉండనున్నాయి. వీటిని ఉపయోగించుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.

Read Also: యుద్ధ సమయంలో సంపన్నులు తలదాచుకొనే దేశాలివే.. ఈ ప్రాంతాలు అంత సేఫా?

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×