E-Paper
Advertisement

Lower Berth Ticket: లోయర్ బెర్తులు పొందాలంటే, ఈ టీసీ చెప్పింది చేస్తే చాలు!

Lower Berth Ticket: లోయర్ బెర్తులు పొందాలంటే, ఈ టీసీ చెప్పింది చేస్తే చాలు!
Advertisement

TTE Viral Video:

సీనియర్ సిటిజన్లకు రైలు టిక్కెట్లను బుక్ చేసుకోవడం అనేది చాలా కష్టమైన పని. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు లోయర్ బెర్త్ ల విషయంలో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ, వాటిని ఎలా పొందాలో సరిగా తెలియదు. నిజానికి దూర ప్రయాణాల కారణంగా వృద్ధులు ఈజీగా అలసిపోతారు. మిడిల్, అప్పర్ బెర్త్‌ ఎక్కడం చాలా కష్టంగా ఉంటుంది. టిక్కెట్లు బుక్ చేసుకునేటప్పుడు IRCTC వారికి ఆటోమేటిక్‌ గా లోయర్ బెర్త్‌ లను ఎందుకు ఇవ్వదని చాలామంది ఆలోచిస్తారు. నిజానికి లోయర్ బెర్త్ లు విషయంలో సీనియర్ సిటిజన్లకు ప్రాధానత్య ఉంటుంది. అయితే, వాటని ఎలా పొందాలో తెలియక ఇబ్బంది పడుతారు. అలాంటి వారికి తాజాగా ఓ రైల్వే టికెట్ ఎగ్జామినర్ (TTE) క్రేజీ టిప్ చెప్పారు. సీనియర్ సిటిజన్లు సింపుల్ గా లోయర్ బెర్త్ ఎలా పొందాలో వివరించారు. దిబ్రుగఢ్ రాజధాని ఎక్స్‌ ప్రెస్‌ లో రికార్డ్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సీనియర్ సిటిజన్లకు టీటీఈ చెప్పిన క్రేజీ ట్రిక్

వైరల్ వీడియోలో TTE నలుగురు వృద్ధ ప్రయాణీకులతో మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది. “వారందరికీ టిక్కెట్లు ఉన్నాయి. నలుగురూ సీనియర్ సిటిజన్లు. కానీ, వారిలో ఏ ఒక్కరికీ లోయర్ బెర్త్ రాలేదు. నలుగురికి మిడిల్, అప్పర్ బెర్త్ లు వచ్చాయి. సీనియర్ సిటిజన్లు అయినప్పటికీ వారికి లోయర్ బెర్త్‌ లు ఎందుకు లభించలేదో సందేహం వచ్చింది?. వాళ్లు చేసిన పొరపాటు కారణంగానే లోయర్ బెర్త్ రాలేదు. ఒక టికెట్ మీద ఇద్దరు వ్యక్తులు బుక్ చేసుకుంటే ఇద్దరికీ లోయర్ బెర్త్ లు లభిస్తాయి. ఒకే టికెట్ మీద నలుగురు బుక్ చేసుకుంటే రావు. ఇకపై సీనియర్ సిటిజన్స్ లోయర్ బెర్త్ కావాలంటే ఒక టికెట్ మీద కేవలం ఇద్దరే బుక్ చేసుకోవాలి” అని వివరించారు. ముగ్గురు లేదంటే నలుగురు సీనియర్ సిటిజెన్లు ఒకే టికెట్‌ పై బుక్ చేసుకుంటే సిస్టమ్ ఆటోమేటిక్ గా లోయర్ బెర్త్‌ లను ఇవ్వదని TTE వెల్లడించారు.

Advertisement

టీటీఈ వీడియోను చూసి ప్రయాణీకులు ఏమంటున్నారంటే?  

టీటీఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. TTE చెప్పిన యూజ్ ఫుల్ సమాచారాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. “డిఫాల్ట్‌ గా, సీనియర్ సిటిజన్లు సంఖ్యలతో సంబంధం లేకుండా లోయర్ బెర్త్ లు కన్ఫార్మ్ అయ్యేలా టిక్కెట్ బుకింగ్ వ్యవస్థను మార్చాల్సిన అవసరం ఉంది” అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. “నేను, మా సిస్టర్.. సీనియర్ సిటిజన్ అయిన మా అమ్మతో కలిసి టికెట్ బుక్ చేస్తే ఆమెకు లోయర్ బెర్త్ లభిస్తుందా?” అని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. “ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు ప్రయాణిస్తుంటే, వారు ఒక్కో టికెట్ మీద ఇద్దరు బుక్ చేసుకుంటే,  IRCTC S1, S7, S10 లాంటి డిఫరెంట్ కోచ్ లలో వారికి బెర్తులు కేటాయిస్తే, ప్రయాణం మరింత ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుంది” అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.

Advertisement

Read Also: కాలి నొప్పి అని లీవ్ పెట్టి పరిగెత్తుతావా? ఉద్యోగం నుంచి పీకేసిన కంపెనీ, కోర్టు సంచలన తీర్పు!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×