E-Paper
Advertisement

రైల్లో మీ లగేజీ మర్చిపోయారా? సింపుల్ గా ఇలా చేస్తే తిరిగి పొందవచ్చు!

రైల్లో మీ లగేజీ మర్చిపోయారా? సింపుల్ గా ఇలా చేస్తే తిరిగి పొందవచ్చు!
Advertisement

Train Passenger Guide: రైలు ప్రయాణాల్లో చాలా మంది ఎదుర్కొనే సాధారణ సమస్యల్లో ఒకటి సామాను మర్చిపోవడం. ముఖ్యంగా దిగే టైమ్ లో తొందరలో బ్యాగులు, ల్యాప్‌ టాప్‌ లు, మొబైల్ ఫోన్లు, ఇతర విలువైన వస్తువులను సీటు దగ్గరే  వదిలేసి వెళ్లిపోతుంటారు. ఇకపై మీకూ అలాంటి పరిస్థితి ఎదురైతే, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సరైన సమయంలో రైల్వే అధికారులకు సమాచారం ఇస్తే, పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందే అవకాశం ఉంటుంది.

రైల్లో సామాను మర్చిపోతే ఏం చేయాలంటే?

రైల్లో ఏదైనా వస్తువు మర్చిపోయినట్లు గుర్తిస్తే వెంటనే ఇండియన్ రైల్వే హెల్ప్‌ లైన్ నంబర్ 139కు కాల్ చేయాలి. కాల్ చేసిన తర్వాత మీ PNR నంబర్, రైలు నంబర్, కోచ్ నంబర్, బెర్త్ వివరాలు, పోగొట్టుకున్న వస్తువు గురించి సమాచారం ఇవ్వాలి. ఈ వివరాల ఆధారంగా రైల్వే అధికారులు సంబంధిత స్టేషన్ లేదంటే నెక్ట్స్ స్టేషన్‌ లో చెక్ చేసి వస్తువును గుర్తించే ప్రయత్నం చేస్తారు.

అందుబాటులో ‘రైల్ మదద్’

Advertisement

ఇక మొబైల్ వినియోగదారుల కోసం రైల్వే ప్రత్యేకంగా  రైల్ మదద్ యాప్‌ ను కూడా అందుబాటులో ఉంచింది. ఈ యాప్ ద్వారా ప్రయాణికులు తమ ఫిర్యాదులను ఆన్‌ లైన్‌ లో ఫైల్ చేయవచ్చు. ముందుగా ప్లే స్టోర్ లేదంటే యాప్ స్టోర్ నుంచి యాప్‌ ను డౌన్‌ లోడ్ చేసుకుని, మొబైల్ నంబర్ లేదంటే ఇమెయిల్ ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. లాగిన్ అయిన తర్వాత కంప్లైంట్ విభాగంలో PNR నంబర్, కోచ్, సీట్ నంబర్, పోయిన వస్తువు వివరాలు, సంఘటన జరిగిన డేట్ లాంటి వివరాలను ఎంటర్ చేయాలి. అవసరమైతే ఫోటోను కూడా అప్‌ లోడ్ చేయవచ్చు. ఫిర్యాదు నమోదు చేసిన వెంటనే ఒక ప్రత్యేక గ్రీవెన్స్ ఐడీ లభిస్తుంది. దీని ద్వారా కంప్లైంట్ స్టేటస్ ను ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకోవచ్చు.

రైలు కదులుతున్న సమయంలో సామాను పడిపోయినా..  

కొన్ని సందర్భాల్లో ప్రయాణికుల వస్తువులు కదులుతున్న రైలు నుంచి కింద పడిపోతుంటాయి. అలాంటి సమయంలో చాలామంది ఎమర్జెన్సీ చైన్ లాగడానికి ప్రయత్నిస్తారు. కానీ, అలా చేయడం చట్టపరంగా తప్పు. అత్యవసర పరిస్థితుల్లో కాకుండా చైన్ లాగితే జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంటుంది. అందుకే, రైల్లో నుంచి సామాను పడిపోతే, వెంటనే టికెట్ ఎగ్జామినర్ (TTE) లేదంటే రైల్వే సిబ్బందికి సమాచారం ఇవ్వడం మంచిది. వస్తువు ఎక్కడ పడిపోయిందో వివరాలు చెప్పాలి. వాళ్లు ఈ విషయాన్ని RPFకు అందజేస్తారు. వెంటనే అధికారులు స్పాట్ కు వెళ్లి సెర్చ్ చేస్తారు. వస్తువు లేదంటే సామాను లభిస్తే సంబంధిత స్టేషన్‌ లో భద్రపరుస్తారు. అక్కడికి వెళ్లి తీసుకోవచ్చు. రైలులో సామాను మర్చిపోయినా?  లేదంటే పోగొట్టుకున్నా వెంటనే రైల్వే అధికారులకు సమాచారం అందిస్తే, మీ వస్తువులను తిరిగి పొందే అవకాశం ఉంటుంది.

Advertisement

Read Also: భారీ శబ్దంతో చీలిపోయిన రైలు బోగి.. భయంతో ప్రయాణికుల పరుగులు!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×