E-Paper
Advertisement

Viral Video: వేగంగా వస్తున్న.. వందే భారత్ ముందుకు దూకిన కుక్క.. తర్వాత జరిగింది ఇదే!

Viral Video: వేగంగా వస్తున్న.. వందే భారత్ ముందుకు దూకిన కుక్క.. తర్వాత జరిగింది ఇదే!
Advertisement

Viral Dog Video:

కొన్ని వీడియోలు మనల్ని సీటు ఎడ్జ్ మీద కూర్చోబెడుతాయి. అలాంటి ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో ఓ కుక్క దాదాపు చావు అంచుల వరకు వెళ్లింది. యముడికి అలా షేక్ హ్యాండ్ ఇచ్చి మళ్లీ వచ్చేసింది. ఇంతకీ ఆ కుక్క చేసిన ఘనకార్యం ఏంటో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే, ఈ స్టోరీ తెలుసుకోవాల్సిందే..

జస్ట్ మిస్..  చావు నుంచి తప్పించుకున్న కుక్క

తాజాగా 𝙎𝘼𝙍𝘾𝘼𝙎𝙌𝙊 అనే ఎక్స్ అకౌంట్ నుంచి  ‘డాగేష్ భాయ్ కి స్పీడ్’ అంటూ ఓ వీడియో షేర్ చేయబడింది. ఈ వీడియోలో రెండు కుక్కలు ప్లాట్ ఫారమ్ మీది నుంచి వెళ్తుంటాయి. ఎదురుగా వందేభారత్ ఎక్స్ ప్రెస్ అత్యంత వేగంతో దూసుకొస్తుంది. అదే సమయంలో ప్లాట్ ఫారమ్ మీద ఉన్న డాగ్ ఒక్కసారిగా పట్టాల మీదికి దూకి వందేభారత్ రైలును తప్పించుకుని అవతలి వైపుకు వెళ్తుంది. క్షణ కాలంలో చావు నుంచి తప్పించుకుంది. ఈ వీడియోను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. వామ్మో అంటూ నోరెళ్లబెడుతున్నారు. నిజానికి వందేభారత్ పక్క ట్రాక్ నుంచి కూడా మరో రైలు వచ్చింది.   క్షణాల్లో వందేభారత్ తో పాటు మరో రైలును దాటుకుని కుక్క అవతలి వైపుకు సేఫ్ గా వెళ్లిపోవడాన్ని చూసి షాక్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Advertisement

నెటిజన్లు ఎలా రియాక్ట్ అవుతున్నారంటే?    

అటు ఈ వీడియోను చూసి నెటిజన్లు క్రేజీగా కామెంట్స్ పెడుతున్నారు. కొంత మంది సీరియస్ గా కామెంట్స్ చేస్తుంటే మరికొంత మంది ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. “బహుశ ఇది ఏఐ వీడియోలా అనిపిస్తోంది. ఏ కుక్క కూడా అంతలా రిస్క్ తీసుకోవాలి అనుకోదు” అని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. “ఈ కుక్క వందేభారత్ రైలును దాటింది ఒకే. అవతలి వైపు రైలును ఎలా దాటింది?” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు. ఇక మరో వ్యక్తి ఫన్నీగా “డాగేష్ ఇలాగే ఉంటాడు. ఖత్రోన్ కే ఖిలాడి” అని రాసుకొచ్చాడు. “ఈ కుక్క ఆత్మహత్య చేసుకోవాలని ఉంటుంది. కాకపోతే భయపడి బయటకు పారిపోయింది” అని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. “ప్లాట్‌ ఫారమ్‌  మీద నిలబడి ఉన్న ఎవరో మూర్ఖుడు దానిని వెంబడించి ఉండాలి. లేకపోతే, ఏ కుక్క కూడా అలా పరిగెత్తదు. ఎందుకంటే అవి తెలివైన జీవులు. ఆ వ్యక్తి ఎవరో గమనించి అతడిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు.  మొత్తంగా ఈ వీడియో ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది. బోలెడు వ్యూస్ తో పాటు కామెంట్స్ పొందుతోంది. “జంతువులు మెరుపు వేగంతో చావు నుంచి బయటపడుతాయి అనేందుకు ఇదో ఉదాహారణ” అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.

Advertisement

Read Also:  వీధి కుక్కలకు జీవిత ఖైదు.. జైల్లో పెట్టి మక్కెలు ఇరగదీసుడే.. ప్రభుత్వం కీలక నిర్ణయం!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×