E-Paper
Advertisement

Luckiest Flight Route: ఈ విమానాలు ఎక్కితే.. కిటికీ నుంచి స్వర్గం కనిపిస్తుంది, ఆ ఫీలే వేరు మామ!

Luckiest Flight Route: ఈ విమానాలు ఎక్కితే.. కిటికీ నుంచి స్వర్గం కనిపిస్తుంది, ఆ ఫీలే వేరు మామ!
Advertisement

విమాన ప్రయాణాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఆకాశంలో మేఘాల్లో తేలుతూ వెళ్తుంటే ఆ ఫీలింగ్ మాటల్లో చెప్పలేం. సుమారు 30 వేల అడుగుల ఎత్తులో నదుల మీదుగా, సముద్రాల మీదుగా, దట్టమైన అడవుల మీదుగా, వెండిలా మెరిసే మంచు కొండల మీదుగా వెళ్తుండగా, విమానం కిటికీలో నుంచి చూస్తే అబ్బుర పడాల్సిందే. ఇప్పుడు మనం ప్రపంచంలోనే అత్యంత రమణీయతతో కూడిన విమాన ప్రయాణ మార్గం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రపంచంలోనే లక్కీయెస్ట్ ఫ్లైట్ రూట్!

గ్లోబల్ ఫ్లైట్ ట్రాకింగ్ ప్లాట్‌ ఫామ్ వింగ్‌ బిట్స్ తాజాగా ప్రపంచంలోనే అత్యంత అందమైన విమాన ప్రయాణం గురించి వివరించింది. అది మరేదో కాదు, వాషింగ్టన్ డి.సి.లోని డల్లాస్ అంతర్జాతీయ విమానాశ్రయం (IAD) నుంచి టొరంటో పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయం (YYZ) వరకు కొనసాగే మార్గం. ఈ రూట్ నయాగరా జలపాతం మీదుగా కొనసాగుతుంది. వాటర్ ఫాల్స్ పొగమంచు, అద్భుతమైన శబ్దంతో జారిపోయే నీటి పరుగులు విమానంలో నుంచి చూస్తూ ఉంటే.. ఆహా.. ఆ ఫీలింగ్ వర్ణనాతీతం.  ఈ రూట్ ను లక్కీయెస్ట్ ఫ్లైట్ రూట్ గా పిలుస్తారు. నయాగరా మీదుగా వెళ్తుంటే కనిపించే అద్భుత దృశ్యాన్ని జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే!

భూగ్రహం మీద ఎక్కువగా ఇంద్రధనస్సు కనిపించే ప్రాంతం

Advertisement

వింగ్‌ బిట్స్ అధ్యయనం అల్లకల్లోలం లేని ప్రయాణంగా ఈ రూట్ గుర్తింపు తెచ్చుకుంది. ఈ రూట్ లో వెళ్లే విమాన ప్రయాణీకులకు అద్భుతమైన రెయిన్ బో ఎక్స్ పీరియెన్స్ కూడా కనిపిస్తుందని తెలిపింది.  IAD → YYZ రూట్ భూగ్రహం మీద అత్యంత ఎక్కువగా ఇంద్రధనస్సు కనిపించే ప్రాంతంగా గుర్తింపు తెచ్చుకుంది. నయాగరా జలపాతం ప్రతి సెకనుకు 3,100 టన్నుల కంటే ఎక్కువ నీటిని ఢీకొంటుంది. జలపాతం నుంచి చిలికే నీటి బిందువుల గుండా సూర్యరశ్మి దూసుకెళ్లడంతో ఇక్కడ కామన్ గా రెయిన్ బో ఏర్పడుతుందని తెలిపింది.   .

ఈ మార్గం ఎందుకు ప్రత్యేకమైనదంటే?  

వాతావరణ భౌతిక శాస్త్రవేత్త డాక్టర్ ఎలిజబెత్ ఆస్టిన్ సహకారంతో చేసిన అధునాతన వాతావరణ విశ్లేషణ, విమాన ట్రాకింగ్ డేటా కలయిక ఆధారంగా నయాగరా జలపాతం పైన ఉన్న ప్రాంతం వక్రీభవన వాతావరణ ప్రదర్శనలకు ప్రపంచంలోనే బెస్ట్ అని తేలింది. అంతేకాదు, ఈ మార్గంలో ప్రయాణించడం ద్వారా అదృష్టం కలుగుతుందని కొంత మంది భావిస్తారట. ఇదొక్కటే కాదు, ప్రపంచంలో మరికొన్ని మార్గాల్లోనూ విమాన ప్రయానం చేయడం లక్కీగా ఫీలవుతారు. ఈ మార్గాల్లోనూ ఇంద్ర ధనస్సులు ఎక్కువగా ఏర్పడుతాయట.

Advertisement

⦿ లండన్ హీత్రో (LHR) → డుబ్రోవ్నిక్ (DBV)

⦿ మ్యూనిచ్ (MUC) → పాల్మా డి మల్లోర్కా (PMI)

⦿ ఫ్రాంక్‌ఫర్ట్ (FRA) → రోమ్ ఫియుమిసినో (FCO)

⦿ ఫీనిక్స్ (PHX) → శాన్ ఫ్రాన్సిస్కో (SFO)

⦿ డల్లాస్ ఫోర్ట్ వర్త్ (DFW) → ఫ్రెస్నో యోస్మైట్ (FAT)

⦿ శాన్ జోస్ (SJC) → లాస్ వెగాస్ (LAS)

⦿ శాన్ ఫ్రాన్సిస్కో (SFO) → లాస్ వెగాస్ (LAS)

ఈ మార్గాల్లో ఎప్పుడూ రెయిన్ బోలు దర్శనం ఇస్తుంటాయట.

ఈ విమాన ప్రయాణాల్లో కిటికీలోంచి చూస్తే, పర్వతం నుంచి పర్వతం వరకు విస్తరించి ఉన్న ఇంద్రధనస్సును అద్భుంగా ఆకట్టుకుంటాయి.

⦿ ఫోజ్ డో ఇగువాకు → సావో పాలో

⦿ ఫ్నోమ్ పెన్ (PNH) → చాంగ్కింగ్ (CKG)

జలపాతాలు గర్జించే చోట కూడా ఇంద్రధనస్సులు కనువిందు చేస్తాయి. ఈ మార్గాల్లో జీవితంలో ఒక్కసారైనా ప్రయాణించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారని వింగ్‌ బిట్స్ తెలిపింది.

Read Also: భూమ్మీద కోల్డెస్ట్ రైలు ప్రయాణాలు, విండో ఓపెన్ చేస్తే గడ్డకట్టుకుపోతారండోయ్!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×