E-Paper
Advertisement

జమ్మూ నుంచి శ్రీనగర్‌ కు డైరెక్ట్ ట్రైన్.. దశాబ్దాల కల సాకారం!

జమ్మూ నుంచి శ్రీనగర్‌ కు డైరెక్ట్ ట్రైన్.. దశాబ్దాల కల సాకారం!
Advertisement

Direct Rail Link to Kashmir: జమ్మూ–కాశ్మీర్‌ కు నేరుగా రైలు సర్వీస్ కావాలనే ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న అక్కడి ప్రజల కల నెరవేరింది. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ జమ్మూలోని తావి నుంచి పొడిగించిన వందేభారత్ ఎక్స్ ప్రెస్ సర్వీసులను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో జమ్మూ-కాశ్మీర్ తొలిసారి దేశ రైల్వే నెట్‌ వర్క్‌ తో లింక్ అయ్యింది. ఇప్పుడు తావి నుంచి నేరుగా శ్రీనగర్ వరకు రైలు ప్రయాణం మొదలైంది. ఈ నేపథ్యంలో వైష్ణోదేవి ఆలయం, అమర్ నాథ్ ఆలయం లాంటి పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులకు మరింత ఉపయోగకరంగా ఉంటుంది. ఇంతకు ముందు మధ్యలో రైలు మారాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు ఒకే రైలులో సౌకర్యవంతంగా ప్రయాణించే అవకాశం ఉంటుంది.

ఉత్తర భారతానికి మెరుగైన రైల్వే సేవలు

జమ్మూ తావి స్టేషన్‌ ఉత్తర భారతానికి కీలక కేంద్రంగా మారనుంది. దేశంలోని అనేక ప్రధాన నగరాలతో ఇప్పటికే కనెక్టివిటీని కలిగి ఉంది. ఈ కొత్త సర్వీసు ఉత్తర భారతదేశానికి మరింత దగ్గర కానుంది. ఈ కొత్త సర్వీసు కేవలం ప్రజా రవాణాతో పాటు, ఆర్థిక, సామాజిక అభివృద్ధికి కూడా దోహదపడుతుందని మంత్రి వైష్ణవ్‌ చెప్పుకొచ్చారు. ఇప్పటి ఈ మార్గంలో నడుస్తున్న వందే భారత్‌ రైలు ప్రారంభమైనప్పటి నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈ రూట్‌ లో కొత్తగా 20 కోచ్‌ల రైలు నడపడం వల్ల ప్రయాణికులకు రవాణా సౌకర్యం పెరగనుంది. ఇక ఈ మార్గంలో అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకుని నడిచేలా ఈ వందేభారత్ ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. మంచు, చలిలోనూ ఎలాంటి ఇబ్బంది లేకుండా నడుస్తుంది.  ఈ రైలులో ఆధునిక సాంకేతికతను ఉపయోగించారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించారు. ప్రాంతీయ సంస్కృతిని పరిచయం చేయడానికి డోగ్రీ వంటకాలను కూడా అందిస్తున్నారు. ప్రయాణం సమయంలో కాశ్మీర్‌ అందాలు, సంస్కృతి గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది.

పర్యాటక రంగానికి మరింత ఊపు

Advertisement

జమ్మూ–కాశ్మీర్‌ ప్రాంతం ప్రకృతి అందాలకు ప్రసిద్ధి. మంచుతో కప్పబడిన పర్వతాలు, పచ్చని లోయలు, ప్రశాంతమైన సరస్సులు ఆకట్టుకుంటాయి. మెరుగైన రైలు సేవలతో ఈ ప్రాంత పర్యాటకం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. దేశం నలుమూలల నుంచి ఎక్కువ మంది పర్యాటకులు ఇక్కడికి రానున్నారు. ఈ రైల్వే కనెక్టివిటీతో వాణిజ్య రంగానికి కూడా  లాభం కలగనుంది. కాశ్మీర్‌ లో పండే ఆపిల్‌, డ్రై ఫ్రూట్స్‌, పష్మినా ఉత్పత్తులు దేశంలోని ఇతర ప్రాంతాలకు వేగంగా తరలించే అవకాశం ఉంది. జమ్మూకాశ్మీర్ రైతులు, వ్యాపారులకు లాభదాయకం అవుతుంది.

జమ్మూకాశ్మీర్ కు సంబంధించి మరిన్ని రైల్వే ప్రాజెక్టులు కూడా చేపడుతున్నారు. రైలు మార్గాల విస్తరణ, డబ్లింగ్‌, స్టేషన్ల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఇవన్నీ పూర్తయితే జమ్మూ–కాశ్మీర్‌ దేశంతో మరింత కనెక్టివిటీని కలిగి ఉంటుంది. మొత్తంగా ఈ రైల్వే సర్వీసు ఈ ప్రాంత అభివృద్ధికి కీలకంగా మారనుంది.

Advertisement

Read Also: అమృత్ భారత్ లో పుష్ పుల్ టెక్నాలజీ, రైల్వే కొత్త ప్రయోగం సక్సెస్ అయ్యేనా?

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×