E-Paper
Advertisement

చెన్నై ఎయిర్‌ పోర్ట్.. ఇండిగో ఎయిర్ లైన్స్.. ఆన్‌ టైమ్ పర్ఫార్మెన్స్ లో అదరగొట్టాయిగా!

చెన్నై ఎయిర్‌ పోర్ట్.. ఇండిగో ఎయిర్ లైన్స్.. ఆన్‌ టైమ్ పర్ఫార్మెన్స్ లో అదరగొట్టాయిగా!
Advertisement

Chennai Airport- IndiGo Airlines On Time Performance: దేశంలో దేశీయ విమాన ప్రయాణాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ విమానాలు సమయానికి నడవడం కూడా చాలా కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) విడుదల చేసిన తాజా గణాంకాలు ఆసక్తికర విషయాలను వెల్లడించాయి. మే 2026లో దేశంలోని ప్రధాన విమానాశ్రయాల్లో చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం సమయపాలనలో మొదటి స్థానాన్ని దక్కించుకోగా, దేశీయ విమానయాన సంస్థల్లో ఇండిగో అత్యుత్తమ పనితీరును కనబరిచింది.

DGCA నివేదికలో కీలక విషయాలు వెల్లడి

2026 జనవరి నుంచి మే నెల వరకు దేశీయ విమానయాన సంస్థలు మొత్తం 729.40 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాయి. గత ఏడాది ఇదే కాలంలో ఈ సంఖ్య 715.70 లక్షలుగా ఉంది. అంటే, ప్రయాణికుల సంఖ్యలో సుమారు 1.91 శాతం వార్షిక వృద్ధి నమోదైంది. నెలవారీగానూ భారీ పెరుగుదల కనిపించింది. దీంతో దేశీయ విమాన ప్రయాణాలకు డిమాండ్ ఇంకా బలంగా కొనసాగుతోందని స్పష్టమవుతోంది.

ఫస్ట్ ప్లేస్ లో చెన్నై ఎయిర్ పోర్టు

Advertisement

ఎయిర్ పోర్టు ఆన్ టైమ్ పర్ఫార్మెన్స్ లో చెన్నై విమానాశ్రయం అందరినీ ఆశ్చర్యపరిచింది. మే నెలలో ఇక్కడ 92.2 శాతం విమానాలు నిర్ణయించిన సమయానికి నడిచాయి. దీంతో ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి రద్దీ విమానాశ్రయాలను వెనక్కి నెట్టి చెన్నై అగ్రస్థానంలో నిలిచింది.రెండో స్థానంలో కోల్‌కతా విమానాశ్రయం (84.7%), మూడో స్థానంలో హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (84.4%) నిలిచాయి. ఆ తర్వాత బెంగళూరు, కొచ్చి, అహ్మదాబాద్, లక్నో, గౌహతి విమానాశ్రయాలు వరుసగా ఉన్నాయి. దేశంలో అత్యంత రద్దీగా ఉండే ఢిల్లీ విమానాశ్రయం 72.6 శాతంతో, ముంబై విమానాశ్రయం 70.5 శాతంతో జాబితాలో చివరి స్థానాల్లో నిలిచింది.

మళ్లీ నెంబర్ గా ఇండిగో

విమానయాన సంస్థల విషయానికి వస్తే, ఇండిగో మరోసారి తన ఆధిపత్యాన్ని చాటింది. మే నెలలో 82.8 శాతం OTPతో దేశంలోనే అత్యంత టైమ్ మెయింటెనెన్స్ పాటించిన ఎయిర్‌ లైన్‌ గా నిలిచింది. అకాసా ఎయిర్ 78.3 శాతంతో రెండో స్థానంలో ఉండగా, ఎయిర్ ఇండియా గ్రూప్ 74.5 శాతంతో మూడో స్థానంలో నిలిచింది. అలయన్స్ ఎయిర్, స్పైస్‌ జెట్ ఆ తర్వాత  స్థానాల్లో ఉన్నాయి.

Advertisement

మరో ఆసక్తికర విషయం ఏమిటంటే, అకాసా ఎయిర్ అత్యల్ప విమాన రద్దులను నమోదు చేసింది. ఈ ఎయిర్‌ లైన్‌లో కేవలం 0.1 శాతం విమానాలే రద్దయ్యాయి. ఇండిగో, ఎయిర్ ఇండియా గ్రూప్ కూడా తక్కువ రద్దులతో సత్తా చాటాయి. మొత్తం దేశీయ విమానాల రద్దు రేటు మే నెలలో 0.55 శాతంగా నమోదైంది.  విమానాల రద్దుకు ప్రధాన కారణాల్లో సాంకేతిక సమస్యలు మొదటి స్థానంలో నిలిచాయి. మొత్తం రద్దుల్లో దాదాపు 45 శాతం టెక్నికల్ ఇబ్బందుల వల్లే జరిగాయి. ఆ తర్వాత ఆపరేషనల్ సమస్యలు, ప్రతికూల వాతావరణం, ఇతర కారణాలు ఉన్నాయి.

Read Also: విజయవాడ నుంచి వారణాసి, కోల్‌కతాకు డైరెక్ట్ ఫ్లైట్స్.. ఇండిగో బిగ్ సర్‌ప్రైజ్!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×