E-Paper
Advertisement

రైలులో ఫస్ట్ నైట్.. ఫస్ట్ ఏసీ క్లాసులో బెడ్, అబ్బో ఏం సెట్ చేశారయ్యా!

రైలులో ఫస్ట్ నైట్.. ఫస్ట్ ఏసీ క్లాసులో బెడ్, అబ్బో ఏం సెట్ చేశారయ్యా!
Advertisement

Viral Train Honeymoon Video: సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. కానీ, తాజాగా నెటిజన్ల దృష్టిని ఆకర్షించిన ఒక వీడియో మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సాధారణంగా పెళ్లిళ్లకు కార్లు, హోటల్ గదులు, రిసార్ట్ లను అందంగా అలంకరించడం చూస్తుంటాం. కానీ, తాజాగా పరుగులు తీస్తున్న రైలులోని ఏసీ కోచ్‌ ను శోభనం గదిలా మార్చేయడం అందరినీ అవాక్కయ్యేలా చేసింది.ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

ఇంతకీ ఆ వీడియో ఏముందంటే?

వైరల్ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు చూస్తే రైలు కోచ్ అని చెప్పడం కూడా కష్టమే. ఎక్కడ చూసినా ఎర్ర గులాబీలు, మల్లెపూల దండలు, రంగురంగుల బెలూన్లు, మెరిసే ఎల్‌ఈడీ లైట్లు, అందమైన అలంకరణతో కోచ్ మొత్తం పెళ్లి వేడుక వాతావరణాన్ని తలపిస్తోంది. ఓవైపు వాల్ మీద I Love You అనే అక్షరాలు కూడా కనిపించడంతో, ఇది కొత్త జంట కోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన క్యాబిన్ గా అర్థం అవుతోంది. ఇంకా చెప్పాలంటే కదులుతున్న రైల్లో హనీమూన్ కోసం రెడీ చేశారన్నమాట.

Advertisement

ఫన్నీగా రియాక్ట్ అవుతున్న నెటిజన్లు

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కామెంట్ల వరద పారుతోంది. “ఇది రాజధాని ఎక్స్‌ ప్రెస్ కాదు… హనీమూన్ ఎక్స్‌ ప్రెస్!” అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు “ఇక ట్రాఫిక్ టెన్షన్ లేదు… ఫస్ట్ నైట్ కూడా ట్రైన్‌ లోనే!” అంటూ ఫన్నీగా స్పందిస్తున్నారు. ఇప్పటికే డెస్టినేషన్ వెడ్డింగ్స్ ట్రెండ్ బాగా పెరిగింది. పెళ్లి తర్వాత హనీమూన్ కోసం అందమైన ప్రాంతాలకు వెళ్లడం కూడా చాలా సాధారణమైంది. అయితే, ఈ జంట మాత్రం ఇంకాస్త భిన్నంగా ఆలోచించి, తమ ఫస్ట్ నైట్ ను కదులుతున్న రైలులోనే జరుపుకోవాలని నిర్ణయించుకున్నట్టుగా కనిపిస్తోంది. అందుకే ఈ వీడియో చూసినవాళ్లు ఆశ్చర్యంతో పాటు నవ్వుకుంటున్నారు.

రైలు కోచ్ ను ఇలా వాడుకోవచ్చా?

Advertisement

ఈ వీడియో చూసిన తర్వాత చాలా మందికి ఓ డౌట్ వస్తోంది. అసలు ఇలా  రైలు కోచ్‌ను బుక్ చేసుకుని అలంకరించుకోవచ్చా? అనే ప్రశ్న తలెత్తుతోంది. అయితే, ఇందుకోసం భారతీయ రైల్వేలో ఫుల్ టారిఫ్ రేట(FTR) అనే ప్రత్యేక సదుపాయం ఉంది. దీని ద్వారా పెళ్లి బృందాలు, కుటుంబ వేడుకలు, ప్రత్యేక టూర్లు, ఇతర కార్యక్రమాల కోసం పూర్తి కోచ్‌లను, ప్రత్యేక రైళ్లను బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే, కోచ్‌ను అలంకరించుకోవడానికి కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి. రైల్వే ఆస్తులకు ఎలాంటి నష్టం కలగకూడదు. సీట్లు, కిటికీలు, ఎలక్ట్రికల్ వైరింగ్ కు ఎలాంటి డ్యామేజ్ కాకూడదు. ఇతర ప్రయాణికులకు అసౌకర్యం కలిగించే విధంగా అలంకరణ ఉండకూడదు. ముఖ్యంగా కొవ్వొత్తులు, అగ్ని ప్రమాదానికి కారణమయ్యే వస్తువులు వాడటం పూర్తిగా నిషేధం. మొత్తంగా ఈ వీడియో చూసిన తర్వాత చాలామంది.. ఇక హనీమూన్‌కు హిల్ స్టేషన్ అవసరమేంటి… రైలే సరిపోతుందని సరదా కామెంట్స్ చేస్తున్నారు.

Read Also: రైలు బోగిలో ఫస్ట్ నైట్ పై స్పందించిన రైల్వే.. వాళ్లకు దబిడి దిబిడే!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×