E-Paper
Advertisement

ఆదివారాల్లో టూరిస్టులకు నో ఎంట్రీ.. అత్యంత పరిశుభ్రమైన గ్రామం సరికొత్త నిర్ణయం!

ఆదివారాల్లో టూరిస్టులకు నో ఎంట్రీ.. అత్యంత పరిశుభ్రమైన గ్రామం సరికొత్త నిర్ణయం!
Advertisement

Mawlynnong Village Tourism Restriction: ఆసియాలోనే అత్యంత పరిశుభ్రమైన గ్రామంగా గుర్తింపు పొందిన మేఘాలయలోని మావ్లిన్నాంగ్ గ్రామం ఇప్పుడు సరికొత్త నిర్ణయం తీసుకుంది. సంవత్సరాలుగా పర్యాటకులకు స్వాగతం పలికిన ఈ గ్రామం.. ఇప్పుడు ప్రతి ఆదివారం టూరిస్టులను రావొద్దని చెప్తోంది. సుమారు 600 మంది నివసించే ఈ చిన్న గ్రామానికి ప్రతి వారం వందలాది మంది పర్యాటకులు వస్తుంటారు. పరిశుభ్రమైన వీధులు, పచ్చదనం, బుట్టల్లో చెత్త వేయడం వంటి ప్రత్యేక అలవాట్లతో ఈ గ్రామానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. 2003లో ఈ గ్రామం ఆసియాలోనే అత్యంత పరిశుభ్రమైన గ్రామంగా ప్రకటించడంతో మావ్లిన్నాంగ్ ఒక్కసారిగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఈ గ్రామాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు రావడం ప్రారంభమైంది.

పర్యాటక రంగం మరింత అభివృద్ధి

పర్యాటకుల సంఖ్య పెరగడం వల్ల గ్రామానికి ఆర్థికంగా లాభం చేకూరింది. గ్రామస్తులు వ్యవసాయం నుంచి పర్యాటక రంగానికి మారి, హోమ్‌ స్టేలు, చిన్న రెస్టారెంట్లు, టీ స్టాల్స్ నిర్వహించడం ప్రారంభించారు. ప్రతి వారం వేలాది సందర్శకులు రావడంతో గ్రామం బాగా అభివృద్ధి చెందింది. అయితే, పర్యాటకుల రద్దీతో కొన్ని సమస్యలు కూడా ఎదురయ్యాయి. చెత్త వేయడం, గందరగోళం, నివాస స్థలాలు తగ్గిపోవడం లాంటి ఇబ్బందులు గ్రామస్తులను ప్రభావితం చేశాయి.

Advertisement

అంతేకాదు, ఇందుకు వారి సాంస్కృతిక, ఆధ్యాత్మిక జీవితం కూడా కారణం అయ్యింది. మావ్లిన్నాంగ్‌ లో అధికంగా క్రైస్తవులు ఉంటారు. ఆదివారాన్ని వారు ప్రార్థనలకు, చర్చికి వెళ్లడానికి ప్రత్యేకంగా కేటాయిస్తారు. పర్యాటకుల రద్దీ వల్ల ఆ రోజు ప్రశాంతంగా గడపలేకపోతున్నామని గ్రామస్తులు భావించారు. అందుకే గ్రామ కమిటీ ఓ నిర్ణయం తీసుకుని, ఆదివారాల్లో పర్యాటకులను పూర్తిగా అనుమతించకూడదని నిర్ణయించింది.

వారంలో ఒకరోజు ప్రశాంత జీవనం

ఈ నిర్ణయం వల్ల వారంలో ఒక రోజు గ్రామం పూర్తిగా నిశ్శబ్దంగా మారుతుంది. దుకాణాలు మూసివేస్తారు, కార్ పార్కింగ్ ఖాళీగా ఉంటుంది, వీధుల్లో కేవలం స్థానికులు మాత్రమే కనిపిస్తారు. చర్చికి వెళ్లే కుటుంబాలు, ప్రార్థనలు చేసుకునే ప్రజలతో గ్రామం ఆధ్యాత్మిక వాతావరణంలో ఉంటుంది.

Advertisement

కొంతమంది వ్యాపారులు ఆదివారం పర్యాటకులను నిషేధం వల్ల ఆదాయం తగ్గుతుందని భావించినా, ఎక్కువ మంది గ్రామస్తులు ఈ నిర్ణయానికి సపోర్టు చేశారు. పర్యాటకుల రద్దీ నుంచి ఒక రోజు విరామం తీసుకోవడం వల్ల మళ్లీ రీఫ్రెష్ అవుతామని అభిప్రాయపడ్డారు.  పర్యాటకులలో కొంతమంది ఈ నియమాన్ని విమర్శించినా, చాలా మంది అర్థం చేసుకుంటున్నారు. గ్రామం పరిశుభ్రంగా ఉండటానికి, స్థానికుల జీవనశైలిని గౌరవించడానికి ఈ నిర్ణయం అవసరమని భావిస్తున్నారు.  మావ్లిన్నాంగ్ గ్రామం ఒక వైపు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తూ, మరోవైపు తన సంప్రదాయాలను కాపాడుకోవడానికి ప్రత్యేకమైన మార్గాన్ని ఎంచుకుంది. వారంలో ఆరు రోజులు పర్యాటకులను ఆహ్వానించే ఈ గ్రామం, ఏడవ రోజు మాత్రం పూర్తిగా తన కోసం, తన ప్రజల కోసం కేటాయిస్తోంది.

Read Also: లడఖ్ ప్రజలను కాపాడుతున్న మంచు స్థూపం.. ఇది లేకపోతే ఏమైపోయేవాళ్ళో!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×