E-Paper
Advertisement

ఇదేందయ్యా ఇది.. ఇక్కడ కారు నడిపితే, ఆకాశంలో తేలినట్లే.. నెవర్ బిఫోర్ రోడ్డు!

ఇదేందయ్యా ఇది.. ఇక్కడ కారు నడిపితే, ఆకాశంలో తేలినట్లే.. నెవర్ బిఫోర్ రోడ్డు!
Advertisement

Sky Road: రోడ్డుపై కారులో వెళ్తున్నారా లేక మేఘాల్లో తేలుతున్నారా? అనే భ్రమను కలిగిస్తోంది చైనాలోని అన్హుయ్ ప్రావిన్స్‌ (Anhui province)లో ఉన్న పింగ్‌తియాన్ సరస్సు (Pingtian Lake). అక్కడ నిర్మించిన వంకరటింకర్ల రహదారి ఇప్పుడు ఒక ఊహాలోకాన్ని తలపిస్తోంది. సరస్సులోని స్వచ్ఛమైన నీరు.. నీలాకాశాన్ని అద్దంలా ప్రతిబింబిస్తుండటంతో పైనుంచి చూస్తే ఆకాశ మార్గాన్ని (స్కై రోడ్) అది తలపిస్తోంది.

అద్దంలా మెరుస్తున్న సరస్సు

ప్రస్తుతం చైనాలో వర్షాలు తగ్గి వాతావరణం ఆహ్లాదకరంగా మారడంతో పింగ్‌తియాన్ సరస్సు వద్ద దృశ్యాలు వింత అనుభూతిని పంచుతున్నాయి. అక్కడి నీటి స్వచ్ఛదనానికి పైన ఉన్న ఆకాశం, తేలియాడే మేఘాలు నీటిపై స్పష్టంగా కనిపిస్తున్నాయి. దాంతో భూమికి-ఆకాశానికి మధ్య సరిహద్దులు చెరిపేసి ఒక అద్భుతమైన రోడ్డును నిర్మించిన అనుభూతి కలుగుతోంది.

Advertisement

మేఘాల్లో తేలియాడే వాహనాలు

ఈ అందమైన రహదారి గుండా వాహనాలు వెళ్తుంటే.. రోడ్డుపై కాకుండా నింగిలో మేఘాల మధ్య ప్రయాణిస్తున్న భావన చూపరులకు కలుగుతోంది.  అక్కడ ప్రయాణించే డ్రైవర్లకు, పర్యాటకులకు ఇదొక మంత్రముగ్ధులను చేసే అనుభవంగా మారుతోంది. ఈ మనోహరమైన దృశ్యాలను చూడటానికి, కెమెరాల్లో బంధించడానికి పెద్ద సంఖ్యలో సందర్శకులు ఇక్కడికి తరలివస్తున్నారు.

Advertisement

Also Read: కోర్టు వీడియోలు వైరల్ చేస్తే.. అంతే సంగతులు.. సుప్రీంకోర్టు సంచలన ఉత్తర్వులు!

సోషల్ మీడియాలో వైరల్

ప్రస్తుతం స్కై రోడ్ ను తలపించేలా ఉన్న ఆ మార్గానికి సంబంధించిన డ్రోన్ విజువల్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ప్రకృతి అందాలకు ఒక అద్భుతమైన రోడ్డు మార్గం జత కలిస్తే ఎంతటి అద్భుతాన్ని సృష్టించవచ్చో అనడానికి ఇదే ఒక నిదర్శనమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మెుదట చూసి నిజంగానే ఆకాశానికి రోడ్డు వేశారా? అని ఆశ్చర్యపోయినట్లు ఓ నెటిజన్ పేర్కొన్నాడు. ఇది నిజం కాదని, గ్రాఫిక్స్ ఏమో అనుకొని భ్రమ పడినట్లు మరొకరు కామెంట్ చేశారు. అయితే స్వర్గానికి దారి దొరికేసిందంటూ మరికొందరు ఫన్నీగా పోస్టులు పెడుతున్నారు. మెుత్తం మీద చైనాలో ఆవిష్కృతమైన ఈ అద్భుత దృశ్యం.. ప్రకృతి ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

Also Read: BSNL రూ. 2,799 vs Vi రూ. 2,249.. ఎక్కువ బెనిఫిట్స్ ఇచ్చే వార్షిక ప్లాన్ ఏది?

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×