E-Paper
Advertisement

Train PNR Status: ఇంటర్నెట్ లేకున్నా ట్రైన్ PNR స్టేటస్ తెలుసుకోవచ్చు, ఎలాగంటే?

Train PNR Status:  ఇంటర్నెట్ లేకున్నా ట్రైన్ PNR స్టేటస్ తెలుసుకోవచ్చు, ఎలాగంటే?
Advertisement

Indian Railway PNR Status:

ప్రయాణీకుల సౌలభ్యాన్ని మెరుగుపరిచేందుకు భారతీయ రైల్వే ఎప్పటికప్పుడు కొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇప్పటి వరకు ప్రయాణీకులు PNR స్టేటస్ ను చెక్ చేయడానికి IRCTC యాప్  లేదంటే వెబ్‌ సైట్‌ మీద ఆధారపడాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు మరింత ఈజీగా PNR స్టేసట్ తెలుసుకునే అవకాశం కల్పిస్తోంది. ఇంటర్నెట్ లేకపోయినా, ప్రయాణీకులు తమ ఫోన్‌ నుంచి SMS ద్వారా రైలు PNR స్థితిని చెక్ చేసుకోవచ్చు. MakeMyTrip సహకారంతో, WhatsApp ద్వారా కూడా PNR స్టేటస్ తెలుసుకునే అవకాశం కల్పిస్తోంది.

SMS ద్వారా PNR స్థితిని ఎలా తెలుసుకోవచ్చంటే?

మీకు ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా, ఫీచర్ ఫోన్ ఉపయోగించకపోయినా సింపుల్ గా PNR స్టేటస్ ను ఈజీగా తెలుసుకునే అవకాశం ఉంది. ఎలాగంటే..

Advertisement

⦿ ఫోన్ లో మెసేజెస్ యాప్‌ కి వెళ్లి PNR అని టైప్ చేయాలి.

⦿  ఒక స్పేస్ ఇచ్చి మీ PNR నంబర్‌ ను రాయాలి.

Advertisement

⦿ ఉదాహరణకు మీ PNR నంబర్ 4758126582 అయితే, మీరు — PNR 4758126582 అని టైప్ చేయాలి.

⦿ ఆ తర్వాత ఈ  మెసేజ్ ను 139 నెంబర్ కు మెసేజ్ పంపించాలి.

⦿ PNR స్టేటస్ కు సంబంధించిన వివరాలు మెసేజ్ రూపంలో అందుతాయి.

ఈ సర్వీసు ద్వారా, ప్రయాణీకులు ఇంటర్నెట్ లేకుండా వారి ప్రయాణానికి సంబంధించి అప్ డేట్ చేయబడిన సమాచారాన్ని పొందే అవకాశం ఉంటుంది.

Read Also: తెలంగాణ బిడ్డకు రూ.240 కోట్ల లాటరీ.. ఇదిగో ఇలా చేస్తే మీరూ కోటీశ్వరులే!

⦿ ఆన్‌లైన్‌లో PNR స్టేటస్ ఎలా చెక్ చేయాలి?

ఆన్‌లైన్‌లో PNR స్టేసట్ ను చెక్ చేయడానికి, ప్రయాణీకులు భారతీయ రైల్వే అధికారిక వెబ్‌సైట్, www.indianrail.gov.in లేదంటే IRCTC వెబ్‌ సైట్, www.irctc.co.in ని ఓపెన్ చేసి టికెట్ PNR నంబర్‌ను ఎంటర్ చేస్తే, కొన్ని క్షణాల్లో, మీ సీటు, కోచ్, రైలు స్టేసట్, బుకింగ్ స్టేటస్ వివరాలన్నీ ఓపెన్ అవుతాయి.

⦿ వాట్సాప్ ద్వారా PNR స్టేటస్ ఎలా చెక్ చేయాలంటే?  

గత సంవత్సరం, భారతీయ రైల్వే..  ప్రయాణీకులు WhatsApp ద్వారా వారి PNR స్టేటస్ ను చెక్ చేసుకునే అవకాశాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని కోసం, ప్రయాణీకులు ముందుగా 7349389104 నంబర్‌ ను వారి మొబైల్ ఫోన్‌లో సేవ్ చేసుకోవాలి. ఆ తర్వాత, WhatsAppను ఓపెన్ చేసి మీ కాంటాక్ట్ లిస్ట్‌ ను రిఫ్రెష్ చేయాలి. ఆ తర్వాత ఈ నంబర్ మీ చాట్ లిస్ట్‌ లో కనిపిస్తుంది. ఈ నెంబర్ కు మీ PNR నంబర్‌ ను పంపించాలి. మెసేజ్ పంపిన వెంటనే మీ PNR స్టేటస్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుంటారు. మీరు ఈ నంబర్‌ సాయంతో రైలు కరెంట్ స్టేటస్ ను తెలుసుకునే అవకాశం ఉంటుంది.

Read Also:  వందే భారత్ రైలు జర్నీకి బ్రిటన్ దంపతులు ఫిదా, అల్లం చాయ్ అదుర్స్ అంటూ..

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×