E-Paper
Advertisement

వెహికల్ మీద కులం పేరు రాస్తున్నారా? అయితే, ఇక దబిడి దిబిడే!

వెహికల్ మీద కులం పేరు రాస్తున్నారా? అయితే, ఇక దబిడి దిబిడే!
Advertisement

New Motor Vehicle Rules: వాహనాలపై కులం, మతం, ఇతరులను రెచ్చగొట్టేలా ఉండే స్టిక్కర్లు, రాతలు రాయడం మానుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం ఇలాంటి చర్యలను నిబంధనల ఉల్లంఘనగా పరిగణించాల్సి ఉంటుందన్నారు.  ముఖ్యంగా నంబర్ ప్లేట్ విషయంలో కఠినంగా వ్యవహరించనున్నట్లు వెల్లడించారు. నంబర్ ప్లేట్‌ పై రిజిస్ట్రేషన్ నంబర్ తప్ప మరే ఇతర పదాలు, గుర్తులు, స్టిక్కర్లు ఉండకూడదు.

రూ. 10 వేల వరకు జరిమానా

Advertisement

నిబంధనలను ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పోలీసులు వెల్లడించారు. మొదటిసారి పట్టుబడితే రూ.5,000 వరకు ఫైన్ విధించే అవకాశం ఉంది. అదే తప్పును మళ్లీ చేస్తే రూ.10,000 వరకు జరిమానా పెరగడంతో పాటు జైలు శిక్ష పడే అవకాశమూ ఉంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో పోలీసులు ఈ విషయంలో మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ రాష్ట్రాల్లో వాహనాలపై కులం పేర్లు రాయడం వల్ల సామాజిక ఘర్షణలు పెరుగుతున్నాయని అధికారులు గుర్తించారు. చిన్న చిన్న విషయాలకే వివాదాలు తలెత్తుతున్న నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టారు. మొదట ఉత్తరప్రదేశ్‌లో ఈ నిబంధనలను కఠినంగా అమలు చేయడం ప్రారంభించగా,  ఆ తర్వాత హర్యానాలో కూడా ఇలాంటి రాతలను పూర్తిగా నిషేధించారు.

MVC సెక్షన్ 177 కింద కేసులు

Advertisement

వాహనాలపై కులం, వివాదాస్పద నినాదాలు రాస్తే శిక్షార్హం అవుతుంది. వాహనంపై అలాంటి రాతలు ఉన్నా, నంబర్ ప్లేట్‌ పై సంఖ్య తప్ప మరేదైనా కనిపించినా జరిమానా తప్పదు. అవసరమైతే వాహనాన్ని స్వాధీనం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మోటారు వాహన చట్టంలోని సెక్షన్ 177 కింద కేసులు కూడా నమోదు చేస్తారు. వెహికల్ బాడీపై కూడా కులం, మతానికి సంబంధించిన గుర్తులు పెట్టుకోవడం నిబంధనలకు విరుద్ధంగా పరిగణిస్తారు. రూ.1,000 నుంచి రూ.2,500 వరకు జరిమానా విధించవచ్చు. పరిస్థితిని బట్టి పోలీసులు వాహనాన్ని సీజ్ చేసే అవకాశమూ ఉంటుంది.

మోటార్ వెహికల్ యాక్ట్ ఏం చెప్తుందంటే?

సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ 1989 ప్రకారం నంబర్ ప్లేట్ స్పష్టంగా ఉండాలి. కేవలం వాహన నంబర్ మాత్రమే కనిపించాలి. ఇది ట్రాఫిక్ నియంత్రణకు, నేరాలలో ఉపయోగించిన వాహనాలను సులభంగా గుర్తించడానికి అనుకూలంగా ఉండాలి. అనవసరమైన స్టిక్కర్లు, రాతలు ఉంటే వాహనాన్ని గుర్తించడం కష్టమవుతుంది. వాహనాలపై కులం, మతం పేర్లు ప్రదర్శించడం వల్ల అనవసరంగా గొడవలు జరిగే అవకాశం ఉంది. వాటిని ముందుగానే అరికట్టేందుకు పోలీసులు ఈ చర్యలు తీసుకుంటున్నారు.

సో, ఇకపై మీ వాహనంపై ఇలాంటి స్టిక్కర్లు, రాతలు ఉంటే వెంటనే తొలగించడం మంచిది. లేకపోతే ట్రాఫిక్ పోలీసులు తనిఖీ చేసినప్పుడు జరిమానా మాత్రమే కాకుండా వాహనం సీజ్ అయ్యే పరిస్థితి కూడా రావచ్చు. వాహనంపై ఏదైనా రాయించుకునే ముందు చట్టాలను గుర్తుంచుకోవడం అవసరం. నియమాలను పాటిస్తే అనవసరమైన ఇబ్బందులను సులభంగా తప్పించుకోవచ్చు.

Read Also: వందే భారత్‌లో ‘ఫుడ్’ దందా.. నిలదీస్తే ఏం చేశారో తెలుసా?

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×