E-Paper
Advertisement

జస్ట్ 3 గంటల్లోనే హైదరాబాద్-ముంబై జర్నీ.. హైస్పీడ్ ట్రైన్ వచ్చేస్తోంది!

జస్ట్ 3 గంటల్లోనే హైదరాబాద్-ముంబై జర్నీ.. హైస్పీడ్ ట్రైన్ వచ్చేస్తోంది!
Advertisement

India’s Next High-Speed Route: భారతీయ రైల్వే ప్రయాణం రోజు రోజుకు మరింత అప్ డేట్ అవుతోంది. ఇప్పటికే సెమీ హైస్పీడ్ రైలు వందేభారత్ అందుబాటులోకి రాగా, మరోవైపు బుల్లెట్ రైలు కారిడార్ నిర్మాణం శరవేగంగా కొనసాగుతోంది. ముంబై- అహ్మదాబాద్ గా మధ్య ఈ రైలు సేవలు ప్రారంభం కానున్నాయి. ఇండియాలో తొలి హైస్పీడ్ రైల్వే కారిడార్ గా ఇది గుర్తింపు తెచ్చుకోనుంది. మరోవైపు రెండో హైస్పీడ్ రూట్ హైరదాబాద్- ముంబై మధ్య అందుబాటులోకి రానుంది. రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం 3 గంటలకు తగ్గనుంది.

హైస్పీడ్ రైలు ప్రాజెక్టు డీపీఆర్ పూర్తి

హైదరాబాద్ నుంచి ముంబైకి కేవలం 3 గంటల్లో చేరేలా చేసే హైస్పీడ్ రైలు ప్రాజెక్ట్‌ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్–పుణే–ముంబై మధ్య ప్రతిపాదించిన ఈ హైస్పీడ్ కారిడార్‌ కు సంబంధించిన డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ పూర్తయ్యింది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పనులు వేగంగా కొనసాగే అవకాశం ఉంది.

గంటకు 330 కి.మీ వేగంతో ప్రయాణం

Advertisement

ఈ హైస్పీడ్ రైలు మార్గం మొత్తం పొడవు సుమారు 761 కిలోమీటర్లు ఉంటుంది. ఇందులో రైళ్లు గరిష్టంగా గంటకు 330 కిలోమీటర్ల వేగంతో నడిచేలా ప్లాన్ చేశారు. ప్రస్తుతం ఉన్న రైళ్లతో పోలిస్తే అత్యంత వేగం. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే హైదరాబాద్ నుంచి ముంబై ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది. కేవలం 3 గంటల్లో పూర్తి కానుంది. ఈ రూట్‌ లో మొత్తం 12 స్టేషన్లు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ముఖ్య నగరాలను కలుపుతూ ఈ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. అటు వికారాబాద్ సమీపంలో సుమారు 4.6 కిలోమీటర్ల పొడవైన టన్నెల్ నిర్మించనున్నారు. ఈ టన్నెల్ నిర్మాణం ప్రాజెక్ట్‌ లో అత్యంత కీలకం కానుంది.

హైస్పీడ్ రైలుతో కలిగే లాభాలు ఇవే!

ఈ హైస్పీడ్ కారిడార్ కేవలం రవాణా సౌకర్యానికే పరిమితం కాదు. కీలక ఆర్థిక అభివృద్ధి మార్గంగా మారే అవకాశముంది. హైదరాబాద్, పుణే, ముంబై లాంటి ప్రధాన నగరాలను వేగంగా కలపడం ద్వారా వ్యాపార అవకాశాలు పెరుగుతాయి. పరిశ్రమలు, ఐటీ రంగం, సేవా రంగాలకు మరింత సపోర్టుగా నిలువనుంది. ఉద్యోగాల సృష్టిలో కూడా ఈ ప్రాజెక్ట్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ ప్రాజెక్ట్ నిర్మాణ దశలో వేల సంఖ్యలో ఉద్యోగాలు లభించనున్నాయి. ప్రాజెక్ట్ పూర్తయ్యాక కూడా పలు రంగాల్లో ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. రవాణా సౌకర్యం మెరుగుపడటం వల్ల ఈ మార్గంలోని చిన్న పట్టణాలు కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంది.

Advertisement

Read Also: తిరుపతి వెళ్లే భక్తులకు అలర్ట్, పలు రైళ్లు రద్దు, మరికొన్ని దారిమళ్లింపు!

హైదరాబాద్–పుణే–ముంబై హైస్పీడ్ రైలు ప్రాజెక్ట్ దేశ రవాణా రంగంలో కీలక మార్పునకు ముందడుగు పడనుంది. వేగవంతమైన ప్రయాణం, మెరుగైన కనెక్టివిటీ, ఆర్థిక అభివృద్ధిని కలిపి ఈ ప్రాజెక్ట్‌ భవిష్యత్తు రవాణాకు కీలక మైల్ స్టోన్ కానుంది.

Read Also: అమ్మో ఇండియన్ రైల్వే.. అన్ని లక్షల మంది పని చేస్తున్నారా?

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×