E-Paper
Advertisement

హైదరాబాద్‌లో ఏం జరిగింది? ముగ్గురు పైలట్లకు అస్వస్థత, విచారణ చేపట్టిన బ్రిటిష్ ఎయిర్‌వేస్

హైదరాబాద్‌లో ఏం జరిగింది? ముగ్గురు పైలట్లకు అస్వస్థత, విచారణ చేపట్టిన బ్రిటిష్ ఎయిర్‌వేస్
Advertisement

Hyderabad:  హైదరాబాద్‌లో బస చేసి లండన్‌కు బయలుదేరిన బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ విమాన ముగ్గురు పైలట్లు అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆ విమాన సంస్థ దర్యాప్తు మొదలుపెట్టింది. అయితే ఫుడ్‌ పాయిజనింగ్‌ కారణంగా ఈ ఘటన జరిగి ఉండే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. అసలు ఏం జరిగింది?

హైదరాబాద్‌లో ఏం జరిగింది? హైదరాబాద్‌ నుంచి లండన్‌ హీత్రోకు బయలుదేరింది బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌‌కి చెందిన ఓ విమానం. అయితే విమానం సుమారు 30 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుండగా పైలట్‌కు తీవ్ర అస్వస్థత గురయ్యాడు. సరిగా విధులు నిర్వహించ లేకపోయాడు. దీంతో అతడికి విమానంలో ఆక్సిజన్‌ అందించారు. లండన్‌లో దిగిన వెంటనే పైలట్‌కు వైద్య చికిత్స అందించారు.

Advertisement

ముగ్గురు పైలట్లు అస్వస్థత- మరో ఇద్దరు పైలట్లు అస్వస్థత గురైనప్పటికీ విమానాన్ని సురక్షితంగా గమ్య స్థానానికి చేర్చినట్లు ఆ సంస్థ వర్గాలు చెబుతున్నాయి. ప్రయాణికుల భద్రతకు ఎలాంటి ముప్పు ఏర్పడలేదని బ్రిటిష్‌ ఎయిర్‌వేస్ సంస్థ క్లారిటీ ఇచ్చింది. ప్రాథమిక సమాచారం మేరకు హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ముగ్గురు పైలట్లు ఆహారం తీసుకున్నారు. బయటి సంస్థ సరఫరా చేసిన వాటర్‌ను బాటిల్‌ తీసుకున్నట్లు సమాచారం.

విచారణ చేపట్టిన బ్రిటిష్ ఎయిర్‌వేస్ సంస్థ- ఆహారం వల్ల ఇబ్బందిపడ్డారా? తాగునీటి వల్ల అస్వస్థతకు గురయ్యారా అనే కోణంలో దర్యాప్తు చేస్తోంది ఆ విమానయాన సంస్థ. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు పైలట్లు ఎయిర్‌ సేఫ్టీ రిపోర్టులు సమర్పించారు. అస్వస్థతకు గల కారణాలను గుర్తించేందుకు నమూనాలను వారి నుంచి సేకరించారు. హైదరాబాద్‌లో ముగ్గురు పైలట్లు బస చేసే హోటల్‌ ఏర్పాట్లను సమీక్షిస్తున్నట్లు వెల్లడించింది.

Advertisement

తెరపైకి కొత్త విషయాలు- ఈ ఘటన ప్రయాణికులు తరచుగా ఆలోచించని ఓ విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. పైలట్లు ఇంటికి దూరంగా చాలా సమయం గడుపుతారు. విమాన ప్రయాణాల మధ్య విరామ సమయంలో హోటళ్లలో బస చేస్తారు. బయట భోజనం చేయడం, ఆ తర్వాత వివిధ నగరాలు, దేశాల గుండా ప్రయాణం చేస్తారు.

ALSO READ: మంచి క్వాలిటీ స్టైలిష్ జీన్స్ కేవలం రూ.200.. దేశంలోనే బడ్జెట్ షాపింగ్ మార్కెట్ ఇదే

విమానాన్ని నడపడమేకాదు, వారి ఆరోగ్యం-శ్రేయస్సు అంతే ముఖ్యం. విమాన ప్రయాణానికి ముందు పైలట్ అనారోగ్యానికి గురైనప్పుడు ఫిట్‌గా లేకుంటే విమానం నడపకుండా చూసేందుకు విమానయాన సంస్థల వద్ద వ్యవస్థలు ఉంటాయి. కానీ విమాన ప్రయాణంలో అనారోగ్యానికి గురికావడం అనేది పూర్తిగా భిన్నమైన పరిస్థితి.

కాక్‌పిట్ సిబ్బందిలో ఒకరి కంటే ఎక్కువ మంది అస్వస్థతకు గురైనప్పుడు ఈ పరిస్థితి మరింత జఠిలమవుతుంది.  అందుకే ఈ ఘటనపై సిబ్బంది హైదరాబాద్‌లో ఏమి జరిగింది? వారు తీసుకున్న ఆహారం ఏంటి?  బస చేసిన వసతి సహా పలు అంశాలను నిశితంగా పరిశీలించే అవకాశం ఉంది.

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×