E-Paper
Advertisement

ఆగస్టు 17 నుంచే భోగాపురం ఎయిర్‌పోర్ట్ సేవలు.. ఏ నగరానికి ఎన్ని ఫ్లైట్స్ అంటే?

ఆగస్టు 17 నుంచే భోగాపురం ఎయిర్‌పోర్ట్ సేవలు.. ఏ నగరానికి ఎన్ని ఫ్లైట్స్ అంటే?
Advertisement

Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రజల సుదీర్ఘ నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడనుంది. ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఘనంగా ప్రారంభించనున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకలు మొదలయ్యేందుకు ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 17 నుంచే ఈ కొత్త ఎయిర్‌పోర్ట్ ప్రయాణికులకు సేవలు అందించేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ప్రముఖ విమానయాన సంస్థ ‘ఎయిరిండియా’ ముందస్తుగా అక్టోబర్ 24 వరకు పనిచేసేలా తన ఫ్లైట్ షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది.

ఆగస్టు 17 నుంచి విమాన సేవలు

Advertisement

ఆగస్టు 17న భోగాపురం ఎయిర్‌పోర్ట్ నుంచి పూర్తిస్థాయిలో విమానాలు నింగికెగరనున్నాయి. ఉత్తరాంధ్ర ప్రాంతంలో పర్యాటకం, వ్యాపార రంగాలను పరుగులు పెట్టించేలా ఈ విమానాశ్రయాన్ని అందుబాటులోకి తెస్తున్నారు. ప్రయాణికుల రద్దీని తట్టుకునేలా ఎయిరిండియా ఆరంభంలోనే కీలక మార్గాల్లో భారీగా సర్వీసులను ప్లాన్ చేసింది.

ఏ నగరానికి ఎన్ని సర్వీసులు?

Advertisement

ప్రయాణికుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ – భోగాపురం మధ్య రోజుకు ఏకంగా 5 సర్వీసులు నడపనున్నారు. విజయవాడ – భోగాపురం మధ్య రాష్ట్ర రాజధాని ప్రాంత అనుసంధానం కోసం రోజుకు 4 సర్వీసులు అందుబాటులో ఉంచనున్నారు. అలాగే బెంగళూరు – భోగాపురం మార్గంలో ప్రతిరోజూ 2 సర్వీసులతో పాటు శుక్రవారం, ఆదివారం మినహా వారంలో మిగిలిన 5 రోజులు మరొక అదనపు సర్వీస్‌ను కూడా నడపడానికి ఏర్పాట్లు చేశారు. ఈ కొత్త షెడ్యూల్ అందుబాటులోకి రావడం వల్ల నిత్యం ప్రయాణించే ఐటీ ఉద్యోగులకు, వ్యాపారులకు ఎంతగానో మేలు చేకూరనుంది.

Also Read: మీ ఓటు ఉందో లేదో డౌటా? ఒక్క మెసేజ్‌తో ఇలా చెక్ చేసుకోండి!

Tags

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×