E-Paper
Advertisement

అమెరికాలో సెటిల్ అవ్వాలంటే.. ఈ 5 రాష్ట్రాలు బెస్ట్.. ఎందుకంటే?

అమెరికాలో సెటిల్ అవ్వాలంటే.. ఈ 5 రాష్ట్రాలు బెస్ట్.. ఎందుకంటే?
Advertisement

2026 America’s Best States to Live: అమెరికాలో ఉద్యోగ అవకాశాలతో పాటు జీవన నాణ్యతకు కూడా ప్రజలు ఇప్పుడు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ముఖ్యంగా కోవిడ్ తర్వాత మంచి వాతావరణం, ఆరోగ్య సేవలు, భద్రత ఉన్న ప్రాంతాలపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో CNBC విడుదల చేసిన మంచి నివాస యోగ్యమైన రాష్ట్రాల జాబితా గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

1.వెర్మాంట్  

వెర్మాంట్ రాష్ట్రం హెల్త్ సర్వీసెస్, పరిశుభ్రమైన గాలి, తక్కువ నేరాలు, ప్రజల హక్కుల పరిరక్షణ లాంటి అంశాల్లో బెస్ట్ ప్లేస్ లో ఉంది. ఈ కారణాల వల్లే వరుసగా ఆరోసారి మొదటి స్థానాన్ని దక్కించుకుంది. అయితే, పిల్లల మెయింటెనెన్స్  ఖర్చులు, నిరాశ్రయుల సమస్యలు కొనసాగుతున్నాయి. అయినప్పటికీ వాటిని తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు కొనసాగిస్తోంది.

2.మైన్

Advertisement

ఈ ఏడాది జాబితాలో మైన్ రెండో స్థానాన్ని సంపాదించింది. అమెరికాలోనే తక్కువ నేరాలు నమోదయ్యే రాష్ట్రాల్లో ఇది ఒకటి. ప్రశాంతమైన వాతావరణం, పరిశుభ్రమైన ప్రకృతి, సమాన హక్కులకు ప్రాధాన్యం ఇవ్వడం దీని ప్రత్యేకత. అయితే ఆరోగ్య రంగంలో ఇంకా కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి.

3.న్యూజెర్సీ

న్యూజెర్సీ ఈసారి మూడో స్థానంలో నిలిచింది. నాణ్యమైన ఆరోగ్య సేవలు, కార్మికులకు మెరుగైన రక్షణ, తక్కువ నేరాలు, ఈ రాష్ట్రాన్ని టాప్ ర్యాంక్‌లో నిలబెట్టాయి. అయితే గాలి నాణ్యత విషయంలో ఇంకా మెరుగుదలకు అవకాశం ఉందని నివేదిక వెల్లడించింది.

4.మిన్నెసోటా

Advertisement

నాలుగో స్థానంలో ఉన్న మిన్నెసోటా మహిళల హక్కులు, సమానత్వం, ఆరోగ్య సేవల్లో మంచి గుర్తింపు పొందింది. అయితే పిల్లల సంరక్షణ ఖర్చులు కొంత ఎక్కువగా ఉండటం ప్రతికూల అంశంగా ఉంది.

5.కనెక్టికట్

ఐదో స్థానంలో ఉన్న కనెక్టికట్ తక్కువ నేరాలు, ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ కారణంగా మంచి ర్యాంక్ సాధించింది. కానీ గాలి కాలుష్యం అక్కడి ప్రధాన సమస్యల్లో ఒకటిగా ఉంది.

టాప్-10లో చోటు దక్కించుకున్న రాష్ట్రాలు

ఈ ఏడాది జాబితాలో హవాయి, న్యూ హాంప్‌షైర్, వర్జీనియా, నార్త్ డకోటా, మసాచుసెట్స్, నెబ్రాస్కా కూడా టాప్-10లో నిలిచాయి. హవాయి  పరిశుభ్రమైన వాతావరణానికి ప్రసిద్ధి కాగా, న్యూ హాంప్‌షైర్ తక్కువ క్రైమ్ రేట్ ను కలిగి ఉంది.  వర్జీనియాకు భద్రతలో మంచి రికార్డు ఉంది. నార్త్ డకోటా పిల్లల సంరక్షణ సదుపాయాల్లో ముందంజలో ఉంది. మసాచుసెట్స్ అత్యుత్తమ ఆరోగ్య సేవలు అందిస్తోంది. నెబ్రాస్కా స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన జీవనంలో ముందుంది.

ఉద్యోగాలతో పాటు జీవన విధానం కూడా ముఖ్యం!

ప్రస్తుతం చాలామంది ఉద్యోగం మాత్రమే కాకుండా, కుటుంబంతో సురక్షితంగా జీవించే వాతావరణాన్ని కూడా కోరుకుంటున్నారు. అలాంటి వారు మంచి హెల్త్ సర్వీసులు, పరిశుభ్రమైన వాతావరణం, భద్రత కలిగిన రాష్ట్రాలను ఎంచుకుంటున్నారు.

Read Also: 10 వేల ఏళ్ల చరిత్రను కళ్లకు కట్టే ప్రయాణం.. జీవితంలో ఒక్కసారైనా ఈ సోలార్ రైలు ఎక్కాల్సిందే!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×