E-Paper
Advertisement

లావాతో పుట్టిన రంగుల గుహలు.. అక్కడ అడుగుపెడితే ప్రపంచాన్ని మర్చిపోతారు!

లావాతో పుట్టిన రంగుల గుహలు.. అక్కడ అడుగుపెడితే ప్రపంచాన్ని మర్చిపోతారు!
Advertisement

Chandampet Aquamarine Colored Cave: తెలంగాణ అంటే కేవలం చారిత్రక కోటలు, దేవాలయాలు మాత్రమే కాదు.  ప్రకృతి ఒడిలో దాగి ఉన్న ఎన్నో అద్భుతాల నిలయం కూడా. ఎత్తైన కొండలు, పచ్చని అడవులు, అందమైన జలపాతాలతో పాటు అరుదైన గుహలు కూడా ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి నల్లగొండ జిల్లా చందంపేట మండలంలో ఉన్న గాజుబేడం గుహ. ప్రకృతి స్వయంగా రంగులతో అలంకరించిన ఈ గుహ పర్యాటకులను ఆశ్చర్యపరుస్తుంది.

చందంపేటలో అరుదైన గుహ

కాచరాజుపల్లి సమీప అటవీ ప్రాంతంలో ఈ గాజుబేడం గుహ ఉంది. దీనిని మునుల గుహ లేదంటే భావోజి గుహ అని కూడా పిలుస్తారు. ప్రపంచంలో చాలా కొద్ది ప్రాంతాల్లో మాత్రమే కనిపించే ప్రత్యేక లక్షణాలు ఈ గుహలో ఉన్నాయని పరిశోధకులు చెప్తుంటారు. గుహలోకి అడుగుపెట్టగానే చల్లని వాతావరణం, విశాలమైన మార్గాలు సందర్శకులను ఆకట్టుకుంటాయి. ఈ గుహలోని ప్రధాన ప్రత్యేకత దాని గోడలే. ఎక్కువ భాగం నీలి ఆకుపచ్చ రంగులో మెరుస్తూ కనిపిస్తుంది. కొన్ని చోట్ల ఎరుపు, మరికొన్ని చోట్ల ఆరెంజ్ కలర్ ఛాయలు కూడా కనిపిస్తాయి. గుహ అంతర్భాగంలో సొరంగాలు, చిన్న చిన్న గదులు, అంతస్తుల్లా కనిపించే రాతి నిర్మాణాలు ప్రకృతి సృష్టించిన అద్భుత కళాఖండాల్లా ఉంటాయి.

ఈ గుహలు ఎలా ఏర్పడ్డాయంటే? 

Advertisement

భూగర్భంలో ఒకప్పుడు జరిగిన అగ్నిపర్వత విస్పోటనం వల్ల లావా ప్రవాహం ఏర్పడింది. అందులోని ఖనిజాలు చల్లబడుతూ ఈ గుహలు రూపుదిద్దుకున్నాయని నిపుణులు భావిస్తున్నారు. లావాలో కలిసిన వివిధ రకాల ఖనిజాల ప్రభావంతోనే గుహ గోడలకు ఈ రంగులు వచ్చినట్లు భావిస్తున్నారు. అందుకే ఈ గుహలు సాధారణ రాతి గుహల కంటే పూర్తిగా భిన్నంగా కనిపిస్తాయి. ఈ గుహలోని రాళ్లలో విలువైన ఖనిజాలు ఉండే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. శాస్త్రీయంగా పరిశీలిస్తే కొత్త విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం ప్రత్యేకంగా అధ్యయనం నిర్వహిస్తే ఈ ప్రాంత భౌగోళిక విశేషాలు ప్రపంచానికి తెలిసే అవకాశం ఉంది.

పర్యాటక కేంద్రంగా మారే అవకాశం

గాజుబేడం గుహలకు సరైన రహదారులు, భద్రతా ఏర్పాట్లు లేవు. చక్కటి పర్యాటక సౌకర్యాలు కల్పిస్తే తెలంగాణలో ప్రముఖ టూరిస్ట్ స్పాట్‌గా ఎదిగే అవకాశాలు ఉన్నాయి. గుహలోని మరిన్ని మార్గాలను పరిశోధిస్తే చారిత్రక, భౌగోళిక విశేషాలు బయటపడే అవకాశం కూడా ఉందని భావిస్తున్నారు.

చుట్టుపక్కల చూడదగ్గ ప్రాంతాలు

Advertisement

చందంపేట మండలంలో గుహలతో పాటు ఎన్నో ఆధ్యాత్మిక, ప్రకృతి అందాలు ఉన్నాయి. దేవరచర్లలోని పురాతన శివాలయం, మునిస్వామి గుట్ట, అక్కడి జలపాతం, ఏలేశ్వరంలోని మల్లయ్యస్వామి ఆలయం భక్తులను ఆకర్షిస్తాయి. అలాగే కృష్ణానదిలో బోటు ప్రయాణం చేస్తే కొండల మధ్య ప్రవహించే అందమైన దృశ్యాలు పాపికొండలను గుర్తుకు తెస్తాయి. ఏది ఏమైనప్పటికీ, పెద్దగా ప్రచారం పొందని చందంపేట గాజుబేడం గుహలు తెలంగాణలోని అరుదైన ప్రకృతి అద్భుతాల్లో ఒకటిగా నిలుస్తున్నాయి. సరైన అభివృద్ధి చేస్తే, ఈ ప్రాంతం దేశవ్యాప్తంగా గుర్తింపు పొందే పర్యాటక కేంద్రంగా మారే అవకాశం ఉంది.

నోట్: ఫొటోను ఏఐతో రిక్రియేట్ చేశాం. గమనించగలరు.

Read Also: నల్లగొండ జిల్లాలో దాగిన ఉన్న అద్భుతాలు.. ఒక్కో చోట ఒక్కో విశేషం!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×