E-Paper
Advertisement

Interesting Facts: పైలట్లు రొయ్యలు, పీతలు ఎందుకు తినరు? వారి క్యాప్‌ లో ఫొటోలు ఎందుకు పెట్టుకుంటారు?

Interesting Facts: పైలట్లు రొయ్యలు, పీతలు ఎందుకు తినరు? వారి క్యాప్‌ లో ఫొటోలు ఎందుకు పెట్టుకుంటారు?
Advertisement

Interesting Facts About Airplane Pilots: ప్రపంచ వ్యాప్తంగా విమాన పైలెట్లకు మంచి క్రేజ్ ఉంది. మంచి సాలరీ, సమాజంలో మంచి గౌరవం ఉంటుంది. అయితే, వీళ్లకు సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోవడం పక్కా. వాటిలో కొన్ని విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ పైలట్లు ఒకే ఫుడ్ తినరు!  

పైలట్లు, కో పైలట్లు విమానంలో ప్రయాణించేటప్పుడు ఒకే ఫుడ్ తీసుకోరు. విమానయాన సంస్థలలో ఇది కఠినమైన భద్రతా నియమం. ఒక పైలట్‌ కు ఫుడ్ పాయిజనింగ్ వస్తే, మరొకరు ఆరోగ్యంగా ఉంటారు. విమానాన్ని సురక్షితంగా నడపగలరు. ఫుడ్ పాయిజనింగ్ వల్ల వాంతులు, కడుపు నొప్పి, విరేచనాలు రావచ్చు. గాలిలో ప్రమాదకరమైన పరిస్థితిని ఏర్పడవచ్చు.   అందుకే, విమానయాన సంస్థలు విమాన ప్రయాణానికి ముందు పైలట్లను వేర్వేరు ఫుడ్ తినాలని సూచిస్తారు.

⦿ పైలట్లు రొయ్యలు, పీతలకు దూరం

Advertisement

పైలట్లు రొయ్యలు, పీతలు, ఎండ్రకాయల లాంటి షెల్ఫిష్‌ లను తినరు. ఈ ఫుడ్ సులభంగా ఫుడ్ పాయిజన్ కు కారణం అవుతుంది. షెల్ఫిష్ త్వరగా చెడిపోతుంది. సరిగ్గా ఉడికించకపోతే హానికరమైన బ్యాక్టీరియా ఈజీగా పెరుగుతుంది. పైలట్ చెడు షెల్ఫిష్ తింటే, వాంతులు, కడుపు నొప్పి, విరేచనాలు అవుతాయి. విమాన ప్రయాణ సమయంలో ఇబ్బంది ఏర్పడుతుంది. అందుకే పైలెట్లు విమాన ప్రయాణ సమయంలో ఈ ఫుడ్ తీసుకోకూడదనే నియమం ఉంది.

⦿ కెప్టెన్, కో పైలట్ కోసం ప్రత్యేక రూల్స్   

కెప్టెన్ విమానానికి యజమాని లాంటివాడు. ప్రయాణ సమయంలో ఏ నిర్ణయం అయినా తనే ఫైనల్ చేయాల్సి ఉంటుంది. ఎవరైనా ప్రయాణీకుడు ఇబ్బంది కలిగిస్తే అరెస్ట్ చేయించడంతో పాటు జరిమానా విధించే అధికారం ఉంటుంది. ప్రయాణీకుడు అనారోగ్యంతో మరణించే పరిస్థితి వస్తే, వీలునామా రాసే అవకాశం ఉంటుంది.  ప్రతి 6 నుంచి 12 నెలలకు ఫ్లైట్ సిమ్యులేటర్లలో ట్రైనింగ్ కోసం వెళ్లాల్సి ఉంటుంది. ఇంజిన్ ఫెయిల్యూర్, అగ్నిప్రమాదం, బ్యాడ్ వెదర్ లాంటి సమయంలో అనుసరించాల్సిన వ్యూహాలపై శిక్షణ తీసుకుంటారు. పైలట్ క్యాప్‌ ధరించి ఫొటోలు దిగడం అనేది వృత్తిపరమైన గుర్తింపుతో పాటు ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుంది. ఏవియేషన్ రంగానికి చెందిన ప్రత్యేక శైలిని ప్రదర్శించడానికి ఉపయోగపడుతుంది. .

⦿ విమానాలలో ఆటోపైలట్ గురించి..

Advertisement

ఆటో పైలట్ అనేది విమానాన్ని ఆటో మేటిక్ గా నడిపే స్మార్ట్ కంప్యూటర్ సిస్టమ్. ఇది విమానం  దిశ, ఎత్తు, వేగం, మార్గాన్ని నియంత్రిస్తుంది. ఆటో పైలట్ విమానాన్ని నేరుగా, స్థిరమైన ఎత్తులో ఎగిరేలా చేస్తుంది. ఆధునిక ఆటో పైలట్ ఫీచర్లు అధునాతనమైనవి. ఈ ఫీచర్ దాదాపు మొత్తం విమానాన్ని నడిపిస్తుంది. టేకాఫ్ తర్వాత పైకి వెళ్లడం, ఎక్కువ ఎత్తులో ప్రయాణించడం, సరైన రూట్ లో వెళ్లడం, బ్యాడ్ వెదర్, తక్కువ విజుబులిటీలో ఆటోమేటిక్ గా ల్యాండింగ్ కూడా చేస్తుంది. సుమారు 8–15 గంటల సుదూర విమానాలలో, ఆటోపైలట్ దాదాపు 90 శాతం నడిపిస్తుంది. టేకాఫ్ తర్వాత విమానం సురక్షితమైన ఎత్తుకు చేరుకున్నప్పుడు పైలట్లు సాధారణంగా ఆటో పైలెట్ ఆన్ చేస్తారు. ల్యాండింగ్‌కు ముందు దానిని ఆపివేస్తారు.

⦿ భారత్ లో అత్యధిక సంఖ్యలో మహిళా పైలట్లు  

భారత్ లో ప్రపంచంలోనే అత్యధిక శాతం మహిళా పైలట్లు ఉన్నారు. అన్ని ఇండియన్ ఎయిర్‌ లైన్ పైలట్లలో దాదాపు 12–15% మంది మహిళలు. ఇది ప్రపంచ సగటు 3–6 శాతం.  ఎయిర్ ఇండియా వంటి విమానయాన సంస్థల్లో 225 కంటే ఎక్కువ మంది మహిళా పైలట్లు పని చేస్తున్నారు.  ఎయిర్ ఇండియా 1990 నుంచే మహిళా పైలట్లను నియమించుకోవడం ప్రారంభించింది.

⦿ యువ భారతీయ పైలట్లు

సమైరా హుల్లూర్ కేవలం 18 సంవత్సరాల వయసులో పైలట్ గా బాధ్యతలు చేపట్టారు. దేశంలో అతి పిన్న వయస్కురాలైన కమర్షియల్ పైలెట్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. భారత్ లో ప్రస్తుతం పైలట్లకు మంచి డిమాండ్ ఉంది. దేశంలో ఇప్పటికే 12,000 మంది వాణిజ్య పైలట్లు ఉన్నప్పటికీ, పైలట్ల కొరత ఉంది. పైలట్ కావడానికి శిక్షణకు రూ. 40 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు ఖర్చవుతుంది. ఇండియాలో కెప్టెన్ వివేక్ చౌదరి ఓ ప్రత్యేకమైన పైలెట్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన విమానాలతో పాటు జలాంతర్గాములను నడపడానికి శిక్షణ తీసుకున్నాడు.

Read Also: తక్కువ ఖర్చుతో విమాన ప్రయాణం.. సింపుల్ గా టికెట్లు ఇలా బుక్ చేసుకోండి!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×