E-Paper
Advertisement

నల్లగొండ జిల్లాలో ఇంత అందమైన జలపాతం ఉందా? వర్షాకాలంలో ఒక్కసారైనా వెళ్లాల్సిందే!

నల్లగొండ జిల్లాలో ఇంత అందమైన జలపాతం ఉందా? వర్షాకాలంలో ఒక్కసారైనా వెళ్లాల్సిందే!
Advertisement

Ajilapuram Bugga Waterfall Nalgonda: వర్షాకాలం వచ్చిందంటే ప్రకృతి ప్రేమికులు కొత్త కొత్త ప్రదేశాల కోసం వెతుకుతుంటారు. అయితే, తెలంగాణలోని నల్లగొండ జిల్లా ఒక అద్భుతమైన జలపాతం ఉందని చాలా మందికి తెలియదు. ప్రకృతి అందాన్ని తనలో నింపుకున్న ఈ జలపాతం హైదరాబాద్ కు సమీపంలోనే ఉంటుంది. అదే మర్రిగూడ మండలం అజిలాపురం గ్రామం సమీపంలోని బుగ్గ జలపాతం. వర్షాకాలంలో  ఒకసారి ఈ ప్రాంతాన్ని చూస్తే మళ్లీ మళ్లీ వెళ్లాలనిపించేంత అందంగా ఉంటుంది.

‘బాహుబలి’ జలపాతం మాదిరిగానే..

ఎత్తైన కొండలపై నుంచి తెల్లని నీటి ధారలు కిందకు జాలువారుతూ చిన్న జలపాతాలుగా విడిపోతుంది. చుట్టూ పచ్చని అడవులు, చల్లని గాలి, పక్షుల కిలకిలరావాలు కలిసి ఈ ప్రాంతాన్ని ప్రకృతి ప్రేమికులకు ఓ స్వర్గంలా మార్చేస్తాయి. ముఖ్యంగా వర్షాలు బాగా కురిసే రోజుల్లో ఈ జలపాతం మరింత అందంగా కనిపిస్తుంది. అజిలాపురం గ్రామ శివారులో దాదాపు 2,500 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అడవుల్లో ఈ జలపాతం పరవళ్లుతొక్కుతుంది. వర్షపు నీరు కొండచరియలపై నుంచి వేగంగా కిందకు దూకుతూ అద్భుతంగా కనువిందు చేస్తుంది. వర్షాలు బాగా కురిస్తే, దాదాపు ఆరు నెలల పాటు ఈ జలపాతం ప్రవహిస్తూ సందర్శకులను ఆకట్టుకుంటుంది.

వీకెండ్ లో పర్యాటకుల సందడి..

Advertisement

ప్రస్తుతం ఈ ప్రదేశం గురించి తెలిసిన వాళ్లు కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఇక్కడికి వస్తున్నారు. జలపాతం దగ్గర  సేదతీరడం, నీటిలో ఆడుకోవడం, ప్రకృతి మధ్య కాసేపు గడుపుతారు.  చాలామంది ఇక్కడే వంట చేసుకుని రోజంతా ప్రకృతి ఒడిలో గడిపి సాయంత్రం తిరుగు ప్రయాణం అవుతున్నారు.

2 కిలో మీటర్ల మేర కాలి నడక

బుగ్గ జలపాతానికి చేరుకోవడం కూడా మంచి ఎక్స్ పీరియెన్స్ ను అందిస్తుంది.  వాహనాలను బుగ్గ లక్ష్మీనరసింహస్వామి ఆలయం దగ్గర పార్క్ చేసి అక్కడి నుంచి సుమారు రెండు కిలోమీటర్లు కాలినడకన వెళ్లాలి. ఈ మార్గం మొత్తం పచ్చని చెట్లు, చిన్న కొండలు, సహజసిద్ధమైన వాతావరణంతో నిండి ఉంటుంది. నడుస్తున్నంతసేపూ ప్రకృతి అందాలు మనసును హాయిగా మారుస్తాయి. ఆ తర్వాత జలపాతాన్ని చూసి పర్యాటకులు మైమరచిపోతారు. జలపాతం కింద తడుస్తూ ఎంజాయ్ చేస్తారు.

బుగ్గ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

Advertisement

జలపాతం సమీపంలో ఉన్న బుగ్గ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఈ ప్రాంతానికి మరో ప్రత్యేక ఆకర్షణ. చాలామంది భక్తులు ముందుగా ఆలయంలో దర్శనం చేసుకుని, ఆ తర్వాత జలపాతాన్ని సందర్శిస్తుంటారు.  ఒకే ప్రయాణంలో ఆధ్యాత్మికతతో పాటు ప్రకృతి అందాలను కూడా ఆస్వాదించే అవకాశం లభిస్తుంది. అయితే, ఇంత అందమైన ప్రదేశంలో పర్యాటకులకు అవసరమైన సౌకర్యాలు ఇంకా పూర్తిస్థాయిలో లేవని స్థానికులు చెబుతున్నారు. ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని అధికారిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తే మరింత మంది సందర్శకులు వస్తారని, స్థానికులకు కూడా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మీరు కూడా ఈ వర్షాకాలంలో కొత్త ప్రదేశాన్ని సందర్శించాలని అనుకుంటే, నల్లగొండ జిల్లాలోని అజిలాపురం బుగ్గ జలపాతాన్ని అస్సలు మిస్ అవ్వకండి. ప్రకృతి అందాలు, ప్రశాంతమైన వాతావరణం, జలపాతం అందించే అనుభూతి…జీవితాంతం గుర్తుండిపోయేలా చేస్తాయి.

Read Also: మాన్సూన్ ట్రిప్‌ కు బెస్ట్ ఛాయిస్.. తెలంగాణలో ఈ 8 ప్లేస్‌లు మిస్ కావొద్దు!

Tags

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×