E-Paper
Advertisement

Air India Shock: ఉచిత టికెట్లు ఇష్యూ.. షాకైన ఎయిరిండియా, ఆ ఉద్యోగులపై చర్యలు

Air India Shock: ఉచిత టికెట్లు ఇష్యూ.. షాకైన ఎయిరిండియా, ఆ ఉద్యోగులపై చర్యలు
Advertisement

Air India Shock: ఉచిత టికెట్ల ప్రయోజనాలను దుర్వినియోగం చేసినందుకు వేలాది మంది ఉద్యోగులపై చర్యలు సిద్ధమైంది ఎయిర్ ఇండియా. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై జరిమానాలు విధించడం ప్రారంభించింది. ఈ అక్రమాలలో దాదాపు 4 వేల మంది ఉద్యోగుల ప్రమేయమున్నట్లు తెలుస్తోంది.

ఎయిరిండియాకు షాకిచ్చిన ఆ సంస్థ ఉద్యోగులు

Advertisement

వివిధ సంస్థలు తల్లిదండ్రులు, జీవిత భాగస్వామిని విమానాల్లో తీసుకెళ్లేందుకు తమ సిబ్బందికి ఏటా ఉచితంగా కొన్ని టికెట్లు జారీ చేస్తుంది. ఎయిరిండియా కూడా అలాగే చేసింది. ఎంప్లాయిస్ లీజర్‌ ట్రావెల్‌ కింద ప్రతి సిబ్బంది ఏడాదికి దాదాపు 14 టికెట్ల వరకు పొందవచ్చు. ఎయిరిండియాలో 24 వేల మంది ఉద్యోగులు ఉన్నారు.

4 వేల మంది సిబ్బంది ఆయా టికెట్లను దుర్వినియోగం చేసినట్టు గుర్తించింది. సంబంధం లేని వారిని కుటుంబ సభ్యులుగా చూపించి ఉచిత టికెట్లపై విమానాల్లో తీసుకెళ్లినట్టు తేలింది. అంతేకాదు ఉచిత టికెట్లను వేరే వ్యక్తులకు అధిక ధరకు విక్రయించినట్టు తేలింది. ఈ విషయం తెలిసి ఎయిరిండియా సంస్థ షాకైంది.

Advertisement

ఏకంగా 4 వేల మంది.. ఉచిత టికెట్లపై రకరకాల మోసాలు

ఒక విధంగా చెప్పాలంటే ఉన్న సంస్థకు కన్నం పెట్టారు ఉద్యోగులు. టికెట్ల దుర్వినియోగం చేసిన సిబ్బందిపై చర్యలు చేపట్టింది ఎయిరిండియా. మోసపూరితంగా ప్రయోజనాలు పొందినవారి నుంచి సొమ్ము తిరిగి రాబడుతోంది. కొందరిపై జరిమానా విధించేందుకు సిద్ధమైనట్టు ఆ సంస్థ వర్గాలు తెలిపాయి. టాటా గ్రూప్‌ స్వాధీనం చేసుకున్న తర్వాత చేరిన సిబ్బంది ఇలాంటి మోసాలకు అధికంగా పాల్పడినట్టు గుర్తించారు.

ఈ నేపథ్యంలో ఈఎల్‌టీ నిబంధనలను పటిష్ఠం చేసింది. సవరించిన విధానం మేరకు సిబ్బంది తమ నామినీల వివరాలతోపాటు వారి కుటుంబసభ్యుల రుజువు సమర్పించాలి. ఎయిర్ ఇండియా ఉద్యోగులు ఒక ఆర్థిక సంవత్సరంలో 14 మందికి తిరుగు ప్రయాణ విమాన టిక్కెట్లకు అర్హులు.

టికెట్లు అమ్ముకున్న నిధులను తిరిగి చెల్లించాలని ఎయిర్ ఇండియా సంబంధిత సిబ్బందిని ఆదేశించింది. అంతేకాదు భవిష్యత్తులో ఉల్లంఘనలకు పాల్పడితే సస్పెన్షన్ లేదా తొలగించాలని ఆలోచన చేస్తోంది. నిజాయితీ గల ఉద్యోగులకు ప్రయోజనాన్ని కాపాడటమే సంస్థ నిర్వహణ కొనసాగుతోంది. యాజమాన్యం తీసుకున్న నిర్ణయాలపై ఆ సంస్థ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

ALSO READ: వందేభారత్ స్లీపర్ లో ఫ్లైట్ రేంజ్ ఫుడ్ సర్వీస్, ప్యాసింజర్స్ ఫిదా!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×