E-Paper
Advertisement

విమాన సంస్థపై ఆ ట్రావెలర్ ఆగ్రహం.. 5 వేలు ఇచ్చినందుకా? అసలేం జరిగింది?

విమాన సంస్థపై ఆ ట్రావెలర్ ఆగ్రహం.. 5 వేలు ఇచ్చినందుకా? అసలేం జరిగింది?
Advertisement

Air Traveler: విమానయాన ప్రయాణికుల సామాన్ల గురించి రకరకాల వార్తలు వెలుగులోకి వచ్చాయి. వీడియోతోపాటు చాలా ఘటనలు బయటపడ్డాయి. తాజాగా అలాంటి ఘటన ఒకటి ఎయిరిండియాకు చెందిన ఓ విమానంలో చోటు చేసుకుంది. సదరు ట్రావెలర్ సామాను డ్యామేజ్‌కు కొంత పరిహారం ఇచ్చింది. అయితే తక్కువ పరిహారం ఇచ్చినందుకు ఆగ్రహం వ్యక్తం చేశాడు ఆ ట్రావెలర్.

ఎయిరిండియా విమాన సంస్థపై ఓ ట్రావెలర్ ఆగ్రహం-ఈనెల 20న ఓ ట్రావెలర్ గోవా నుంచి ముంబైకి ఎయిరిండియా విమానంలో ప్రయాణం చేశాడు. చెక్-ఇన్‌కు ముందు ఆ ట్రైపాడ్ ఇదివరకే ఒకసారి దెబ్బతిందని, అది అద్దెకు తీసుకొచ్చినట్టు గ్రౌండ్‌ స్టాఫ్‌కు తెలియజేశాడు. ముంబైలో దిగిన తర్వాత ఆ ప్రయాణికుడికి చెందిన ట్రైపాడ్ దెబ్బతింది. దీనిపై ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఎయిర్ ఇండియా సర్వీస్ డెస్క్‌ను సంప్రదించాడు. అతడు నష్టపరిహారం అందుతుందని భావించాడు.

Advertisement

తన వస్తువు డ్యామేజ్ చేశారని ఆగ్రహం-దాదాపు మూడు గంటలపాటు అక్కడే వెయిట్ చేశాడు. మార్కెట్లో ట్రైపాడ్ విలువ రూ. 55 వేలు ఉందని చెప్పాడు. చివరకు ఎయిరిండియా విభాగం రూ. 5 వేలు చెల్లించింది. చివరకు అమర్యాదకరమైన, నిర్లక్ష్య పూరితంగా పంపారన్నది సదరు ట్రావెలర్ వాదన. తనను దిగ్భ్రాంతికి గురి చేసిన విషయం చెప్పాడు. సామానును విమానంలో విసిరేస్తున్నట్లు చూపించే వీడియో తన దగ్గర ఉందని చెప్పాడు. నేను దాన్ని కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్‌ల్లో ఒకరికి చూపించానని, సామానును  అలాగే లోడ్ చేస్తారని అన్నట్లు తెలిపాడు.

అందుకే షేర్ చేశా-ట్రైపాడ్ తనది కాదని, అది వేరొకరిదని, తాను బాధ్యత వహించాల్సి ఉంటుందన్నాడు. ఎయిరిండియా సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా తాను భారీ ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటున్నట్లు వివరించారు. బాధితుడు ఎవరో కాదు అతడు ఫ్రీలాన్స్ ఫిల్మ్‌మేకర్. సమీర్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఆయా విషయాలను షేర్ చేశాడు. తన అనుభవాన్ని వివరిస్తూనే చిత్రీకరించిన వీడియోలు, ఫోటోలు బయటపెట్టాడు. ఏ ప్రయాణీకుడికి  ఇలాంటి పరిస్థితిని రాకూడదన్న ఉద్దేశ్యంతో వీటిని పంచుకున్నట్లు వివరించాడు.

Advertisement

ప్రయాణికులు తమ వస్తువులను విమానయాన సంస్థపై నమ్మకంతో అప్పగించినప్పుడు వాటిని జాగ్రత్తగా అప్పగించాలన్నారు. ఈ విషయంలో తదుపరి సహాయం అందించడానికి తన పీఎన్ఆర్ వివరాలను పంచుకోవాలని విమానయాన సంస్థ సమీర్‌ను కోరినట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి వాస్తవ నష్టానికి అంచనా వేసి తగిన పరిహారాన్ని అందిస్తాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నాడు. ప్రయాణికుడు చేసిన పోస్టుపై రకరకాల ప్రశ్నలు రైజ్ చేస్తున్నారు నెటిజన్స్.

ALSO READ: నల్లగొండలో వైజాగ్ కాలనీ కనువిందు.. సాగర్ బ్యాక్‌ వాటర్స్ నేచర్ మ్యాజిక్ చూసొద్దాం రండి!

 

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×