E-Paper
Advertisement

Air India: గాల్లో ఉండగా.. ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో సాంకేతిక లోపం, 155 మంది ప్రయాణికులు సురక్షితం!

Air India: గాల్లో ఉండగా.. ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో సాంకేతిక లోపం, 155 మంది ప్రయాణికులు సురక్షితం!
Advertisement

ఎయిర్ ఇండియా విమానాల్లో వెళ్లాలంటేనే ప్రయాణీకులు భయపడే పరిస్థితి తలెత్తింది. అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత ఆ సంస్థకు చెందిన విమానాల్లో వెళ్లేందుకు జంకుతున్నారు. తాజాగా ముంబై నుంచి పాట్నాకు ఎయిర్ ఇండియా విమానంలో వెళ్లే ప్రయాణీకులు కూడా భయంతో వణికిపోయారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాక ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నారు. ఈ ఘటన మంగళవారం నాడు జరగగా.. తాజాగా వెలుగులోకి వచ్చింది.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే.

ముంబై నుంచి పాట్నాకు  వెళ్లేందుకు ఎయిర్ ఇండియా విమానం బయల్దేరింది. గాల్లోకి ఎగిరిన కాసేపటి తర్వాత కాక్‌ పిట్‌ కు గాలిలో ఆక్సిజన్ అకస్మాత్తుగా తగ్గుముఖం పడుతున్నట్లు పైలెట్లకు హెచ్చరికలు అందాయి. వెంటనే అలర్ట్ అయిన పైలెట్లు విమానాన్ని వెనక్కి తిప్పారు. ఈ విషయం ప్రయాణీకులకు తెలియడంతో భయంతో వణికిపోయారు. ఏం జరుగుతుందో తెలియక అయోమయానికి గురయ్యారు. కానీ, ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముంబైకి తిరిగి వచ్చింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సేఫ్ గా ల్యాండ్ అయ్యింది. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు.

పైలెట్లకు అత్యంత ప్రమాదకరం

Advertisement

విమానం ఎప్పుడూ పైలట్లకు తగినంత ఆక్సిజన్‌ ను తీసుకెళ్లాల్సి ఉంటుంది. ముఖ్యంగా అధిక ఎత్తులో ఎగురుతున్నప్పుడు వారికి ఆక్సీన్ అవసరం ఎక్కువగా ఉంటుంది. అయితే, తాజాగా విమానం బయల్దేరిన కాసేపటికే ఆక్సీన్ పీడనం ఒక్కసారిగా పడిపోవడంతో పైలెట్లు షాకయ్యారు. ఆక్సిజన్ బాటిల్‌ లో లీక్, రెగ్యులేటర్, వాల్వ్‌ లో సమస్య, ఆక్సిజన్‌ తీసుకెళ్లే పైపుల లీక్, ప్రెషర్ మీటర్ పని చేయకపోవడం లాంటి సమస్యలో ఏదో ఒక కారణంగా ఈ ఘటన జరిగినట్లు పైలెట్లు భావించారు.

Read Also: పర్యాటకులకు విమానాల్లో ప్రయాణం ఉచితం.. థాయ్‌లాండ్ అదిరిపోయే ఆఫర్!

Advertisement

ఆపరేటింగ్ రూల్స్ ను అనుసరించి ఫ్లైట్ కెప్టెన్ వెంటనే ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమాచారం అందించారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సూచనలు అనుగుణంగా వెంటనే విమానాన్ని వెనక్కి మలిపాడు.  మధ్యాహ్నం 12:30 గంటలకు సురక్షితంగా ల్యాండ్ అయింది. అయితే, ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి హాని జరగలేదని ఎయిర్ ఇండియా ప్రకటించింది. బిజినెస్ క్లాస్‌ లో 8 మంది, ప్రీమియం ఎకానమీలో 22 మంది, ఎకానమీలో 125 మంది సహా విమానంలో ఉన్న 155 మంది సురక్షితంగా ఉన్నారని తెలిపింది.

తనిఖీలు నిర్వహించిన ఇంజినీర్లు

విమానం ల్యాండ్ అయిన వెంటనే ఎయిర్ ఇండియా ఇంజనీరింగ్ బృందాలు  తనిఖీ నిర్వహించాయి. ఆక్సిజన్ పీడనం తగ్గడానికి గల కచ్చితమైన కారణాలను తెలుసునే ప్రయత్నం చేశారు. ప్రయాణీకులకు ప్రోటోకాల్ ప్రకారం వసతి కల్పించారు. పాట్నాకు ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు చేశారు. త్వరలోనే ఈ ఘటనకు గల కారణాలపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు విమానయాన అధికారులు ప్రకటించారు.

Read Also: బెంగళూరులో మరో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, అందుబాటులోకి వచ్చేది ఎప్పుడంటే?

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×