E-Paper
Advertisement

Flight Charges: ఇరాన్ యుద్ధం ప్రభావం.. విమాన టికెట్లపై ధరల పెంపు, షాకైన ట్రావెలర్స్

Flight Charges: ఇరాన్ యుద్ధం ప్రభావం.. విమాన టికెట్లపై ధరల పెంపు, షాకైన ట్రావెలర్స్
Advertisement

Flight Charges: మధ్యప్రాచ్యంలో ఇరాన్ పై అమెరికా-ఇజ్రాయెల్ మెరుపుదాడుల ప్రభావం క్రమంలో అన్ని రంగాలకు విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో ఇంధన ధరలు బాగా పెరగడంతో దేశీయ విమాన సంస్థలు ఆలోచనలో పడ్డాయి. ఫలితంగా ఇంధన సర్‌ఛార్జ్ విధించాలని కొన్ని సంస్థలు రెడీ అయ్యాయి. దీంతో పలు విమాన సంస్థల టికెట్ల ధరలకు రెక్కలు వచ్చాయి.

విమాన టికెట్లపై ధరల పెంపు, షాకైన ట్రావెలర్స్

Advertisement

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధ మరింత తీవ్రమైంది. వారంలోపు పూర్తి చేయాలని తొలుత అమెరికా-ఇజ్రాయెల్ దేశాలు భావించాయి. ఇరాన్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురుకావడంతో ఆలోచనలో పడ్డాయి. తొందరగా యుద్ధం ముగిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెబుతున్నా, పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. యుద్ధం ప్రభావం క్రమంగా అన్ని రంగాలపై ప్రభావం చూపుతోంది.

దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా టికెట్ల ఛార్జీలను పెంచాలని డిసైడ్ అయ్యింది.  ఇంధన కొరత నేపథ్యంలో దేశీయ విమాన టికెట్లపై సర్‌‌ఛార్జ్ విధించనుంది. పెంచిన ధరలు మార్చి 12 నుంచి అమల్లోకి రానున్నాయి. రెండు కంపెనీలు జారీ చేసే టికెట్లపై రూ. 399 ఇంధన సర్‌ఛార్జ్ విధిస్తామని ఓ ప్రకటనలో తెలిపింది.

Advertisement

ఎయిరిండియా బాటలో మరికొన్ని విమాన సంస్థలు

ఇంధన ధరలు భారీగా పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చింది. కొత్త ఇంధన సర్‌ఛార్జ్‌లను దశల వారీగా అమలు చేయాలని భావిస్తున్నాయి. తొలి దశలో అంటే మార్చి 12 నుంచి దేశీయ విమాన టికెట్‌కు రూ. 399 ఇంధన సర్‌ఛార్జ్ ఉండనుంది. సార్క్ దేశాల విమానాలకు వర్తించనుందని విమాన కంపెనీలు తెలిపాయి.

ఇక పశ్చిమాసియా విమానాలకు ఇంధన సర్‌ఛార్జ్ 10 డాలర్లు పెంచాలని భావించాయి. ఆఫ్రికా విమానాలకు 30 నుంచి 90 డాలర్ల వరకు ఛార్జీలు పెరగనున్నాయి. ఆగ్నేయాసియా సేవలకు 20 నుంచి 60 డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ మార్పులన్నీ మార్చి 12 నుండి అమలులోకి రానున్నాయి. వీటిలో సింగపూర్‌కు వెళ్లే విమానాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం సింగపూర్ సేవలకు ఇంధన సర్‌ఛార్జ్ లేదు.

ALSO READ: రైలులో రీల్స్.. విసిగిపోయిన తోటి ప్రయాణికులు ఏం చేశారంటే?

ఎయిర్‌లైన్ సర్‌ఛార్జ్‌లను కాలానుగుణంగా సమీక్షిస్తుందని తెలిపింది. టాటా ఆధ్వర్యంలో నడిచే తక్కువ ఖర్చు విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రస్తుతానికి దాని విమానాలపై ఎటువంటి ఇంధన సర్‌ఛార్జ్‌ను విధించదు. ఇది ప్రయాణీకులకు కొంత ఉపశమనం కలిగించవచ్చు.

టాటా ఆధ్వర్యంలో నడిచే తక్కువ ఖర్చు విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రస్తుతానికి ఎలాంటి ఇంధన సర్‌ఛార్జ్‌ను విధించదు. ఇది ప్రయాణీకులకు కొంత ఉపశమనం కలిగింది. ఎయిరిండియా బాటలోనే మరికొన్ని విమాన సంస్థలు నడవనున్నట్లు తెలుస్తోంది.

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×