// // Van Rani Toy Train: టూరిస్టులకు గుడ్ న్యూస్, ఐదేళ్ల తర్వాత వనరాణి మళ్లీ ప్రారంభం! - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Van Rani Toy Train: టూరిస్టులకు గుడ్ న్యూస్, ఐదేళ్ల తర్వాత వనరాణి మళ్లీ ప్రారంభం!

Van Rani Toy Train: టూరిస్టులకు గుడ్ న్యూస్, ఐదేళ్ల తర్వాత వనరాణి మళ్లీ ప్రారంభం!
Advertisement

Van Rani Toy Train Re-Open: వన్ రాణి టాయ్ ట్రైన్.. ముంబై వాసులకు పెద్దగా పరిచయం అససరం లేదు. సంజయ్ గాంధీ నేషనల్ పార్క్లో ఉన్న ఈ టాయ్ ట్రైన్ పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అయితే, 5 సంవత్సరాల క్రితం ఈ రైలు సర్వీసులు నిలిచిపోగా, తాజాగా మళ్లీ ప్రారంభం అయ్యాయి. ఈ రైలు సర్వీసులను కేంద్ర మంత్రి, ముంబై ఎంపీ పియూష్ గోయల్ జెండా ఊపి ప్రారంభించారు.

1970 నుంచి టాయ్ ట్రైన్ సేవలు

ఈ పార్కులో సందర్శకులకు ఈ వన్ రాణి టాయ్ ట్రైన్ ట్రైన్ స్పెషల్ అట్రాక్షన్ గా కొనసాగుతుంది. పార్క్ కు వచ్చిన వాళ్లు కచ్చితంగా ఈ రైల్లో ఒక్కసారైనా జర్నీ చేస్తారు. ఈ పసుపు టాయ్ ట్రైన్ మొదట 1970లో నారో గేజ్ లైన్‌ లో పని చేయడం ప్రారంభించింది. ప్రారంభంలో ఈ రైలు డీజిల్ ఇంజిన్‌ తో 2.7 కి.మీ మార్గంలో నడిచేది. 5 సంవత్సరాల క్రితం వరకు ఈ రైలు సర్వీసులు కొనసాగాయి.

2021 నుంచి టాయ్ ట్రైన్ సేవలు నిలిపివేత

Advertisement

2021లో వచ్చిన తౌక్తే తుఫాను కారణంగా ఈ రైలు ట్రాక్‌లు పూర్తిగా దెబ్బతిన్నాయి. అనంతరం ఈ రైలు సేవలను అధికారులు నిలిపివేశారు. ఈ రైలు ట్రాక్ నిర్మాణ పనుల ప్రాజెక్ట్‌ ను RITES లిమిటెడ్ (రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్)కి అప్పగించారు. ఇందుకోసం రూ. 45 కోట్లుగా కేటాయించారు. అటు పార్క్ అధికారులు మరో రూ. 43 కోట్లు ఖర్చు చేశారు. తాజాగా పనులు పూర్తి కావడంతో ఈ సేవలను కేంద్రమంత్రి గోయెల్ ప్రారంభించారు.  ఈ టాయ్ ట్రైన్ ఈ ప్రాంతంలో పర్యాటకరంగ అభివృద్ధి ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఉత్తర ముంబైలోని అతి ముఖ్యమైన పర్యావరణ ప్రదేశాలలో ఒకటిగా కొనసాగుతుందన్నారు. “దహిసర్, బోరివాలి, మగథేన్ తో పాటు మొత్తం ఉత్తర ముంబై ప్రాంత నివాసితులు ఈ రైలు కారణంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సింహాలు,  పులులతో సహా గొప్ప జీవవైవిధ్యానికి నిలయమైన సంజయ్ గాంధీ పార్క్ ఇప్పుడు కాలుష్య రహిత రైలుతో మరింత అభివృద్ధి చెందనుంది” అని గోయెల్ చెప్పుకొచ్చారు.

ఇకపై ఛార్జింగ్ తో రైలు ప్రయాణం

ఇప్పటి వరకు వన్ రాణి టాయ్ ట్రైన్ డీజిల్ తో నడవగా, ఇకపై ఛార్జింగ్ తో నడవనుంది. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ రైలును తీర్చిదిద్దారు. కొత్త రైలు సెట్‌ గ్రీన్ బ్యాటరీతో పని చేసే కోచ్‌ లు ఉన్నాయి. వాటిలో మూడు విస్టా డోమ్ కోచ్‌లు పర్యాటకులకు పరిసరాలకు సంబంధించి 180 డిగ్రీల వ్యూను అందిస్తాయి. మిగిలిన ఐదు కోచ్‌లు ఓపెన్ సీటింగ్ కోచ్‌ లు. ఈ  టాయ్ ట్రైన్ కృష్ణగిరి ఉప్వాన్ ప్రాంతం మీదుగా వెళుతుంది. ఇది దాదాపు 5.5 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఈ మార్గంలో 20 మంది ప్రయాణీకులతో 30 నిమిషాలకు ఓ రైలు నడుస్తుంది.

Advertisement

Read Also: వందే భారత్ స్లీపర్‌ లో కొత్త బెడ్ షీట్లు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×