E-Paper
Advertisement

Train: సెవెన్‌హిల్స్ రైలులో ఎగిసిపడిన మంటలు.. ప్రయాణికులు బెంబేలు, చివరకు ఆ విధంగా

Train: సెవెన్‌హిల్స్ రైలులో ఎగిసిపడిన మంటలు.. ప్రయాణికులు బెంబేలు, చివరకు ఆ విధంగా
Advertisement

Train: తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు వస్తున్న సెవెన్‌హిల్స్ ఎక్స్‌ప్రెస్‌లో రాత్రి భారీ ప్రమాదం చోటు చేసుకుంది. రైలు చిగిచెర్ల వద్దకు చేరుకున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఉన్నట్లుండి మంటలు రావడంతో ప్రయాణికులు బెంబేలెత్తి పోయారు. ఈ ఘటన నేపథ్యంలో అరగంటపాటు రైలు నిలిచిపోయింది. సకాలంలో స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు వస్తోంది సెవెన్‌హిల్స్ ఎక్స్‌ప్రెస్ రైలు. సోమవారం రాత్రి 8. 55కి తిరుపతి నుంచి ఆ రైలు బయలు దేరింది. ఆ రైలు అనంతపురం జిల్లా ధర్మవరం మండలంలో చిగిచెర్ల వద్దకు రాగానే మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు చైన్ లాగడంతో రైలు ఆగిపోయింది.

Advertisement

రైల్లో మంటలు రావడం చూసి ప్రయాణికులు భయపడ్డారు. పొగలు రావడం గమనించిన ప్రయాణికులు భయంతో కేకలు వేశారు. దీంతో గందరగోళం చెలరేగింది. పరిస్థితి గమనించిన రైలు గార్డు, ప్రయాణికుల అరుపులు విని వెంటనే అక్కడికి చేరుకున్నాడు. వెంటనే లోకో పైలట్‌కు సమాచారం అందించాడు.

లోకో పైలట్, గార్డు, సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సకాలంలో తీసుకున్న చర్యలతో పెను ప్రమాదం తప్పింది. మంటలను గమనించిన ప్రయాణికులు కొందరు అప్పుడు రైలు దిగేశారు. ఈ ఘటన వల్ల చిగిచెర్ల వద్ద దాదాపు అరగంటపాటు రైలు నిలిచి పోయింది. ఆ రూట్లో వెళ్లే రైళ్లు కాస్త డిలే అవుతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

ALSO READ: రెడీ అయ్యింది భారీ వంతెన.. ఇక బుల్లెట్ ట్రైన్ పరుగుకు రెడీ

రంగంలోకి దిగిన సాంకేతిక సిబ్బంది తాత్కాలికంగా సమస్యను పరిష్కరించారు. అర గంట తర్వాత రైలు చెగిచెర్ల నుంచి సికింద్రాబాద్ కు బయలుదేరింది. ఈ ఘటనలో ప్రయాణికులు సేఫ్‌గా బయటపడడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై విచారణ ప్రారంభించింది రైల్వే విభాగం. బోగీ చక్రాల వద్ద బ్రేక్ బైండింగ్ వల్ల మంటలు చెలరేగినట్టు ప్రాథమికంగా తేలింది.

ఇటీవల అహ్మదాబాద్ విమాన ఘటన తర్వాత ప్రయాణికుల్లో భయం నెలకొంది. ఆ ఘటన తర్వాత ప్రమాదాలు ఇలా ఉంటాయా అంటూ దేశవ్యాప్తంగా చర్చించుకున్నారు. ప్రమాదాలు ఎప్పుడు ఏ రూపంలో వస్తాయో తెలియక కొందరిలో టెన్షన్ కనిపిస్తోంది.  ట్రావెల్ చేస్తున్నా ఓవైపు భయం వెంటాడుతోంది.

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×