E-Paper
Advertisement

ఈ రైల్వే స్టేషన్లలో ఫుడ్ టేస్ట్ చేసేందుకు క్యూ కట్టేస్తారు.. మీరూ అక్కడ దిగితే తినకుండా అస్సలు వెళ్లొద్దు!

ఈ రైల్వే స్టేషన్లలో ఫుడ్ టేస్ట్ చేసేందుకు క్యూ కట్టేస్తారు.. మీరూ అక్కడ దిగితే తినకుండా అస్సలు వెళ్లొద్దు!
Advertisement

8 Railway Stations Famous for Local Delicacies: దేశంలో రైలు ప్రయాణం అంటే కేవలం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లడం మాత్రమే కాదు. ప్రతి రాష్ట్రం, ప్రతి నగరానికి సంబంధించిన ప్రత్యేక రుచులను ఆస్వాదించే అవకాశం కూడా ఉంటుంది. కొన్ని రైల్వే స్టేషన్లు అక్కడ ఆగే రైళ్ల కంటే, అందుబాటులో ఉండే స్థానిక వంటకాల వల్లే దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. ఫుడ్ లవర్స్ జీవితంలో ఒక్కసారైనా తప్పకుండా వెళ్లాల్సిన కొన్ని టాప్ రైల్వే స్టేషన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

1.ఇటార్సీ జంక్షన్ (మధ్యప్రదేశ్)

దేశంలో అత్యంత రద్దీగా ఉండే జంక్షన్లలో ఇటార్సీ ఒకటి. ఇక్కడ దొరికే వేడి వేడి పోహా చాలా ఫేమస్. కొత్తిమీర, సేవ్‌ తో అలంకరించి అందిస్తారు. దీనితో పాటు వేడి జిలేబీ తింటే ఆ రుచి మరింత అద్భుతంగా ఉంటుంది. ఉదయం పూట ప్రయాణించే వారు ఈ కాంబినేషన్‌ను ఎక్కువగా ఇష్టపడతారు.

2.న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్

Advertisement

ఈ స్టేషన్ ఫుడ్ లవర్స్ కు బెస్ట్ ఆప్షన్. ఇక్కడ చోలే భటూరే, స్టఫ్డ్ పరాటాలు, పలు రకాల నార్త్ ఇండియన్ స్నాక్స్ సులభంగా దొరుకుతాయి. రైలు ఎక్కే ముందు, దిగిన తర్వాత చాలామంది వీటిని ఆస్వాదిస్తుంటారు.

3.హౌరా జంక్షన్ (పశ్చిమ బెంగాల్)

కోల్‌ కతాకు ప్రధాన ద్వారంగా చెప్పుకునే హౌరా స్టేషన్‌లో బెంగాలీ రుచులు ఆకట్టుకుంటాయి. కచోరీ, ఫిష్ కట్లెట్, పలు రకాల స్వీట్లు, వేడి చాయ్ ప్రయాణికులను ఆకట్టుకుంటాయి. స్టేషన్ పరిసరాల్లో కూడా సంప్రదాయ బెంగాలీ వంటకాలు అందుబాటులో ఉంటాయి.

4.చెన్నై సెంట్రల్ (తమిళనాడు)

Advertisement

సౌత్ ఇండియన్ బ్రేక్ ఫాస్ట్ కు చెన్నై సెంట్రల్ కేరాఫ్ గా చెప్పుకోవచ్చు. ఇడ్లీ, దోస, వడ, ఫిల్టర్ కాఫీ లాంటి వంటకాలు ఇక్కడ తాజాగా లభిస్తాయి. ఉదయం ప్రయాణించే వారు ఇష్టంగా తింటారు.

5.విజయవాడ జంక్షన్ (ఆంధ్రప్రదేశ్)

ఆంధ్రప్రదేశ్ అంటేనే ఘాటు రుచులు గుర్తుకు వస్తాయి. విజయవాడ జంక్షన్‌లో కూడా అదే ప్రత్యేకత కనిపిస్తుంది. బిర్యానీ, ఆంధ్ర భోజనం, స్థానిక స్నాక్స్ లభిస్తాయి. ప్రయాణికులతో పాటు స్థానికులు కూడా ఇక్కడి ఆహారాన్ని ఆస్వాదిస్తుంటారు.

6.ముంబై సీఎస్‌ఎమ్‌టీ (మహారాష్ట్ర)

ముంబైకి వెళ్లి వడా పావ్ తినకపోతే ఆ ప్రయాణం పూర్తికాదని చాలామంది అంటారు. సీఎస్‌ఎమ్‌టీ పరిసరాల్లో వడా పావ్‌ తో పాటు పావ్ భాజీ, మిసల్ పావ్ లాంటి మహారాష్ట్రకు చెందిన పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ కూడా లభిస్తాయి.

7.అమృత్‌ సర్ జంక్షన్ (పంజాబ్)

గోల్డెన్ టెంపుల్‌ కు సమీపంలో ఉన్న ఈ స్టేషన్‌లో పంజాబీ రుచులు ప్రత్యేకంగా లభిస్తాయి. వెన్నతో చేసిన కుల్చా, చోలే, చిక్కటి లస్సీ, పంజాబీ స్వీట్లు ప్రయాణికులను ఆకట్టుకుంటాయి.

8.రత్లాం జంక్షన్, మధ్యప్రదేశ్

రత్లాం స్టేషన్ లో కరకరలాడుతూ, కారంగా, అద్భుతమైన రుచితో ఉండే రత్లామీ సేవ్‌ ను ఫుడ్ లవర్స్ ను ఆకట్టుకుంటుంది. ఒక క్లాసిక్ రైల్వే స్నాక్‌ గా భావిస్తారు. దీనిని వేడి టీతో కలిపి తింటారు.

Read Also: వందే భారత్ క్రేజీ ఫుడ్ మెనూ.. బ్రేక్‌ ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకు ఎన్ని వెరైటీలు ఉన్నాయో తెలుసా?

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×