E-Paper
Advertisement

Longest Beaches: ప్రపంచంలో అత్యంత పొడవైన బీచ్ లు ఇవే, జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే!

Longest Beaches: ప్రపంచంలో అత్యంత పొడవైన బీచ్ లు ఇవే, జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే!
Advertisement

Worlds Longest Beaches: సముద్ర దీరంలో ఇసుకు తిన్నెలపై నిలబడి అలలతో ఆడుకుంటుంటే, ఎంత సంతోషంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అనంతదూరం విస్తరించి ఉన్న బీచ్ లు స్వేచ్ఛాయుత, అద్భుతమైన భావనను కలిగిస్తాయి. భారంతో కూడిన వ్యక్తులు అలా బీచ్ లో నడుస్తుంటే కాసేపటికి మనసు తేలికగా మారుతుంది. అలలు.. గాలి, కాలం కలిసి ఓ అందమైన అనుభూతిని అందిస్తాయి. ప్రపంచంలో అత్యంత పొడవైన బీచ్ లు ఉన్నాయి. వాటిలో టాప్ 5 బీచ్ ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

భూమిపై అత్యంత పొడవైన తీర ప్రాంతాలు 

⦿ ప్రైయా డో కాస్సినో, బ్రెజిల్:  ప్రపంచంలోనే అత్యంత పొడవైన బీచ్‌గా దీనికి పేరుంది. బ్రెజిల్ దక్షిణ తీరం వెంబడి సుమారు 254 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఈ బీచ్ రియో ​​గ్రాండే ఓడరేవు నుంచి ఉరుగ్వే సరిహద్దు వరకు విస్తరించి ఉంది. ఈ ప్రాంతం విశాలమైన ఇసుక తిన్నెలతో, సందడిగా ఉండే సముద్రతీర పట్టణాలతో మరింత ఆకర్షణీంగా ఉంటుంది. సుదీర్ఘ డ్రైవ్‌లు, తీరప్రాంత చేపల వేట, నిత్యం వేలాది మంది నడకను ఆస్వాదించే బీచ్ లు ఎంతగానో ఆకట్టుకుంటాయి.

Advertisement

⦿ నైన్టీ మైల్ బీచ్, ఆస్ట్రేలియా:  ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో ఉన్న ఈ బీచ్ 151 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. రద్దీగా ఉండే నగర జీవితం నుంచి ప్రశాంతమైన విశ్రాంతిని అందిస్తుంది. ఈ తీరప్రాంతం ఇసుక దిబ్బలు, సరస్సులు, రక్షిత రిజర్వ్‌ లతో ఆకట్టకుంటుంది. ఇక్కడి నీరు స్వచ్ఛంగా ఉండటం వల్ల ఈతగాళ్లకు, జాలర్లకు స్వర్గధామంగా కొనసాగుతుంది. అదే సమయంలో దీని మారుమూల ప్రాంతాలు అద్భుతంగా సహజసిద్ధంగా అనిపిస్తాయి.

⦿ కాక్స్ బజార్, బంగ్లాదేశ్: బంగాళాఖాతం వెంబడి 120 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న కాక్స్ బజార్.. ప్రపంచంలోనే అతి పొడవైన సహజ సముద్ర తీరంగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ తీరప్రాంతం అద్భుతమైన కొండచరియలు, మెత్తటి ఇసుక, చేపల వేట, పర్యాటకం చుట్టూ కేంద్రీకృతమై ఉంది. సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు, బీచ్ మొత్తం వెచ్చని రంగులతో మెరిసిపోతుంది. సందర్శకులకు, ఫోటోగ్రాఫర్లకు ఉత్సాహభరితమైన ఆకర్షణను అందిస్తుంది.

Advertisement

⦿ పాడ్రే ఐలాండ్ నేషనల్ సీషోర్, యునైటెడ్ స్టేట్స్: టెక్సాస్ తీరానికి సుమారు 112 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న పాడ్రే ఐలాండ్, ప్రపంచంలోనే అతి పొడవైన బారియర్ ఐలాండ్. ఇది అరుదైన సముద్ర తాబేళ్లు, వందలాది పక్షి జాతులతో సహా వన్యప్రాణులకు ఒక అభయారణ్యంగా కొనసాగుతుంది. ఈ బీచ్ సహజమైన వాతావరణానికి, వన్యప్రాణులతో ఎంతో అద్భుతంగా ఉంటుంది. సందర్శకులు తరచుగా క్యాంపింగ్, పక్షులను చూడటం, నడక కోసం వస్తుంటారు.

⦿ నైన్టీ మైల్ బీచ్, న్యూజిలాండ్: న్యూజిలాండ్‌లోని నైన్టీ మైల్ బీచ్ 88 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది.  అద్భుతమైన దృశ్యాలతో యాత్రికులను మంత్రముగ్ధులను చేస్తుంది.  ఉధృతమైన అలలు, ఎత్తైన ఇసుక దిబ్బలు, ఆకాశంలో కనిపించే దృశ్యాలు చూపరులను ఆకట్టుకుంటాయి.

Read Also: సంతోషకరమైన దేశాలు ఓకే.. సంతోషం లేని దేశాలు ఏవి?

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×