E-Paper
Advertisement

Hyderabad Underrated Locations: హైదరాబాద్‌లోని.. ఈ ఫేస్‌లను చూడకపోతే చాలా మిస్సవుతారు !

Hyderabad Underrated Locations: హైదరాబాద్‌లోని.. ఈ ఫేస్‌లను చూడకపోతే చాలా మిస్సవుతారు !
Advertisement

Hyderabad Underrated Locations: హైదరాబాద్ అంటే చార్మినార్, గోల్కొండ కోట, హుస్సేన్ సాగర్ లేక్ మాత్రమే కాదు. ఈ రద్దీ నగరంలో.. ఇంకా ఎంతో మందికి తెలియని, అద్భుతమైన అనుభూతులను అందించే ప్రదేశాలు చాలా ఉన్నాయి. సాహసాలను, ప్రశాంతతను కోరుకునే వారికి ఐదు అన్-రేటెడ్ లొకేషన్లు మీ నెక్ట్ ట్రిప్‌కు సరైన ఎంపిక . అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. దుర్గం చెరువు (సీక్రెట్ లేక్) – సాహసం, ప్రశాంతత కలయిక:
హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్ రద్దీకి దగ్గరగా ఉన్నప్పటికీ.. దుర్గం చెరువుకి “సీక్రెట్ లేక్” అనే పేరు ఉంది. ఇటీవలి కాలంలో హ్యాంగింగ్ బ్రిడ్జ్ వల్ల ప్రాచుర్యం పొందినా.. చెరువు చుట్టూ ఉన్న పార్క్, అడ్వెంచర్ స్పాట్ ఇప్పటికీ చాలా మందికి తెలియవు.

Advertisement

ఎందుకు ప్రత్యేకం: ఈ చెరువు ప్రశాంతమైన వాతావరణాన్ని అందిస్తుంది. ఇక్కడ బోటింగ్, స్పీడ్ బోటింగ్ వంటివి ఎంజాయ్ చేయొచ్చు. పార్క్ లో వాకింగ్ , ఉదయం జాగింగ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. నగరంలోని బిల్డింగ్స్, కొత్త బ్రిడ్జ్ ఒకే చోట చూడటం అద్భుతంగా ఉంటుంది.

అడ్వెంచర్: స్పీడ్ బోటింగ్ ప్రయత్నించవచ్చు లేదా పార్క్ చుట్టూ రాక్ క్లైంబింగ్ కోసం ఉన్న ప్రాంతాలను చూడొచ్చు.

Advertisement

2. భూంగీర్/భువనగిరి కోట – ట్రెక్కింగ్:
భువనగిరి కోట హైదరాబాద్‌కు కొంచెం దూరంగా ఉన్నా (దాదాపు 50 కి.మీ), అడ్వెంచర్స్ ఇష్టపడే వారికి ఇది బాగా నచ్చుతుంది. ఈ చారిత్రక కోటను చేరడానికి కొండపైకి ఎక్కాల్సి ఉంటుంది.

ఎందుకు ప్రత్యేకం: ఇదొక ఎత్తైన గుట్టపై ఉన్న ఏకశిలా కోట. దీనిని చేరుకోవడానికి కాస్త కష్టపడాలి. అందుకే ఇది చిన్న ట్రెక్కింగ్ అనుభవాన్ని ఇస్తుంది. పైకి చేరుకున్న తర్వాత.. చుట్టు పక్కల ప్రాంతాల యొక్క విశాల దృశ్యాలు కనువిందు చేస్తాయి. ట్రెక్కింగ్, చరిత్రను ఒకేసారి ఆస్వాదించాలనుకునే వారికి ఇది ఉత్తమ ఎంపిక.

అడ్వెంచర్ కోసం: రాక్ క్లైంబింగ్, రాప్పెలింగ్ వంటి సాహసాలను ఇక్కడ తరచుగా నిర్వహిస్తారు.

3. మౌలా అలీ దర్గా:
మౌలా అలీ దర్గా ఆధ్యాత్మిక ప్రశాంతతను అందించే అన్-రేటెడ్ ప్రదేశం. ఇది ఒక కొండపై ఉంది. అందుకే దీనిని చేరడానికి దాదాపు 500కి పైగా మెట్లు ఎక్కాలి.

ఎందుకు ప్రత్యేకం: మెట్లు ఎక్కడం అనేది ఒక చిన్నపాటి శారీరక వ్యాయామం, చివరగా దర్గా దగ్గర నుంచి కనిపించే నగర దృశ్యం కోసం ఆ కష్టం విలువైనదే. ఇక్కడ ముఖ్యంగా సూర్యాస్తమయం చాలా అద్భుతంగా కనిపిస్తుంది. పైనుండి నగరపు విస్తరణను చూడటం కొత్త అనుభూతిని ఇస్తుంది.

అడ్వెంచర్ కోసం: శారీరక సవాలుగా భావించి మెట్లు ఎక్కడం, ముఖ్యంగా చల్లని ఉదయం లేదా సాయంత్రం వేళల్లో ఆనందాన్ని ఇస్తుంది.

4. శామీర్‌పేట్ చెరువు- పక్షులు, ప్రశాంత :
నగరానికి కొంచెం దూరంగా ఉన్నప్పటికీ.. శమీర్‌పేట్ చెరువు ఒక ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన ప్రాంతం. ఈ చెరువు నీటితో.. చుట్టూ పచ్చని వాతావరణంతో ఉంటుంది.

ఎందుకు ప్రత్యేకం: ఇది పిక్నిక్‌లు, పక్షులకు చాలా మంచి ప్రదేశం. ముఖ్యంగా వలస పక్షులు వచ్చే సీజన్లో ఇక్కడికి వెళ్లడం ఒక అద్భుతమైన అనుభవం. నగరంలోని రణగొణ ధ్వనుల నుంచి ఉపశమనం పొందాలనుకునేవారికి ఇది చక్కటి ఎస్కేప్.

అడ్వెంచర్ కోసం: సరస్సు చుట్టూ ఉన్న దారుల్లో బైక్ రైడ్ లేదా లేక్ పక్కన క్యాంపైన్ చేయవచ్చు.

Also Read: జుట్టు పెరగడానికి నూనె ఒకటే సరిపోదు.. ఇవి కూడా చేయాల్సిందే !

5. పైగా సమాధులు –  చరిత్ర :
చార్మినార్, గోల్కొండ కోట మాదిరిగా కాకుండా.. పైగా సమాధుల (పాగా టూంబ్స్) గురించి చాలా తక్కువ మందికి తెలుసు. నగరంలో దాగి ఉన్న ఈ ప్రదేశం, అద్భుతమైన నిర్మాణ శైలికి నిలయం.

ఎందుకు ప్రత్యేకం: పైగా వంశీకుల సమాధులు ఇవి. ఇక్కడ ఉన్న మార్బుల్ చెక్కడాలు , జాలీ పనితనం చాలా ప్రత్యేకమైనవి. మొగల్, రాజస్థానీ వాస్తు శిల్పాల సమ్మేళనంతో నిర్మించిన ఈ సమాధులు.. చరిత్ర ప్రియులకు, ఫోటోగ్రాఫర్లకు ఒక అడ్వెంచర్ లాంటివి. ఈ రద్దీ లేని ప్రదేశంలో నిశబ్దంగా చరిత్రను చూడవచ్చు.

అడ్వెంచర్ కోసం: క్లిష్టమైన, అద్భుతమైన వాస్తు శిల్పాన్ని దగ్గరగా పరిశోధించడం ఒక సాంస్కృతిక అడ్వెంచర్‌గా చెప్పవచ్చు.

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×