// // Meghalaya Trip: వర్షాకాలంలో మేఘాలయకు వెళ్తున్నారా? ఈ తప్పులు అస్సలు చేయొద్దు! -->
E-Paper
Advertisement

వర్షాకాలంలో మేఘాలయకు వెళ్తున్నారా? ఈ తప్పులు అస్సలు చేయొద్దు!

వర్షాకాలంలో మేఘాలయకు వెళ్తున్నారా? ఈ తప్పులు అస్సలు చేయొద్దు!
Advertisement

Meghalaya Monsoon Travel Guide:  వర్షాకాలంలో ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకునే వారికి మేఘాలయ బెస్ట్ ప్లేస్. ఎత్తైన కొండలు, పచ్చని లోయలు, జాలువారే జలపాతాలు, పొగమంచుతో కప్పుకున్న ప్రకృతి దృశ్యాలు ప్రతి పర్యాటకుడిని ఆకట్టుకుంటాయి. అందుకే ఈ సీజన్‌లో మేఘాలయకు వెళ్లాలని చాలామంది ప్లాన్ చేస్తుంటారు. అయితే, వర్షాకాలంలో అక్కడ భారీ వర్షాలు పడుతుంటాయి. కొన్ని ప్రాంతాల్లో రోడ్లు జారుడుగా మారడం, కొండచరియలు విరిగిపడటం, ట్రావెల్ కు ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. అందుకే ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే  ప్రయాణం మరింత సేఫ్ గా, హ్యాపీగా కొనసాగుతుంది.

ముందుగా వాతావరణ పరిస్థితులు తెలుసుకోండి!

మేఘాలయలో వాతావరణం క్షణాల్లో మారిపోతుంది. ఎండగా ఉన్నా ఒక్కసారిగా భారీ వర్షం పడే అవకాశం ఉంటుంది. అందుకే, ప్రయాణానికి ముందు వాతావరణ సూచనను తప్పకుండా పరిశీలించాలి. భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడే హెచ్చరికలు ఉంటే ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడం మంచిది.

వర్షంలో ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు తీసుకోండి!   

Advertisement

వర్షాకాలంలో సరైన వస్తువులు వెంట ఉంటే ప్రయాణం చాలా సౌకర్యంగా ఉంటుంది. రెయిన్‌ కోట్, పాంచో, గొడుగు, తేలికపాటి జాకెట్, త్వరగా ఆరిపోయే దుస్తులు, జారకుండా ఉండే ట్రెక్కింగ్ షూస్ తప్పకుండా తీసుకెళ్లాలి. అలాగే, మొబైల్ ఫోన్, ముఖ్యమైన డాక్యుమెంట్స్, అడిషనల్ డ్రెస్సులు వాటర్‌ ప్రూఫ్ బ్యాగుల్లో ఉంచితే వర్షం వల్ల తడవకుండా ఉంటాయి.

పగటి వేళల్లోనే ప్రయాణించండి!

వర్షాల కారణంగా కొండ ప్రాంతాల్లో రోడ్లు జారుడుగా మారవచ్చు. కొన్ని చోట్ల పొగమంచు కారణంగా దూరం స్పష్టంగా కనిపించకపోవచ్చు. అందుకే ఉదయం ప్రయాణం ప్రారంభించి, చీకటి పడకముందే గమ్యస్థానానికి చేరుకునేలా ప్రణాళిక వేసుకోవాలి. ఇలా చేస్తే ప్రయాణం మరింత సురక్షితంగా ఉంటుంది.

స్థానిక అధికారుల సూచనలు పాటించండి!

Advertisement

వాతావరణ పరిస్థితులను బట్టి కొన్ని పర్యాటక ప్రాంతాలు, రహదారులను అధికారులు తాత్కాలికంగా మూసివేయవచ్చు. అలాంటి సమయంలో నిబంధనలను అతిక్రమించి వెళ్లేందుకు ప్రయత్నించకూడదు. స్థానిక అధికారులు, హోటల్ సిబ్బంది లేదా గైడ్‌లు ఇచ్చే సూచనలను పాటించడం వల్ల ప్రమాదాలను నివారించవచ్చు.

క్యాష్ లు, మందులు తప్పకుండా వెంట ఉంచుకోండి!

షిల్లాంగ్ లాంటి ప్రధాన నగరాల్లో డిజిటల్ చెల్లింపులు అందుబాటులో ఉన్నప్పటికీ, కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సరిగా పనిచేయకపోవచ్చు. అందుకే, కొంత క్యాష్ వెంట ఉంచుకోవడం మంచిది. అలాగే మీరు క్రమం తప్పకుండా వాడే మందులతో పాటు ప్రాథమిక ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా తీసుకెళ్లాలి. దూర ప్రాంతాల్లో మెడికల్ షాపులు వెంటనే దొరకకపోవచ్చు.

ఈ ప్రణాళికతో పాటు వాతావరణ పరిస్థితులపై అవగాహన కలిగి ఉంటే మేఘాలయలోని ప్రకృతి అందాలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆస్వాదించవచ్చు. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మీ వర్షాకాల యాత్ర మరింత మధురమైన అనుభవంగా మిగిలిపోతుంది.

Read Also: నల్లగొండ జిల్లాలో ఇంత అందమైన జలపాతం ఉందా? వర్షాకాలంలో ఒక్కసారైనా వెళ్లాల్సిందే!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×