E-Paper
Advertisement

TS Inter Results: తెలంగాణ ఇంటర్ ఫలితాలపై కీలక అప్డేట్.. ఈనెల 20వ తేదీ తర్వాతే రిజల్ట్స్

TS Inter Results: తెలంగాణ ఇంటర్ ఫలితాలపై కీలక అప్డేట్..  ఈనెల 20వ తేదీ తర్వాతే రిజల్ట్స్
Advertisement

TS Inter Results 2024 update(Latest news in telangana): తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలపై కీలక అప్డేట్ వచ్చింది. త్వరలోనే ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పేపర్ కరెక్షన్ పూర్తైనట్లు సమాచారం. ఇక మరోసారి జవాబుపత్రాలను పరిశీలిస్తున్నారు. ఈ తరుణంలో ఈనెల 20 తేదీ తర్వాతే ఫలితాలను వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.

పరిశీలన ప్రక్రియ పూర్తైన వెంటనే ఇంటర్మీడియట్ బోర్డు ఫలితాలను వెల్లడించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా, ఫిబ్రవరి 28వ తేదీ నుంచి మార్చి 19 వరకు పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 9 లక్షల మంది విద్యార్థులు హాజర్యయారు. ఇక మార్చి 10వ తేదీ నుంచే జవాబుపత్రాల మూల్యాంకన ప్రక్రియను ప్రారంభించారు.

Advertisement

ప్రస్తుతం దేశంలో ఎన్నికల హడావుడి నడుస్తోంది. ఈ తరుణంలో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో పరీక్ష ఫలితాలను అతి త్వరగా వెల్లడించాలని బోర్డు ప్రయత్నాలు చేస్తోంది. జవాబు పత్రాల మూత్యాంకన ప్రక్రియ నాలుగు దశల్లో కొనసాగుతోంది. ఈ తరుణంలో ప్రస్తుతం ఒక దశ మూల్యాంకనం పూర్తైంది. ఇక మిగతా మూడు దశల వాల్యుయేషన్ ప్రక్రియను బోర్డు ఈనెలాఖరులోపు పూర్తి చేయనుంది. ఇది పూర్తి చేయడానికి ఈనెల 20వ తేదీ వరకు సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇప్పటికే ఏపీ ఇంటర్ ఫలితాలు నిన్న విడుదలైన విషయం తెలిసిందే.

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×