E-Paper
Advertisement

ZPTC Murder : చేర్యాల ZPTC మృతిపై అనుమానాలెన్నో.. హత్య కోణంలో దర్యాప్తు ..?

ZPTC Murder : చేర్యాల ZPTC మృతిపై అనుమానాలెన్నో.. హత్య కోణంలో దర్యాప్తు ..?
Advertisement

ZPTC Murder : సిద్దిపేట జిల్లా చేర్యాల జడ్పీటీసీ సభ్యుడు మల్లేశం అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఈ ఉదయం వాకింగ్‌కు వెళ్లిన ఆయన తీవ్ర గాయాలతో కుప్పకూలారు. చికిత్స కోసం హైదరాబాద్‌ తరలిస్తుండగా మార్గంమధ్యలో మల్లేశం ప్రాణాలు కోల్పోయారు.

గుర్జకుంట గ్రామానికి చెందిన మల్లేశం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున చేర్యాల జడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. చేర్యాల పెద్దమ్మగడ్డ జడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుకున్న ఆయన.. ఆదివారం జరిగిన పూర్వవిద్యార్థుల సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ ఉదయం వాకింగ్‌కు వెళ్లిన తర్వాత గుర్జకుంటలోని చేర్యాల మార్గంలో తలకు తీవ్ర గాయాలై రక్తపు మడుగులో పడి ఉన్నారు. స్థానికులు సహకారంతో కుటుంబసభ్యులు తొలుత సిద్దిపేటలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో ప్రాణాలు కోల్పోయారు.

Advertisement

పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆధారాలను సేకరించారు. ఎలా చనిపోయారా? ఎవరైనా హత్య చేశారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మల్లేశం మృతిపై జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆరా తీశారు.

మరోవైపు ఇటీవల స్థానికంగా భూతగాదాలు, రాజకీయ గొడవలు జరిగాయని తెలుస్తోంది. ఈ క్రమంలో మల్లేశంను ఎవరైనా హత్య చేశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో ఓ వ్యక్తి పోలీసులకు లొంగిపోయినట్లు తెలుస్తోంది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×