E-Paper
Advertisement

Praneeth Hanumanthu : బ్రేకింగ్.. యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు అరెస్ట్

Praneeth Hanumanthu : బ్రేకింగ్.. యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు అరెస్ట్
Advertisement

Praneeth Hanumanthu Arrest : యూట్యూబర్ ప్రణీత్ హనుమంతును బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల తండ్రి కూతుళ్లపై అసభ్యకర కామెంట్లు చేసిన ప్రణీత్ హనుమంతును అరెస్ట్ చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ అయ్యాయి. బెంగళూరు పోలీసులు అతడిని అరెస్ట్ చేసి.. పీటీ వారెంట్ పై హైదరాబాద్ కు తరలిస్తున్నారు.

అమెరికాలో ఉంటున్న ఒక తెలుగు ఫ్యామిలీ సోషల్ మీడియాలో షేర్ చేసిన రీల్ పై.. సోషల్ మీడియా వికృత రూపమైన ప్రణీత్ కుమార్ అసభ్యంగా కామెంట్స్ చేశాడు. తండ్రికుమార్తె బంధాన్ని అపహాస్యం చేస్తూ.. ప్రణీత్ వేసిన కుళ్లు జోకులు.. అతనికి తోడు అతని బ్యాచ్ నీఛంగా కామెంట్స్ చేయడంపై హీరో సాయి ధరమ్ తేజ్ X వేదికగా ట్వీట్ చేశారు. అతనిపై చర్యలు తీసుకోవాలంటూ.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు.

Advertisement

Also Read : సోషల్ మీడియాను మించిన ఆయుధం లేదు.. దానంత దరిద్రమూ లేదు

సాయిధరమ్ తేజ్ ట్వీట్ తో ప్రణీత్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. మహేశ్ బాబు, పృథ్వి కూడా ప్రణీత్ ట్రోలింగ్ కు గురైన బాధితులే కావడం గమనార్హం. మంచు మనోజ్, నారా రోహిత్, విశ్వక్ సేన్, కార్తికేయ కూడా అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి వారిని ఊరికే వదిలేయకూడదని, చట్టరీత్యా చర్యలు తీసుకుంటేనే.. మళ్లీ అలాంటివి జరగకుండా ఉంటాయని తెలిపారు. ముఖ్యంగా కార్తికేయ.. అలాంటి వాళ్లకు తన సినిమా ప్రమోషన్ కోసం ఇంటర్వ్యూ ఇచ్చినందుకు బాధపడుతున్నట్లు చెప్పాడు. వాళ్లతో తాను వీడియోలో ఉండాల్సి వచ్చినందుకు చిరాకుగా ఉందన్నారు. ఇకపై తానెవరికి ఇంటర్వ్యూలు ఇస్తున్నానో ఒకటికి రెండుసార్లు చూసుకుంటానని తెలిపారు.

Advertisement

యూట్యూబ్ లో ఇప్పుడు కుప్పలు తెప్పలుగా కంటెంట్ క్రియేటర్లు వచ్చిపడ్డారు. వారిలో బాగా పాపులర్ అయిన వారిలో ప్రణీత్ ఒకడు. ఇటీవల సుధీర్ బాబు హీరోగా వచ్చిన హరోంహరలో చిన్న క్యారెక్టర్లో కనిపించాడు. ఇక నటుడిగా అవకాశాల కోసం ట్రై చేస్తున్నాడు. పైకి కనిపించేంత అమాయకుడేమీ కాదు. నెట్టింట కనిపించే వీడియోలపై తన గ్యాంగ్ తో చెత్త కామెంట్లు చేస్తూ ఉంటాడు. ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ అధికారి అరుణ్ కుమార్ హనుమంతు కుమారుడైన ప్రణీత్ హనుమంతు.. యూట్యూబ్ లో ఇలాంటి చెత్త రోస్ట్ వీడియోలు చేస్తూ వచ్చాడు. ప్రణీత్ హనుమంతు అన్నయ్య.. అజయ్ హనుమంతు ఏ జూడ్ అనే యూ ట్యూబ్ ఛానల్ ద్వారా స్టైలింగ్ టిప్స్ ఇస్తూ ఉంటాడు. తాజాగా ప్రణీత్ అరెస్ట్ అవ్వడంతో.. అతనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×