E-Paper
Advertisement

Hyderabad: గంజాయి మత్తులో కారు పైకి ఎక్కి.. యువకుడు హల్ చల్..

Hyderabad: గంజాయి మత్తులో కారు పైకి ఎక్కి.. యువకుడు హల్ చల్..
Advertisement

Hyderabad: హైదరాబాద్ నగర యువత మత్తులో ఊగుతోంది. పోలీసులు ఎంత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినా.. మత్తుగాళ్లకు కళ్లెం వేయలేకపోతున్నారు. గంజాయి సేవించిన వ్యక్తి  మత్తులో బీభత్సం సృష్టించాడు. ఓ వ్యక్తి తన ఫ్యామిలీతో కారులో వెళ్తుండగా వాహనాన్ని ఆపి హల్‌చల్ చేశాడు.

కుటుంబాన్ని భయబ్రాంతులకు గురిచేసిన ఘటన
వివరాల్లోకి వెళ్తే.. ఓ వ్యక్తి తన కుటుంబంతో కలిసి కారులో వెళ్తుండగా, ఆ యువకుడు వారి వాహనాన్ని అడ్డగించి బానెట్‌పైకి ఎక్కాడు. నడిరోడ్డుపైకి వచ్చి అరుస్తూ, కార్లను అడ్డగించి హల్‌చల్ చేశాడు. పిచ్చెక్కిన వ్యక్తిలా మాట్లాడుతూ వీరంగం సృష్టించాడు. కారులో ఉన్న పిల్లలు, మహిళలు భయంతో షాక్‌కు గురయ్యారు. ఆ యువకుడిని కారు దిగి వెళ్లిపోమని చెప్పినా వినలేదు. చివరకు అక్కడి స్థానికులు జోక్యం చేసుకుని.. అతడిని కారు దిగి వెళ్లేలా చేశారు.

Advertisement

ప్రజలలో ఆందోళన
ఈ సంఘటనపై వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రజలు ఈ ఘటనపై తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇటీవల నగరంలో గంజాయి, డ్రగ్స్ వినియోగం పెరిగిపోయింది, పోలీసులు ఇలాంటి వాళ్లను గుర్తించి వారిని కఠిన శిక్షలు విధించాలని కోరుతున్నారు.

పోలీసుల స్పందన – ఆచూకీ కోసం గాలింపు
ఈ సంఘటనపై స్పందించిన పోలీసులు, యువకుడి ఆచూకీ కోసం సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. అతడు ఎవరు? ఎక్కడి వారు? అనే విషయాలపై దర్యాప్తు జరుగుతోంది. వాహనదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి.. కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఇలాంటి సంఘటనలు మరల జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

Advertisement

డ్రగ్స్ ముఠాల కదలికలపై నిఘా
ఈ నేపథ్యంలో నగరంలో.. గంజాయి సరఫరా చేస్తున్న ముఠాలపై.. పోలీసులు నిఘా ఉంచుతున్నారు. ఇప్పటికే పలుచోట్ల రైడ్స్ నిర్వహించి గంజాయి పట్టుకున్న ఘటనలు ఉన్నాయి. కానీ తక్కువ మొత్తాల్లో విక్రయించే వ్యక్తులు ఇంకా పట్టుబడటం లేదు. ముఖ్యంగా విద్యార్థులు, నిరుద్యోగ యువత గంజాయికు బానిసలవుతున్న ఘటనలు.. తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×