E-Paper
Advertisement

Karimnagar News: భార్యని సర్పంచ్ చేద్దామని లేటు వయసులో.. పెళ్లి కట్ చేస్తే..

Karimnagar News: భార్యని సర్పంచ్ చేద్దామని లేటు వయసులో.. పెళ్లి కట్ చేస్తే..
Advertisement

Karimnagar News: తన భార్యను సర్పంచ్‌ పదవిలో చూడాలని ఆశపడ్డ ఓ యువకుడికి ఎన్నికల సంఘం షాకిచ్చింది. గ్రామంలో సర్పంచ్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడంతో.. ఎలాగైనా పదవి దక్కించుకోవాలని ఆరాపడిన అతడు..పెళ్లి చేసుకుని.. తన అర్థాంగిని సర్పంచ్‌ చేయాలనుకున్నాడు. హడావుడిగా పెళ్లి చేసుకుని.. సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయించాలని ప్లాన్ వేశాడు. అయితే సర్పంచ్ పదవి కోసం పోటీ చేయాలంటే ఊర్లో ఓటర్‌గా నమోదు కావాల్సి ఉంటుంది. అయితే ఓటర్ నమోదులో ఆలస్యం కావడంతో.. ఇప్పుడు ఆ యువకుడు కుటుంబానికి సర్పంచ్ పదవి దూరమైంది.

కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నాగిరెడ్డి పూర్ గ్రామానికి చెందిన శంకర్‌కు .. సర్పంచ్‌గా పోటీ చేయాలని ఆసక్తి ఉండేది. అయితే గ్రామంలో పదవి ఎస్సీ మహిళగా రిజర్వ్ అయింది. దీంతో ఎలాగైనా తన కుటుంబానికి సర్పంచ్‌ పదవి దక్కాలని భావించిన శంకర్.. ఉన్నఫలంగా పెళ్లి చేసుకుని.. పోటీలో తన భార్యను నిలబెట్టానుకున్నాడు. హడావుడిగా ఈ నెల 26న నల్గొండ జిల్లాకు చెందిన ఓ యువతిని వివాహమాడాడు. అనంతరం ఆమె పేరును ఓటర్ జాబితాలో చేర్చి.. సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయించాలనుకున్నాడు. కానీ తానోకటి తలిస్తే.. దేవుడు మరోలా తలిచినట్లు.. శంకర్.. తన భార్య పేరును ఓటర్‌గా నమోదు చేయడంలో ఆలస్యం వహించాడు.

Advertisement

Also Read: 2047కు 1.39 లక్షల మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన, కానీ.. ఆ విషయంలో వెనుకబడ్డాం: భట్టి విక్రమార్క

ఈ ఆలస్యమే..అతని ఆశలకు గండికొట్టింది. సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ వరకు ఓటర్ జాబితాలో నమోదైన వారికే పోటీ చేయడానికి అర్హత ఉండటంతో.. శంకర్‌.. గడువులోగా నమోదు చేయించలేకపోయాడు. దీంతో శంకర్ భార్య పోటీ చేయడానికి అర్హత సంపాదించలేదు. సర్పంచ్ పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న శంకర్.. తన ఆశలు అడియాశలు కావడంతో.. నిరాశలో మునిగిపోయాడు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×