E-Paper
Advertisement

Karimnagar News: లవ్ మ్యారేజ్ వ్యవహారం.. సినిమా స్టయిల్‌లో దాడి, అమ్మాయిని లాక్కెళ్లిన బంధువులు

Karimnagar News: లవ్ మ్యారేజ్ వ్యవహారం.. సినిమా స్టయిల్‌లో దాడి, అమ్మాయిని లాక్కెళ్లిన బంధువులు
Advertisement

Karimnagar News: వారిద్దరు మనసులు కలిశాయి.. ప్రేమించుకున్నారు.  చివరకు పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. వివాహానికి అమ్మాయి బంధువులు ఎదురు తిరిగారు. అయినా ససేమిరా కాదన్నారు. ఇద్దరు మేజర్ కావడంతో ప్రేమ వివాహం చేసుకోవాలని నిర్ణయించారు. దేవాలయంలో వారం కింద వివాహం చేసుకున్నారు. ఈ విషయం తెలిసి ఆగ్రహంతో రగిలిపోయారు అమ్మాయి బంధువులు. సోమవారం కారులో వచ్చిన అమ్మాయి బంధువులు, అబ్బాయి కుటుంబసభ్యులతో దాడి చేసి అమ్మాయిని సినీ పక్కిలో లాకెళ్లారు. సంచలనం రేపిన ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో వెలుగుచూసింది.

లవ్ మ్యారేజ్ వ్యవహారం

Advertisement

కరీంనగర్ జిల్లా మల్యాల మండల కేంద్రానికి చెందిన 27 ఏళ్ల ముత్తు‌కుమార్ లవ్‌లోపడ్డాడు. గుంటూరు జిల్లా మాచర్ల ప్రాంతానికి చెందిన మాదవిని ప్రేమించాడు. వీరి ఇద్దరు మనసులు కలిశాయి. అయితే  పెళ్లికి అమ్మాయి తరపువాళ్లు ససేమిరా అన్నారు. దీన్ని ఆ ప్రేమికులు పట్టించుకోలేదు. పెళ్లికి అమ్మాయి తల్లిదండ్రులు ఎదురు తిరుగుతుండడంతో గతంలో ఇరు కుటుంబాలు పోలీస్ స్టేషన్‌ గడప తొక్కాయి. ఇరు కుటుంబాలకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అయినా అమ్మాయి బంధువుల మనసు అంగీకరించలేదు.

చివరకు వారం రోజుల కిందట కొండగట్టు సన్నిధి‌లో ముత్తుకుమార్-మాధవి ప్రేమ పెళ్లి చేసుకున్నారు.  వీరి పెళ్లి విషయం తెలియగానే మాచర్లలోని అమ్మాయి బంధువులు ఆగ్రహంతో రగిలిపోయారు. అమ్మాయిని అక్కడి నుంచి తీసుకురావాలని డిసైడ్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆదివారం అర్థరాత్రి గుంటూరు జిల్లా మాచర్ల నుంచి కారులో అరడజను మంది బయలుదేరారు. వాహనంలో కర్రలు, ఐరన్ రాడ్లు పెట్టుకున్నారు. సోమవారం మధ్యాహ్నం సమయంలో మాల్యాల ప్రాంతానికి చేరుకున్నారు మాధవి బంధువులు. వీధిలో వాహనం ఆపి నేరుగా ముత్తుకుమార్ ఇంట్లోకి వెళ్లారు.

Advertisement

సినిమా స్టయిల్‌లో దాడి, అమ్మాయిని లాక్కెళ్లిన బంధువులు

అబ్బాయి కుటుంబ సభ్యులపై కర్రలతో దాడి చేశారు. అక్కడి నుంచి అమ్మాయిని లాక్కొని పోయారు ఆమె బంధువులు. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేసిన అబ్బాయి తల్లిదండ్రులు. అమ్మాయి ప్రాణాలకు ముప్పు ఉందని, కుటుంబసభ్యులు దాడి చేసే అవకాశముందని పేర్కొన్నారు. ఆమెకి వెంటనే రక్షణ కల్పించాలని కోరారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ విషయం ఆ ఊరివారు తెలుసుకునే సరికి మాధవి బంధువులు ఆ ఊరు దాటిపోయారు. మాధవి సొంతూరుకి చెందిన పోలీసులతో మాల్యాల పోలీసులు మాట్లాడారు.

ALSO READ: డ్యామేజ్ కాకుండా బీఆర్ఎస్ ప్లాన్, కవితపై ఎదురుదాడి

గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. కొద్దిరోజుల కిందట గుంటూరు జిల్లాకి చెందిన ఓ యువతి వెస్టుగోదావరికి చెందిన ఓ యువకుడ్ని ప్రేమించింది. పెళ్లి మండపానికి అమ్మాయి బంధువులు వచ్చి యువకుడి ఫ్యామిలీని కొట్టి, యువతిని తీసుకెళ్లిపోయిన సంగతి తెల్సిందే.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×