E-Paper
Advertisement

Yellow Alert in Telangana: తెలంగాణపై మిగ్‌జాం ఎఫెక్ట్.. ఆ జిల్లాల్లో ఎల్లో అలర్ట్

Yellow Alert in Telangana: తెలంగాణపై మిగ్‌జాం ఎఫెక్ట్.. ఆ జిల్లాల్లో ఎల్లో అలర్ట్
Advertisement

Yellow Alert in Telangana: మిగ్‌జాం దెబ్బకు ఏపీ, తమిళనాడు రాష్ట్రాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. రెండు రాష్ట్రాల్లో కురుస్తోన్న భారీ వర్షాల ధాటికి లోతట్టు ప్రాంతాలు జలమయమవ్వగా.. కొన్ని చోట్ల ఈదురుగాలులకు చేట్లు నేలకూలాయి. భారీ వర్షాల కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఏపీలో కోస్తా తీరప్రాంత జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు.

కాగా.. మిగ్‌జాం తెలంగాణ జిల్లాల్లోనూ తీవ్ర ప్రభావం చూపిస్తుందని వాతావరణశాఖ తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తుపాన్ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

Advertisement

నైరుతి బంగాళాఖాతం మీదుగా కొనసాగుతున్న మిగ్‌జాం తుపాను కారణంగా.. తూర్పు దిశ నుంచి తెలంగాణ వైపు గాలులు వీస్తున్నాయని ఐఎండీ వెల్లడించింది. వాటి ప్రభావంతో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండలలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఉరుములు, మెరుపులతో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది.

జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డిలలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

Advertisement

మంగళవారం.. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు, నల్గొండ, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండలలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. తుపాన్ కారణంగా గాలులు పెరగడంతో తెలంగాణలో చలితీవ్రత పెరిగే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×