E-Paper
Advertisement

Collector Anurag Jayanthi: రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేపట్టాలి : కలెక్టర్ అనురాగ్ జయంతి

Collector Anurag Jayanthi:  రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా  ధాన్యం కొనుగోలు చేపట్టాలి : కలెక్టర్ అనురాగ్ జయంతి
Advertisement

Collector Anurag Jayanti: యాదాద్రి భువనగిరి జిల్లాలో రబి లో సుమారు 4.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా ఉందని,రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు ప్రక్రియ సాఫీగా జరిగేలా అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. గురువారం మినీ మీటింగ్ హల్ లో సివిల్ సప్లై మేనేజర్, సివిల్ సప్లై అధికారులు, అగ్రికల్చర్,కో -ఆపరేటివ్, మెప్మా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నాలుగు లక్షల యాభై వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రానుందని అన్నారు.జిల్లాలో 330 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

Also Read: RTC Workers Issues: రిటైర్డ్ ఉద్యోగుల సొమ్ముపై రేవంత్ సర్కార్ కన్ను? హరీశ్ రావు సంచలన కామెంట్స్!

దిగుమతి చేసుకునేలా చర్యలు తీసుకోవాలి 

Advertisement

కేంద్రాల్లో గన్ని బ్యాగులు, టార్పాలిన్లు, మాయిచ్చర్ మిషన్లు, ప్యాడి క్లీనర్, తూకం పరికరాల వంటి అన్ని సదుపాయాలు ముందుగానే సిద్ధంగా ఉంచాలన్నారు. గన్ని బ్యాగుల కొరత, రవాణా సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, మిల్లులకు ధాన్యం తరలించిన వెంటనే దిగుమతి చేసుకునేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. వేసవికాలం నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల్లో త్రాగునీరు,టెంట్లు, కుండల్లో చల్లటి మంచినీరు, నీడ ఏర్పాట్లు తప్పనిసరిగా చేయాలన్నారు. ప్రతి రోజు కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం వివరాలను ట్రక్ షీట్ లో నమోదు చేసి రికార్డులు నిర్వహించాలని ఆదేశించారు.

పారదర్శకంగా కొనుగోలు నిర్వహించాలి 

అన్ని కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా కొనుగోలు నిర్వహించాలని ఆయన అధికారులకు సూచించారు. తదుపరి ఖరీఫ్ 2025-26 CMR బియ్యం డెలివరీ పూర్తి చేయాలని పౌరసరఫరాల అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమం లో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి,సివిల్ సప్లై డిఎం హరికృష్ణ, సివిల్ సప్లై రోజారాణి , వ్యవసాయ అధికారి రమణారెడ్డి, ట్రాన్స్పోర్ట్ అధికారి సాయి కృష్ణ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Also Read: BlackHeads Removal: టవల్ ట్రిక్‌తో ముఖంపై ఉన్న బ్లాక్ హెడ్స్ ఇలా తొలగించుకోండి

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×