E-Paper
Advertisement

Yadadri Collector: ఇలాంటి కలెక్టర్లు చాలా అరుదు.. స్కూల్‌కి రాని స్టూడెంట్ ఇంటికి వెళ్లి..?

Yadadri Collector: ఇలాంటి కలెక్టర్లు చాలా అరుదు.. స్కూల్‌కి రాని స్టూడెంట్ ఇంటికి వెళ్లి..?
Advertisement

Yadadri Collector: ఇది కదా ప్రజా సేవ అంటే.. ప్రజలకు కావాల్సింది ఇలాంతి కలెక్టర్ కదా.. ఈ రోజుల్లో నిజాయితీ పని చేసే కలెక్టర్ల పేర్లు చేతి వేళ్లతో లెక్కపెట్టొచ్చు.. స్టూడెంట్స్, పేదలు, సమస్యల గురించి పట్టించుకునే కలెక్టర్లు చాలా అరుదు.. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని సింగన్న గూడెం ఇందిరమ్మ కాలనీ నివాసి బానోతు సుస్మిత పదవ తరగతి చదువుతోంది. అయితే సుస్మిత కొద్దిరోజులుగా పాఠశాలకు సరిగా హాజరు కావడం లేదు. ఈ విషయం కలెక్టర్ దృష్టికి వచ్చింది. విద్యార్థుల హాజరు సమస్యను కేవలం రికార్డుకే పరిమితం చేయకుండా కలెక్టర్ సుస్మిత ఇంటికి వెళ్ళారు.

పాఠశాలకు ఎందుకు రావడం లేదు అని కలెక్టర్ సుస్మితను అడిగి తెలుసుకున్నారు. సుస్మిత తల్లి ఆరోగ్యం సరిగా లేదు. తండ్రి మేస్త్రి పనికి వెళ్తారు. తల్లికి సహాయంగా ఇంట్లో ఉండటం వలన రోజూ బడికి రాలేకపోతున్నా అని సుస్మిత వివరించింది. కలెక్టర్ ఇంటికి వెళ్ళిన సమయానికి సుస్మిత అన్న తల్లిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ పరిస్థితిని చూసి కలెక్టర్ చలించిపోయారు. ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తాను చూసుకుంటా అని సుస్మితకు హామీ ఇచ్చారు. రేపటి నుండి తప్పకుండా రోజూ పాఠశాలకు రావాలని సుస్మితకు సూచించారు.

Advertisement

విద్యార్థిని ఇంట్లో చదువుకోవడానికి సరైన సౌకర్యాలు లేవు అని కలెక్టర్ గుర్తించారు. వెంటనే స్టడీ చైర్ రైటింగ్ పాడ్ సాయంత్రంలోపు పంపిస్తా అని సుస్మితకు మాట ఇచ్చారు. ప్రజా సేవ అంటే ఇదేనని కలెక్టర్ నిరూపించారు. నిజాయితీగా పేద విద్యార్థుల సమస్యలను తీర్చే కలెక్టర్లు అరుదు. సుస్మిత లాంటి విద్యార్థులకు ఇలాంటి అధికారుల అండ చాలా అవసరం. ప్రజలకు కావాల్సింది ఇలాంటి కలెక్టరే కదా అని సోషల్ మీడియాలో నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.

సుస్మిత తల్లి ఆరోగ్య సమస్య ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువుకు దూరం కాకుండా కలెక్టర్ చొరవ తీసుకున్నారు. ఇది చాలా మంది విద్యార్థులకు ఆదర్శంగా నిలిచే అంశం. కలెక్టర్ చేసిన ఈ పనిపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అధికారులంతా ఇదే స్ఫూర్తితో పనిచేస్తే పేద విద్యార్థులు చదువు విషయంలో ఎలాంటి రాజీ పడకుండా ముందుకెళ్తారు.

Advertisement

ALSO READ: Jeevan Reddy: ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదు.. మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×