E-Paper
Advertisement

CM Revanth Reddy: దావోస్‌లో తెలంగాణ పెట్టుబడుల వేట.. ఫోరం ఎండీతో సీఎం రేవంత్ కీలక భేటీ!

CM Revanth Reddy: దావోస్‌లో తెలంగాణ పెట్టుబడుల వేట.. ఫోరం ఎండీతో సీఎం రేవంత్ కీలక భేటీ!
Advertisement

CM Revanth Reddy: దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (WEF) సదస్సులో పెవిలియన్‌లో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ మేనేజింగ్ డైరెక్టర్ జెరెమీ జర్గెన్స్, C4IR నెట్‌వర్క్ కోఆర్డినేషన్ హెడ్ మంజు జార్జ్‌లతో సమావేశమయ్యారు. ఈ భేటీలో భాగంగా, ప్రతి ఏటా జూలైలో హైదరాబాద్‌లో ‘వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ఫాలో-అప్’ సదస్సును నిర్వహించాలని ముఖ్యమంత్రి ప్రతిపాదించారు. జనవరిలో దావోస్‌లో తీసుకున్న నిర్ణయాల పురోగతిని సమీక్షించడానికి ఈ వేదిక ఉపయోగపడుతుందని, దీనివల్ల తెలంగాణ పారిశ్రామిక సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పవచ్చని ఆయన వివరించారు.

తెలంగాణ ప్రతిపాదనపై WEF మేనేజింగ్ డైరెక్టర్ జెరెమీ జర్గెన్స్ సానుకూలంగా స్పందించారు. చైనాలో జరుగుతున్న ‘సమ్మర్ దావోస్’ తరహాలోనే హైదరాబాద్‌లో కూడా ఇటువంటి కార్యక్రమం నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఉన్న అపారమైన మానవ వనరులు, ప్రభుత్వ దార్శనికతను ప్రశంసించిన ఆయన, తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌లో భాగస్వాములు కావడానికి ఆసక్తి కనబరిచారు.

Advertisement

రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో రూపొందించిన రోడ్‌మ్యాప్‌ను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వివరించారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ వంటి వినూత్న కార్యక్రమాల ద్వారా యువతకు నైపుణ్య శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. పరిశ్రమలు, సాంకేతిక రంగాల్లో తెలంగాణ సాధిస్తున్న వృద్ధిని ప్రపంచ స్థాయి ప్రతినిధులకు వివరించారు.

హైదరాబాద్‌లో ఇప్పటికే విజయవంతంగా కొనసాగుతున్న C4IR (సెంటర్ ఫర్ ది ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్) పురోగతిపై కూడా చర్చలు జరిగాయి. లైఫ్ సైన్సెస్, ఆరోగ్య రంగాల్లో ఇది భారత్‌లోనే తొలి థీమాటిక్ సెంటర్ అని గుర్తు చేస్తూ, పరిశ్రమల అభివృద్ధికి సంబంధించిన ఉత్తమ పరిశోధన ఫలితాలను తెలంగాణ ప్రభుత్వంతో పంచుకుంటామని WEF ప్రతినిధులు పేర్కొన్నారు.

Advertisement

మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న CURE, PURE, RARE ఆర్థిక వ్యూహాలను వివరించారు. ముఖ్యంగా ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ ప్రాజెక్టును దేశంలోనే మొదటి నెట్-జీరో గ్రీన్‌ఫీల్డ్ స్మార్ట్ సిటీగా, సుస్థిర అభివృద్ధికి రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. ఇది రాబోయే కాలంలో రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రాన్ని మారుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Also Read: మేడారం జాతరలో హైటెక్ సేవలు.. ఇక వాట్సాప్‌లోనే పూర్తి సమాచారం

మరో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఏరోస్పేస్, డిఫెన్స్, ఫార్మా, సాఫ్ట్‌వేర్ రంగాల్లో హైదరాబాద్‌కు ఉన్న అంతర్జాతీయ గుర్తింపును ప్రముఖంగా ప్రస్తావించారు. ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక ఇంధనం వంటి భవిష్యత్ అవసరాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, పెట్టుబడులకు తెలంగాణ అత్యంత అనుకూలమైన ప్రాంతమని స్పష్టం చేశారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×