E-Paper
Advertisement

Aswaraopeta: కార్పొరేట్ ఫ్యాక్టరీల్లో కార్మికుల పరిస్థతి దారుణం.. పెరుగుతున్న ఆరోగ్య సమస్యలు..!

Aswaraopeta: కార్పొరేట్ ఫ్యాక్టరీల్లో కార్మికుల పరిస్థతి దారుణం.. పెరుగుతున్న ఆరోగ్య సమస్యలు..!
Advertisement

Aswaraopeta: స్వేచ్ఛ బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పరిసర ప్రాంతాల్లో ఉన్న పలు కార్పొరేట్ ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్న కార్మికుల పరిస్థితి రోజురోజుకు ఆందోళనకరంగా మారుతోంది. సంవత్సరాలుగా పనిచేస్తున్నప్పటికీ కార్మికుల జీవన స్థితిలో మార్పు కనిపించకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. కార్మికులు తీవ్ర శ్రమ చేస్తున్నప్పటికీ కార్మిక చట్టాల ప్రకారం తగిన వేతనాలు అందడం లేదని, నెలకు రూ.20–30 వేల వరకు కూడా జీతం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదకర రసాయనాల మధ్య పనిచేస్తున్న కార్మికులకు అవసరమైన రక్షణ పరికరాలు ఇవ్వకపోవడం, నియమిత వైద్య పరీక్షలు నిర్వహించకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని తెలిపారు. ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో వాటిని బయటకు రానీయకుండా దాచిపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి.

ఫ్యాక్టరీలపై తీవ్ర విమర్శలు..

బాయిలర్, రసాయన విభాగాల్లో పనిచేసే కార్మికులు ఎప్పటికప్పుడు ప్రమాద భయం మధ్యే విధులు నిర్వర్తిస్తున్నారని సమాచారం. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) నిధుల వినియోగంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిధులు విడుదలవుతున్నాయా లేదా, విడుదలైనప్పటికీ ఎక్కడ ఖర్చవుతున్నాయో స్పష్టత లేకపోవడం గమనార్హం. స్థానిక అభివృద్ధి, విద్య, ఆరోగ్య రంగాల్లో ఈ నిధులు వినియోగించాల్సి ఉన్నప్పటికీ ఆ దిశగా పనులు కనిపించడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇక పర్యావరణ పరిరక్షణ విషయంలో కూడా ఫ్యాక్టరీలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాలుష్య కారకమైన వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండా విడుదల చేయడం వల్ల పరిసర ప్రాంతాలు కాలుష్యానికి గురవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.

Advertisement

Also Read: Ghatkesar: నాలుగేళ్లుగా పోలీసులకు చుక్కలు చూపిస్తున్న స్మగ్లర్.. ఎలా చిక్కాడంటే?

కోట్ల రూపాయల లాభాలు

గాలి, తాగునీరు కాలుష్యం కారణంగా సమీప గ్రామాల్లో ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలో కాలుష్య నియంత్రణ చర్యలు సరిగా అమలు కావడం లేదని, సంబంధిత కాలుష్య నియంత్రణ బోర్డు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి. కార్పొరేట్ ఫ్యాక్టరీలు కోట్ల రూపాయల లాభాలు ఆర్జిస్తున్నప్పటికీ కార్మికులకు తగిన ప్రయోజనాలు అందకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తమవుతోంది.ఈ నేపథ్యంలో అశ్వారావుపేట ప్రజలు కాలుష్య సమస్యల నుంచి విముక్తి కల్పించాలని, కార్మికుల సంక్షేమాన్ని కాపాడాలని, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Also Read: CM Revanth Reddy: పండుగ వేల రైతు భరోసా నిధుల పై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి..!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×