E-Paper
Advertisement

CM Revanth Reddy: గల్ఫ్ కార్మికులకు బీమా.. ప్రత్యేక బోర్డు ఏర్పాటు..

CM Revanth Reddy: గల్ఫ్ కార్మికులకు బీమా.. ప్రత్యేక బోర్డు ఏర్పాటు..
Advertisement

CM Revanth Reddy latest speech(Telangana today news): గల్ఫ్ కార్మికులకు బీమా కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే గల్ఫ్ కార్మికులు చనిపోతే రూ. 5 లక్షలు అందిస్తున్నామని సీఎం తెలిపారు. గల్ఫ్ కార్మిక సంఘాల నాయకుల సమావేశంలో మాట్లాడిన సీఎం.. సెప్టెండర్ 17 లోగా వారి సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు.

ఉత్తర తెలంగాణ నుంచి ఎక్కువ మంది గల్ఫ్ కార్మికులు ఉన్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఏజెంట్ల బారిని పడి కొందరు.. అక్కడకు వెళ్లాక యాజమాన్యం చేతిలో మరికొందరు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గల్ఫ్, ఇతర దేశాకు వెళ్లే కార్మికుల కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటుకు అధ్యయనం చేస్తున్నామన్నారు. ప్రజాభవన్‌లో ఒక ప్రత్యేక వ్వవస్థను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాట్ చేసి గల్ఫ్ కార్మికుల సమస్యలు పరిష్కారమయ్యేలా కృషి చేస్తామని తెలిపారు.

Advertisement

సెప్టెంబర్ 17 లోగా గల్ఫ్ కార్మికుల సమస్యలను పరిష్కారించడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసే బాధ్యత తనదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఫిలిప్పీన్స్ విధానాలను స్పష్టంగా అధ్యయనం చేశామని తెలిపారు. ఇక కేరళ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కూడా అధ్యయనం చేశామన్నారు. ఇప్పటికే ఒక పాలసీ డాక్యుమెంట్ తయారు చేశామని ప్రస్థుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉందని.. కోడ్ ముగిశాక ప్రభుత్వం తరఫున కార్మిక సంఘాలను ఆహ్వానిస్తామని సీఎం స్పష్టం చేశారు. పాలసీ డాక్యుమెంట్ పై కార్మిక సంఘాల అభిప్రాయాలను, సూచనలను తీసుకుని ముందుకెళతమని తెలిపారు.

Also Read: రైతులకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నాటికి రూ.2 లక్షల రుణమాఫీ: సీఎం రేవంత్ రెడ్డి

Advertisement

గల్ఫ్ కార్మికులకు న్యాయపరమైన సాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని సీఎం తెలిపారు. వారు ఏజెంట్ల చేతుల్లో మోసపోకుండా చర్యలు తీసుకుంటాం అని అన్నారు. ఏజెంట్లు రాష్ట్ర ప్రభుత్వం వద్ద నమోదు చేసుకునేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. గల్ఫ్ దేశాలకు వెళ్లే వారికి ఒక వారం రోజులు శిక్షణ అందించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×